ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్‌ కు వెళ్లే భారతదేశం క్రీడాకారుల బృందం తో సంభాషించిన ప్రధాన మంత్రి


క్రీడాకారులతో, వారి కుటుంబ సభ్యుల తో అనధికారికం గా, ఆకస్మికం గా ఆయన భేటీ అయ్యారు

135 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలు మీకందరికీ దేశం తరఫున అందే ఆశీస్సులు: ప్రధాన మంత్రి

ఆటగాళ్ల కు మెరుగైన శిక్షణ శిబిరాలను, పరికరాలను, అంతర్జాతీయ అవకాశాలను  కల్పించడమైంది: ప్రధాన మంత్రి

యావత్తు దేశం నేడు తమ లో ప్రతి ఒక్కరితో ఓ కొత్త ఆలోచన తో, సరికొత్త విధానం తో ఏ విధంగా మద్దతిస్తున్నదో క్రీడాకారుల కు ప్రత్యక్షం గా తెలుసు: ప్రధాన మంత్రి

ఇంత పెద్ద సంఖ్యలో పలు క్రీడల లో క్రీడాకారులు, క్రీడాకారిణులు ఒలింపిక్స్‌ కు అర్హత ను సాధించడం ఇదే మొదటి సారి: ప్రధాన మంత్రి

భారతదేశం తొలి సారి గా అర్హత ను సాధించిన క్రీడ లు అనేకం ఉన్నాయి: ప్రధాన మంత్రి

‘చీర్4ఇండియా’ అని నినదించడం దేశ వాసుల బాధ్యత: ప్రధాన మంత్రి

Posted On: 13 JUL 2021 6:54PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో ఒలింపిక్స్‌ కు వెళ్లే భారతదేశ క్రీడాకారుల దళం తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా   సంభాషించారు.  వారితో ప్రధాన మంత్రి జరిపిన మాటామంతీ, క్రీడాకారులు  ఆటల పోటీల లో పాల్గొనే కంటే ముందుగానే వారి లో ఉత్తేజం నింపే ఒక ప్రయత్నం గా ఉంది.  ఈ సందర్భం లో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ ఠాకుర్‌, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిశీధ్ ప్రామాణిక్‌, న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజూలు కూడా  పాల్గొన్నారు.

క్రీడాకారుల తో అప్పటికప్పుడు సాగిన ఈ అనధికారికమైనటువంటి, అత్యంత సహజమైనటువంటి సంభాషణ క్రమం లో ప్రధాన మంత్రి వారిలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు వారి కుటుంబాలు చేస్తున్న త్యాగాలకు గాను కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.  విలువిద్య క్రీడాకారిణి  దీపికా కుమారి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ప్రపంచ చాంపియన్‌ శిప్‌ లో స్వర్ణ పతకాన్ని సాధించినందుకు అభినందించారు.  ఆమె అద్భుత యాత్ర విల్లంబుల తో మామిడి కాయల ను పడగొట్టడం ద్వారా ఆరంభం అయిందని ఆయన అన్నారు.  ఒక క్రీడాకారిణి రూపం లో ఆమె ఇప్పటి వరకు చేసిన యాత్ర ను గురించిన సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకొన్నారు. ప్రధాన మంత్రి అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ, తాను తన పూర్వ నిర్ధారిత మార్గం లో నిరంతరం మొక్కవోని ఆత్మవిశ్వాసం తో పయనించినందుకు మరో విలుకాడు ప్రవీణ్‌ జాదవ్‌ ను గొప్ప గా కొనియాడారు. ఆయన కుటుంబం తో కూడా ప్రధాన మంత్రి మాట్లాడి వారి అలుపెరుగని ప్రయాసల ను మెచ్చుకొన్నారు.  ఆయన పరివారం తో శ్రీ నరేంద్ర మోదీ మరాఠీ భాష లో ముచ్చటించారు.

నీరజ్‌ చోప్ డా (జావెలిన్‌ త్రో) తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ భారత సైన్యం లో పనిచేసినప్పటి ఆయన అనుభవాల తో పాటు కొద్ది కాలం క్రితం తగిలిన దెబ్బ నుంచి కోలుకోవడాన్ని గురించి కూడా వివరాల ను అడిగి తెలుసుకొన్నారు.  శ్రీ నరేంద్ర మోదీ ఆ క్రీడాకారుని తో చిర పరిచితమైన విస్తృత అంచనాల ను గురించి ఏమీ పట్టించుకోకుండా తన సర్వశ్రేష్ఠ ప్రతిభ ను ప్రదర్శించాలని సూచించారు.  స్ప్రింట్ క్రీడాకారిణి దుతీ చంద్‌ తో శ్రీ నరేంద్ర మోదీ తన సంభాషణ ను మొదలుపెడుతూ, నిజానికి ఆమె పేరు కు ‘ప్రకాశం’ అనే అర్థం ఉందని వివరించారు.  దానికి తగినట్లే ఆమె తన క్రీడా కౌశలం మాధ్యమం ద్వారా ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నందుకు గాను ఆమె ను అభినందించారు.  క్రీడాకారుల వెన్నంటి యావత్తు భారతదేశం ఉన్నందువల్ల జంకు గొంకు  లేకుండా ముందుకు సాగిపొండి అంటూ ప్రధాన మంత్రి ఆమె కు సూచించారు.  బాక్సింగ్‌ క్రీడాకారుడు ఆశీష్‌ కుమార్‌ తో మాట్లాడుతూ, అసలు ఈ క్రీడ నే ఎందుకు ఎంచుకొన్నారు అంటూ ప్రధాన మంత్రి ఆరా తీశారు.  ప్రధాన మంత్రి ఆయన ను ఒక పక్క కోవిడ్‌-19 తో పోరాడుతూనే, మరొక పక్క శిక్షణ ను నిరంతరం గా కొనసాగించడం ఎలా చేశారు ? అని ప్రశ్నించాగారు.  తండ్రి మరణించినప్పటికీ తన లక్ష్యాన్నుంచి చెదరిపోకుండా ఉన్నందుకు గాను ఆయన ను ప్రధాన మంత్రి అభినందించారు.  ఆ స్థితి నుంచి కోలుకొనే కాలం లో తనకు కుటుంబం, మిత్రుల నుంచి అందిన భారీ సహకారాన్ని ఆ క్రీడాకారుడు గుర్తు కు తెచ్చాడు.  శ్రీ నరేంద్ర మోదీ ఆ సందర్భం లో  క్రికెట్ క్రీడాకారుడు సచిన్‌ తెందుల్ కర్‌ ఇదే విధమైన పరిస్థితుల లో తన తండ్రి ని కోల్పోయారని, అయితే మళ్లీ ఏ విధం గా ఆయన తన ప్రత్యేక ఆట మాధ్యమం ద్వారా తన తండ్రి కి శ్రద్ధాంజలి ని సమర్పించిందీ గుర్తు చేశారు.

అనేక మంది క్రీడాకారులకు, క్రీడాకారిణులకు ఆదర్శ ప్రాయం గా నిలచారంటూ మేరీ కామ్‌ (మహిళా బాక్సర్‌) ను ప్రధాన మంత్రి కొనియాడారు.  ఒక వైపు కుటుంబం పైన శ్రద్ధ తీసుకొంటూనే ముఖ్యం గా మహమ్మారి విజృంభణ నేపథ్యం లో తన క్రీడ పైన సైతం అంకితభావాన్ని చూపడం ఎలా సాధ్యం అయింది అంటూ మేరీ కామ్ ను ప్రధాన మంత్రి అడిగారు.  మేరీ కామ్ కు ఇష్టమైన ‘పంచ్‌’ ఏది? అని, మేరీ కామ్ కు ఇష్టమైన క్రీడాకారులు ఎవరెవరు అంటూ ప్రధాన మంత్రి అడిగి తెలుసుకో గోరారు.  మేరీ కామ్ కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలిపారు.  పి.వి. సింధు (బాడ్ మింటన్‌) తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి లో ఆమె అభ్యాసం ఎలాగ సాగిందని ఆరా తీశారు.  ఆమె శిక్షణ కాలం లో ఆహారానికి గల ప్రాముఖ్యాన్ని గురించి కూడా ఆయన అడిగారు.  ప్రధాన మంత్రి పి.వి. సింధు  తల్లితండ్రుల తో మాట్లాడుతూ తమ పిల్లల ను క్రీడాకారులు గా తీర్చిదిద్దాలని కోరుకొనే తల్లితండ్రుల కు మీరు ఎలాంటి సలహాల ను, సూచనల ను ఇస్తారు అంటూ వారి ని ప్రశ్నించారు.  ఒలింపిక్స్‌ లో సింధు సఫలం కావాలని ప్రధాన మంత్రి అభిలషిస్తూ క్రీడాకారులు, క్రీడాకారిణులు తిరిగి వచ్చాక వారికి తాను స్వాగతం పలుకుతానని, ఆ వేళ తాను కూడా ఆమె తో ‘ఐస్‌క్రీమ్‌’ ను ఆరగిస్తానన్నారు.

ఇలావేనిల్‌ వలారివన్‌ (షూటింగ్‌) తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఆ క్రీడ పై ఆమె కు ఆ క్రీడ పైన ఆసక్తి ఎలా ఏర్పడిందీ వాకబు చేశారు.  గుజరాత్‌ లోని అహమదాబాద్‌ లో పెరిగి, పెద్దది అయిన ఆమె జీవన గమనాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఆమె తల్లితండ్రుల కు తమిళం లో శుభాకాంక్షలు తెలిపారు.  ఇలావేనిల్ వలారివన్ ఆరంభిక సంవత్సరాల ను ఆయన గుర్తుకు తెచ్చుకొన్నారు.  వారు నివసించిన మణినగర్ కు అప్పట్లో శ్రీ మోదీ  శాసనసభ్యుని గా ఉండే వారు.  ఆమె తన చదువు, క్రీడా శిక్షణ ఈ రెండిటి లో ఏ విధంగా సంతులనపరచుకోగలుగుతోందని ఆయన అడిగారు.

షూటింగ్‌ క్రీడాకారుడు  సౌరభ్‌ చౌదరి తో ఏకాగ్రత లోను, మానసిక సమతౌల్యం లోను మెరుగుదల ను తెచ్చుకోవడం లో యోగ పోషించిన పాత్ర  ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.  టేబల్‌ టెనిస్‌ క్రీడ లో అనుభవశాలి ఆటగాడైన శరత్‌ కమల్‌ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ మునుపటి ఒలింపిక్స్ కు, ప్రస్తుత ఒలింపిక్స్‌ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటూ ప్రశ్నించారు.  ప్రస్తుత కాలం లో మహమ్మారి ప్రభావం ఎలా ఉందంటూ ఆరా తీశారు.  శరత్‌ కమల్‌ కు ఉన్న విస్తృత మైన అనుభవం భారతదేశం క్రీడాకారుల కు తోడ్పడగలదన్న ఆశాభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.  మరో టేబల్ టెనిస్ క్రీడాకారిణి మనికా బాత్రా తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పేద బాలల కు ఆట లో శిక్షణ ను ఇస్తున్నందుకు గాను ఆమె ను ప్రశంసించారు.  ఆమె ఆట ఆడే వేళ లో చేతి కి త్రివర్ణాన్ని ధరించే అలవాటు పైనా సంభాషణ సాగింది.  నాట్యం పై ఆమె కు గల అభిరుచి ఆమె కు ఆట లో ఒత్తిడి ని తగ్గించే పని ని చేస్తున్నదా ? అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.

ఆ తరువాత వినేశ్ ఫోగాట్ (కుస్తీ) తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కుటుంబ వారసత్వం నేపథ్యం లో ఆమె పై పెరిగిపోతున్న అంచనాల ఒత్తిడి ని ఎలా తట్టుకోగలుగుతున్నదీ వాకబు చేశారు.  ఆమె ముందు ఉన్నటువంటి సవాళ్ల ను గురించి ఆయన ప్రస్తావించి, వాటి ని ఏ విధం గా అధిగమించారు అని అడిగారు.  ఆమె తండ్రి తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అందరికీ ఆదర్శప్రాయం గా కుమార్తెల ను పెంచిన విధానాన్ని గురించి  అడిగి తెలుసుకొన్నారు.  అలాగే ఈత క్రీడాకారుడు సాజన్‌ ప్రకాశ్ తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తీవ్ర గాయం నుంచి ఎలా కోలుకున్నారో వివరించమని సాజన్‌ ప్రకాశ్ ను అడిగారు.

మన్‌ప్రీత్‌ సింహ్ (హాకీ) తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అతని తో ముచ్చటిస్తూ ఉంటే మేజర్‌ ధ్యాన్‌చంద్‌ వంటి హాకీ దిగ్గజాలు తనకు గుర్తుకు వస్తున్నారన్నారు.  దేశ వారసత్వాన్ని మన్‌ప్రీత్‌ సింహ్ జట్టు సజీవం గా ఉంచుతుందనే ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

టెనిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, టెనిస్ క్రీడ కు ప్రాచుర్యం పెరుగుతుండడాన్ని గురించి ప్రస్తావించారు.  ఈ మేరకు వర్ధమాన క్రీడాకారుల కు సలహాల ను ఇవ్వాలని, మీ అనుభవాన్ని పంచుకోవాలని ఆమె కు సూచన చేశారు.  టెనిస్‌ క్రీడ లో డబల్స్ పోటీ లో తన భాగస్వామి తో సానియా ఏర్పరచుకొన్నటువంటి సమన్వయాన్ని గురించి కూడా ఆమె ను ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు.  గత 5-6 సంవత్సరాల లో క్రీడల లో సానియా మీర్జా గమనించిన మార్పుల ను గురించి చెప్పవలసిందంటూ కూడా ఆయన అడిగారు.  ఇటీవలి కాలం లో భారతదేశం ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తోందని, మరి అది ప్రతిభా ప్రదర్శన లో  ప్రతిబింబించగలదని సానియా మీర్జా చెప్పారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ మహమ్మారి పరిస్థితుల కారణం గా భారతదేశం క్రీడాకారుల బృందానికి ఆతిథ్యాన్ని ఇవ్వలేకపోవడం తనకు విచారాన్ని కలిగిస్తోందన్నారు.  వారి ప్రాక్టీసు ను కూడా మహమ్మారి దెబ్బ తీయడమే కాక ఒలింపిక్స్‌ ను ఏడాది పాటు వాయిదా పడేటట్టు కూడా చేసింది అని ఆయన వ్యాఖ్యానించారు.  ఒలింపిక్ క్రీడోత్సవాల లో భారత క్రీడాకారుల తరఫు న నినదించవలసిందంటూ తన ‘మన్‌ కీ బాత్‌’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో దేశ ప్రజల కు విజ్ఞప్తి చేయడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.  ఆ మేరకు హ్యాశ్ టాగ్ ఛీర్‌ ఫార్‌ ఇండియా (#Cheer4India) నినాదానికి లభించిన విశేష ప్రాచుర్యాన్ని గుర్తుచేశారు.  యావత్తు దేశం వారికి వెన్నుదన్ను గా ఉందని, ప్రజల ఆశీస్సు లు వారికి మెండు గా లభిస్తాయని ఆయన అన్నారు.   ప్రజలంతా నమో ఏప్‌ ద్వారా మన క్రీడాకారుల కోసం నినదించాలని, దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని ప్రధాన మంత్రి తెలిపారు.  “మీకు అందరికీ 135 కోట్ల మంది భారతీయుల తాలూకు ఈ శుభాకాంక్షలే క్రీడామైదానం లోకి అడుగుపెట్టే కన్నా ముందు దేశం అందించేటటువంటి ఆశీర్వచనాలు” అని ప్రధాన మంత్రి అన్నారు.

 
PMO India
@PMOIndia
हाल के दिनों में #Cheer4India के साथ कितनी ही तस्वीरें मैंने देखी हैं।

सोशल मीडिया से लेकर देश के अलग अलग कोनों तक, पूरा देश आपके लिए उठ खड़ा हुआ है।

135 करोड़ भारतीयों की ये शुभकामनाएँ खेल के मैदान में उतरने से पहले आप सभी के लिए देश का आशीर्वाद है: PM @narendramodi
6:09 PM • Jul 13, 2021
2.9K
118
Share this Tweet


సాహసం, ఆత్మవిశ్వాసం, సకారాత్మకత.. ఈ మూడూ క్రీడాకారులందరిలో సహజంగా కనిపించే ప్రధాన లక్షణాలు అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అలాగే క్రమశిక్షణ, అంకితభావం, దీక్ష.. ఇవి మూడూ కూడా క్రీడాకారుల లో సర్వసాధారణంగా కనిపించే సుగుణాలు అని ఆయన చెప్పారు.  అంతేకాకుండా పట్టుదల, పోటీతత్వం కూడా క్రీడాకారుల లో సహజం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  ఇదే తరహా లో అన్ని సుగుణాలూ న్యూ ఇండియా సొంతం అని, క్రీడాకారులు ఈ న్యూ ఇండియా ను ప్రతిబింబిస్తూ జాతి భవిష్యత్తు కు చిహ్నాలు గా వెలుగొందాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

 
PMO India
@PMOIndia
आपमें एक कॉमन फ़ैक्टर है- Discipline, Dedication और Determination.

आपमें commitment भी है, competitiveness भी है।

यही qualities, New India की भी हैं।

इसीलिए, आप सब New India के Reflection हैं, देश के भविष्य के प्रतीक हैं: PM @narendramodi
6:10 PM • Jul 13, 2021
900
64
Share this Tweet


యావత్తు దేశం నేడు ఓ కొత్త ఆలోచన తో, సరికొత్త విధానం తో తమకు ఏ విధం గా మద్దతు ను ఇస్తున్నదీ క్రీడాకారుల లో ప్రతి ఒక్కరికీ ప్రత్యక్షం గా తెలుసు అని ప్రధాన మంత్రి అన్నారు.  దేశాని కి ఇవాళ మీరు ఇచ్చేటటువంటి ఉత్తేజం ఎంతో ముఖ్యం అని క్రీడాకారుల ను ఉద్దేశించి ఆయన అన్నారు.  క్రీడాకారులు స్వేచ్ఛ గా, పూర్తి సామర్థ్యం తో వారి క్రీడా నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ ముందడుగు వేసేందుకు అగ్ర ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు.  క్రీడాకారుల కు మద్దతు గా ఇటీవలి సంవత్సరాల లో తీసుకువచ్చినటువంటి మార్పుల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు.

 
PMO India
@PMOIndia
आप सब इस बात के साक्षी हैं कि देश किस तरह आज एक नई सोच, नई अप्रोच के साथ अपने हर खिलाड़ी के साथ खड़ा है।

आज देश के लिए आपका मोटिवेशन महत्वपूर्ण है।

आप खुलकर खेल सकें, अपने पूरे सामर्थ्य के साथ खेल सकें, अपने खेल को, टेकनीक को और निखार सकें, इसे सर्वोच्च प्राथमिकता दी गई है: PM
6:12 PM • Jul 13, 2021
4.2K
191
Share this Tweet


క్రీడాకారుల కు మెరుగైన శిక్షణ శిబిరాల ను నిర్వహించేందుకు, మంచి పరికరాలు సమకూర్చడానికి అన్నివిధాలా కృషి జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రస్తుతం క్రీడాకారుల కు అంతర్జాతీయ క్రీడా రంగం లో పాల్గొనే అవకాశాల ను కూడా అధికం గా కల్పించడం జరుగుతోందని తెలిపారు.  క్రీడారంగాని కి చెందిన వారి సూచనల మేరకు క్రీడా సంబంధ వ్యవస్థలు అన్నీ స్పందించి అగ్ర ప్రాధాన్యం ఇచ్చినందున స్వల్ప కాలంలోనే వినూత్న మార్పు లు సంభవించాయని ఆయన పేర్కొన్నారు.   ఒలింపిక్స్‌ కు తొలి సారి గా ఇంత పెద్ద సంఖ్య లో భారత క్రీడాకారులు అర్హత ను సాధించడం పై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు.  ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ వంటి కార్యక్రమాలు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన చెప్పారు.  అదేవిధం గా భారతదేశం నుంచి తొలిసారి గా అత్యధిక క్రీడల లో ఆటగాళ్లు పాల్గొంటున్నారు అని ఆయన అన్నారు.  భారతదేశం మొట్టమొదటి సారి గా అర్హత ను సంపాదించుకొన్న క్రీడ లు కూడా చాలానే ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

 
PMO India
@PMOIndia
हमने प्रयास किया खिलाड़ियों को अच्छे ट्रेनिंग कैंप्स के लिए, बेहतर equipment के लिए।

आज खिलाड़ियों को ज्यादा से ज्यादा international exposure भी दिया जा रहा है।

स्पोर्ट्स से जुड़ी संस्थानों ने आप सबके सुझावों को सर्वोपरि रखा, इसीलिए इतने कम समय में इतने बदलाव आ पाये हैं: PM
6:13 PM • Jul 13, 2021
2.9K
122
Share this Tweet

 
PMO India
@PMOIndia
पहली बार इतनी बड़ी संख्या में खिलाड़ियों ने ओलंपिक के लिए क्वालिफाई किया है।

पहली बार इतने ज्यादा खेलों में भारत के खिलाड़ी हिस्सा ले रहे हैं।

कई खेल ऐसे हैं जिनमें भारत ने पहली बार क्वालिफाई किया है: PM @narendramodi
6:14 PM • Jul 13, 2021
17.6K
580
Share this Tweet

యువ భారతం ఆత్మవిశ్వాసాన్ని, శక్తి ని చూస్తూ ఉంటే విజయం ఒక్కటే న్యూ ఇండియా కు అలవాటు గా మారే రోజు దూరం లో లేదు అని తన కు ఆశ గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.  క్రీడాకారులంతా వారి అత్యుత్తమ ప్రతిభ ను ప్రదర్శించాలి అని వారికి ఆయన సూచిస్తూ, వారిలో ఉత్సాహాన్ని నింపేటట్టు “చీర్‌4ఇండియా” అని నినదించవలసింది గా దేశ ప్రజల కు పిలుపునిచ్చారు.



 


 

***



(Release ID: 1735244) Visitor Counter : 272