వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

రైతు సహకార సంస్థలు, రైతు ఉత్పాదక సంస్థలతో ఎగుమతి బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(నాఫెడ్)తో.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Posted On: 12 JUL 2021 5:43PM by PIB Hyderabad

వ్యవసాయ మరియు ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సామర్థ్యాన్నిపెంచడానికి నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(నాఫెడ్)తో..  అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

 అవగాహన ఒప్పందం ప్రకారం.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ రిజిస్టర్డ్  ఎగుమతిదారులు అన్ని సందర్భాలలో నాఫెడ్ అమలు చేస్తున్న పథకాల ద్వారా భారత  ప్రభుత్వం నుంచి సహకార సదుపాయాలను పొందుతారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెట్ సదుపాయాల కల్పన వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా రైతు సహకార సంస్థల ఎగుమతుల్లో స్థిరత్వం, వృద్ధిని సాధించడానికి కూడా అవగాహన ఒప్పందం  కుదిరింది.

వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏపీఈడీఏ, బహుల రాష్ట్ర సహకార సొసైటీల చట్టం కింద పనిచేసే నాఫెడ్ల మధ్య సహాయసహకారాలు వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపర్చడానికి, రైతు సహకార సంస్థలను భాగం చేయడానికి , వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర దక్కేలా చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం కల్పించడానికి ఉపయోగపడుతుంది.

నాఫెడ్ గుర్తించి, ప్రోత్సహించిన సహకార సంస్థలు, రైతు ఉత్పత్తుల సంస్థలు, భాగస్వాములతో ఏపీఈడీఏ ఎగుమతులను సులభతరం చేస్తుంది.

బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్స్ నేపథ్యంతో దేశంతోపాటు విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ వాణిజ్య ఉత్సవాల్లో రైతు సహకార సంస్థల భాగస్వామ్యాన్ని ఏపీఈడీఏ, నాఫెడ్ సులభతరం చేస్తాయి. తద్వారా అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడతాయి.

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాల్లో సామర్థ్యాల నిర్మాణం కోసం కూడా ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందుకోసం ఈ రెండు సంస్థలు జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు , వర్క్షాప్లను నిర్వహిస్తాయి.

క్లస్టర్ల సుస్థిర అభివృద్ధి కోసం కూడా ఏపీఈడీఏ, నాఫెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. వ్యవసాయ ఎగుమతి విధానం కింద నోటిఫై చేసిన క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి ఇరు సంస్థలు పరస్పరం సహకరించుకునేందుకు అంగీకరించాయి.

వాటాదారులకు మెరుగైన విలువను తీసుకురావడానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ప్రయోజనాల కోసం కార్యకలాపాలను సమన్వయం చేయడానికి పరస్పరం కలిసి పనిచేయడం ద్వారా రెండు సంస్థల నైపుణ్యాన్ని ఉపయోగించుకోవటానికి ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందంపై ఎపిఎడిఎ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు మరియు నాఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ కుమార్ చద్ధా సంతకం చేశారు.

వివిధ సంస్థల్లోని వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ అభివృద్ధికి, ఎగుమతుల మెరుగుదలకు గుర్తించిన సమస్యలను పరిష్కరించడంతోపాటు పరిష్కార మార్గాలను అందించడానికి వివిధ రంగాల్లో స్వాభావిక, వృత్తిపరమైన, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సంస్థల్లో ఉత్తేజాన్ని నింపడం కోసం 2018 లో భారత ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ ఎగుమతుల విధానం కింద నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా APEDA సహకార విధానంపై దృష్టి సారించింది.

ఎగుమతి ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహం, రైతులకు మెరుగైన ధరలు దక్కేలా చేయడంతోపాటు భారత ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల్లో సమకాలీకరణపై దృష్టిసారిస్తూ భారత వ్యవసాయ విధానం రూపొందించబడింది. వ్యవసాయరంగంతోపాటు ఉత్పత్తుల ఎగుమతుల్లో వీలైనంత నష్టాన్ని తగ్గించడంలో సహాయ పడడానికి, రైతు ఆదాయం మెరుగుపడేలా చేయడానికి రైతు కేంద్రంగా భారత వ్యవసాయ ఎగుమతుల విధానం  రూపొందింది. అందువల్ల దేశంలోని వివిధ అగ్రో క్లైమేట్ జోన్స్లలో నిర్దిష్ట ఉత్పత్తులను అభివృద్ధి చేసే విధానాన్ని అవలంభించాలని వ్యవసాయ ఎగుమతుల విధానం సూచిస్తుంది. అంటే..  అధిక ఉత్పాదకత వచ్చేలా నేలలోని పోషకాల నిర్వహణ, మార్కెట్ ఆధారిత పంటల సాగు, మెరుగైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించడం కోసం అవసరమైన సమస్యలను పరిష్కరించడంలో సహాయ పడుతుంది.

వ్యవసాయ ఎగుమతుల విధానం అమలు కోసం ఏపీఈడీఏ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ, నాగాలాండ్, తమిళనాడు, అసోం, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలు ఎగుమతుల కోసం రాష్ట్రస్థాయి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి. ఇతర రాష్ట్రాల కార్యాచరణ ప్రణాళికల ఖరారు వివిధ దశలలో ఉంది.

ప్రస్తుతం జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ అంతటా తేనె ఉత్పత్తి కోసం నాఫెడ్  వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలను ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే సుమారు 65 వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు తేనె ఉత్పత్తి ద్వారా వాయవ్య‌‌–ఈశాన్య ప్రాంతాలను కలుపుతున్నాయి. నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ కింద అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం తేనె ఉత్పత్తికి సంబంధించిన అన్ని ఎఫ్‌పిఓలను ఒకే గొడుగు కిందకు  తీసుకురావాలని నాఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. నాఫెడ్ యొక్క అనుబంధ సమాఖ్క్ష్య ఫిఫా ప్రైవేట్ సెక్టార్తోపాటు వివిధ ఎఫ్పీఓలతో భాగస్వామ్యం కలిగి ఉంది. 

 

***

 



(Release ID: 1734937) Visitor Counter : 549