ఆర్థిక మంత్రిత్వ శాఖ

సిజిఎస్‌టి జోన్లు, జిఎస్‌టి ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.35000 కోట్లు ప్రమేయం ఉన్న


నకిలీ ఐటిసిలు కలిగిన వారిపై 8000 కేసులు నమోదు

Posted On: 13 JUL 2021 5:12PM by PIB Hyderabad

జిఎస్‌టి పాలనలో ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ)కి సంబంధించిన ప్రయోజనకరమైన నిబంధనను దుర్వినియోగం చేయడం జిఎస్‌టి చట్టం ప్రకారం ఎగవేత యొక్క అత్యంత సాధారణంగా జరిగిపోతోంది. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ కేంద్ర బోర్డు (సిబిఐసి) క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న విభాగాలు  జిఎస్‌టి  అమలు ప్రారంభంలోనే ఇటువంటి కేసులను క్రమం తప్పకుండా గుర్తించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో సిజిఎస్‌టి జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ (డిజిజిఐ) రూ.35000 కోట్లకు సంబంధించి నకిలీ ఐటీసీ లు ఉన్న సుమారు 8000 కేసులను నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సిఏలు, న్యాయవాదులు, సూత్రధారులు, లబ్ధిదారులు, డైరెక్టర్లు వంటి 14 మంది నిపుణులతో సహా 426 మందిని అరెస్టు చేశారు. నకిలీ ఐటిసి లభ్యత, వినియోగం అధిక నిష్పత్తిని పరిశీలిస్తే నకిలీ  జిఎస్‌టి  ఇన్వాయిస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ 9 నవంబర్ 2020న ప్రారంభమై  ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే గత రెండు మూడు నెలల్లో తీవ్రమైన కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మరియు సంబంధిత భద్రతా సమస్యల కారణంగా, డ్రైవ్ మందగించింది, అయితే క్రమంగా లాక్‌డౌన్ ఎత్తివేయడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాలలో కోవిడ్ -19 పరిస్థితిని మెరుగుపరచడం, ఈ విభాగం తిరిగి సమన్వయంతో డ్రైవ్‌ను ప్రారంభించింది.  ప్రభుత్వ ఖజానాకు నష్టాన్ని కలిగించే మోసగాళ్ళకు వ్యతిరేకంగా జిఎస్‌టి ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్, అన్ని కేంద్ర జీఎస్టీ విభాగాల పని ఈ నెలలో వేగం పుంజుకుంది. యోగ్యత లేని సంస్థలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఈ డ్రైవ్‌లో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి ఇంటెలిజెన్స్ మరియు సిబిఐసి పరిధిలోని సిజిఎస్‌టి జోన్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1200 సంస్థలతో సంబంధం ఉన్న 500 కి పైగా కేసులను గుర్తించి 24 మందిని అరెస్టు చేశాయి. సిబిఐసి అధికారులు చేసిన అరెస్టుల సంఖ్య ఇటీవలి కాలంలో అత్యధికం.

మోసగాళ్ళను పట్టుకోవటానికి సిబిఐసి అధికారులు సరికొత్త ఐటి సాధనాలు, డిజిటల్ ఆధారాలు మరియు ఇతర ప్రభుత్వ విభాగాల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నారు. చట్టంలో శాసన మరియు విధానపరమైన మార్పులతో పాటు, దేశవ్యాప్త డ్రైవ్ మెరుగైన సమ్మతి మరియు ఆదాయ సేకరణకు దోహదపడింది. డ్రైవ్ సమయంలో, కొన్ని ప్రసిద్ధ సంస్థలపై నకిలీ ఐటిసి లభించిన కేసులను కూడా బుక్ చేశారు.

మోసపూరితమైన పద్ధతిలో పేరుకుపోయిన ఐటిసి రిఫండ్ ని క్లెయిమ్ చేసిన మూడు సంస్థల మోసపూరిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) రూ. 214 కోట్లు తో సహా ముఖ్యమైన కేసులు ఇటీవల నమోదయ్యాయి. ఈ సంస్థలు నకిలీ అద్దె ఒప్పందాలు మరియు నకిలీ విద్యుత్ బిల్లులను సమర్పించాయి. అవి తమ రిజిస్టర్డ్ వ్యాపార స్థలం నుండి ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగకుండా కాగితంపై మాత్రమే ఉన్నాయి. ఈ సంస్థలు ఒక సాధారణ ఉత్పత్తి ఎగుమతులను చూపుతున్నాయి, అంటే పైపులు సిగరెట్ల కోసం ధూమపాన మిశ్రమాలు 28 శాతం జిఎస్‌టి ఉండగా, పరిహార సెస్ 290% గా ఉంది.

మరొక సందర్భంలో, డిజిజిఐ చండీగఢ్ జోనల్ యూనిట్, 115 కోట్ల రూపాయలకు అక్రమ ఐటిసిని పొందినందుకు నకిలీ సంస్థలను నిర్వహిస్తున్న ఒక సూత్రధారిని బుక్ చేసి పట్టుకుంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా కేంద్రంగా ఉన్న వివిధ ఇనుము మరియు ఉక్కు యూనిట్లకు అనుమతించలేని ఐటిసిని పంపించడానికి కల్పిత / బూటకపు సంస్థలు ఉపయోగించబడుతున్నాయి అనే సమాచారంపై, హిమాచల్ ప్రదేశ్ (బడ్డి) మరియు పంజాబ్‌లోని పలు ప్రాంగణాల్లో సోదాలు జరిగాయి, అక్కడ ల్యాప్‌టాప్లో సాక్ష్యాలు ఉన్నాయి. మోసపూరిత లావాదేవీలను రుజువు చేసే ఇ-మెయిల్స్, పెన్ డ్రైవ్‌లు, మొబైల్ ఫోన్‌లు ఉన్నాయి. అదేవిధంగా మోసపూరిత ఐటిసి కేసును డిజిజిఐ సూరత్‌ జోనల్ యూనిట్ కూడా బుక్ చేసింది, ఇందులో ఉనికిలో లేని సంస్థలు అక్రమ ఐటిసికి రూ. 300 కోట్లు ఇన్వాయిస్‌ల సరఫరాలో నిమగ్నమై ఉన్నట్లు బయటపడింది. 

సిజిఎస్‌టి జైపూర్ జోన్, మోసపూరిత ఐటిసిపై రూ. 100 కోట్లకు పైగా మోసం చేసిన కొన్ని సంస్థలను గుర్తించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఐటిసి మోసం కేసులో, సిజిఎస్టి ఢిల్లీ జోన్ రూ.551 కోట్లు నకిలీ ఇన్ వాయిస్ లు, రూ. 91 కోట్లు నకిలీ ఐటీసీలు పాస్ చేసిన  23 సంస్థల నెట్ వర్క్ ను గుర్తించింది. ఈ నకిలీ సంస్థలు బిటుమినస్ మిశ్రమాలు, బేస్ లోహాలు, ఫర్నిచర్,  తలుపుల ఇన్వాయిస్లను జారీ చేస్తున్నాయి. ఈ నకిలీ ఇన్వాయిస్ గూడుపుఠాణి లో పాల్గొన్న ముగ్గురు ముఖ్య వ్యక్తులను అరెస్టు చేశారు. మరో సందర్భంలో,  సిజిఎస్‌టి  అహ్మదాబాద్ జోన్ ఐటిసి మోసం బయటపెట్టింది. ఇనుము, ఉక్కు నకిలీ ఇన్వాయిస్‌లు జారీ చేయడం ద్వారా రూ. 38 కోట్ల మేర మోసపూరిత ఐటిసిలను పాస్ చేయడానికి పదమూడు నకిలీ సంస్థలపై ఈ కేసులు నమోదయ్యాయి. 

చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాను మోసం చేస్తున్న నకిలీ ఇన్వాయిస్ మోసగాళ్ళు, ఇతర  జిఎస్‌టి ఎగవేతదారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.

 

నకిలీ ఐటిసి కేసులతో పాటు, డిజిజిఐ మరియు ఇతర సిజిఎస్టి విభాగాలు కూడా వస్తువులు మరియు సేవల  వర్గీకరణ, తక్కువ అంచనా మరియు రహస్య సరఫరాతో కూడిన జిఎస్టి ఎగవేతను గుర్తించాయి.

***



(Release ID: 1735250) Visitor Counter : 178