ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, భూటాన్ ఆర్థిక మంత్రి లియోన్పో నామ్‌గే షెరింగ్ సంయుక్తంగా భీమ్-యుపిఐని భూటాన్లో ప్రారంభించారు


2019 లో భారత ప్రధాన మంత్రి భూటాన్ పర్యటన సందర్భంగా రెండు దేశాలు చేసిన ప్రకటనల నిబద్ధతను ప్రారంభోత్సవం నెరవేరుస్తుంది.

Posted On: 13 JUL 2021 4:04PM by PIB Hyderabad

 

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్,  భూటాన్ గౌరవ ఆర్థిక మంత్రి లియోన్పో నామ్‌గే షెరింగ్ మంగళవారం మధ్యాహ్నం భూటాన్‌లో భీమ్-యుపిఐని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాద్, భూటాన్ రాయల్ మానిటరీ అథారిటీ గవర్నర్  దాషో పెంజోర్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబాసిష్ పాండా, భూటాన్లో భారతదేశ రాయబారి ఎంఎస్ రుచిరా కాంబోజ్, ఇండియాలో భూటాన్ రాయబారి వి. నామ్గియెల్ , ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో దిలీప్ ఆస్బే తదితరులు పాల్గొన్నారు.

న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భీమ్–యూపీఐ ప్రారంభత్సవంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావు కరాద్,  ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబాషిష్ పాండా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..  భారతదేశ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలోభాగంగా భూటాన్లో భీమ్–యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయని, విలువైన పొరుగుదేశాలతో కలిసి లక్ష్యాలను సాధించుకోవడం గర్వంగా ఉందన్నారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో భారతదేశంలో జరిగిన డిజిటల్ లావాదేవీల సాధనలో భీమ్–యూపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. గడిచిన ఐదేళ్లలో 100 మిలియన్ల యూపీఐ క్యూఆర్ కోడ్లను సృష్టించబడ్డాయని, 2021 ఆర్థిక సంవత్సరంలో 41 లక్షల కోట్ల విలువైన 22 బిలియన్ల లావాదేవీలు జరిగాయన్నారు.

భూటాన్ ఆర్థిక మంత్రి మిస్టర్ లియోన్పో నామ్‌గే షెరింగ్  భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భూటాన్‌లో భీమ్-యుపిఐ సేవలను ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. రోజురోజుకూ ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నాయని షెరింగ్ పేర్కొన్నారు.

గౌరవ ప్రధానమంత్రి  2019లో భూటాన్లో పర్యటించిన సందర్భంగా ఇరుదేశాలు చేసిన ప్రకటనల నిబద్ధతను భీమ్–యూపీఐ సేవల ప్రారంభోత్సవం నెరవేర్చనుంది. ఇప్పటికే భారత్, భూటాన్ దేశాలు.. ఇరుదేశాల మధ్య ఇంటర్ ఆపరేబిలిటీ పద్ధతిలో రూపే కార్డుల చెలామణిని రెండు దశల్లో అంగీకరించాయి.

 

ఈ రోజు భూటాన్‌లో భీమ్-యుపిఐ సేవలు ప్రారంభించడంతో రెండు దేశాల్లో చెల్లింపులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగయ్యాయి. దీనివల్ల ఇండియా నుంచి భూటాన్కు ప్రతి సంవత్సరం ప్రయాణించే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. దీనివల్ల కేవలం ఒక మీట నొక్కడం ద్వారా జీవించే సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పొందవచ్చు.
 
ఈ ప్రారంభోత్సవంలోభాగంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ భీమ్–యూపీఐ ఉపయోగించి భూటాన్కు చెందిన ఓజీఓపీ అవుట్లెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. స్థానిక కమ్యూనిటీలు తయారుచేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఓజీఓపీ అవుట్లెట్ ద్వారా విక్రయిస్తారు.


క్యూఆర్ కోడ్ సేవల విస్తరణ కోసం యూపీక్ష్మ ప్రమాణాలను అనుసరించిన మొదటి దేశం భూటాన్ కాగా.. భీమ్ యాప్ ద్వారా మొబైల్ ఆధారిత చెల్లింపులను అంగీకరించిన మన మొదటి పొరుగు దేశం కూడా భూటానే కావడం విశేషం.

 

***


(Release ID: 1735238) Visitor Counter : 267