ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 13 JUL 2021 10:34AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద 38.14 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
దేశంలో  గ‌త 24 గంట‌ల‌లో 31,443 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 118 రోజుల‌లో ఇదే అత్య‌ల్పం.
దేశ వ్యాప్తంగా ఇప్పటివ‌ర‌కు 3,00,63,720 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్ నుంచి కోలుకుంటున్న‌వారి రేటు 97.28 శాతానికి పెరిగింది.
49,007 మంది పేషెంట్లు గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్నారు.
ఇండియాలో క్రియాశీల కేసులు ప్ర‌స్తుతం 4,31,315 గా ఉన్నాయి. గ‌త 109 రోజుల‌లో క‌నిష్టం ఇది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.40 శాతంగా ఉన్నాయి.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ , ప్ర‌స్తుతం ఇది 2.28 శాతం గా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 1.18 శాతం. ఇది వ‌రుస‌గా 22 రోజుల‌లో 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్పటి వ‌ర‌కు 43.40 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1735070) Visitor Counter : 144