వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్‌ అత్యధికంగా గోధుమలు సేకరించి, రికార్డు సాధించడంతో, ఆ రాష్ట్ర ప్రజలకు ఎం.ఎస్.పి. గా 11,141.28 కోట్ల రూపాయలు చెల్లించారు


2020-21ఆర్‌.ఎం.ఎస్. తో పోలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ లో, 2021-22 రబీ మార్కెటింగ్ సీజన్ లో 58 శాతం ఎక్కువగా గోధుమలు సేకరించబడ్డాయి

2020-21 రబీ మార్కెటింగ్ సీజన్ లో 6.64 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలతో పోలిస్తే, ఉత్తరప్రదేశ్‌ లో, 2021-22 ఆర్.బి.ఎస్. లో గోధుమల సేకరణ 56.41 లక్షల మెట్రిక్ టన్నుల మేర రికార్డు స్థాయిలో జరిగింది

2020-21 కే.ఎం.ఎస్. లో ఉత్తరప్రదేశ్‌ లోని 10.22 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 66.84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ని సేకరించడం జరిగింది

Posted On: 12 JUL 2021 4:47PM by PIB Hyderabad

ప్రస్తుత 2021-22 ఆర్‌.ఎం.ఎస్. సమయంలో, ఉత్తర ప్రదేశ్‌ లో 12.98 లక్షల మంది రైతుల నుంచి, కనీస మద్దతు ధర (ఎం.ఎస్‌.పి) తో రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది.   ఇది రాష్ట్ర చరిత్రలో జరిగిన అత్యధిక గోధుమల సేకరణ.  రైతులకు ఎం.ఎస్‌.పి. గా మొత్తం 11,141.28 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.  2020-21 ఆర్‌.ఎం.ఎస్. సమయంలో 6.64 లక్షల మంది రైతుల నుండి సేకరించిన 35.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలతో పోలిస్తే, ఇప్పుడు, 58 శాతం మేర పెరిగింది.

ఉత్తర ప్రదేశ్‌ లో, 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లోనే, వరి సేకరణ కూడా రికార్డు స్థాయిలో జరిగింది.   2020-21 కె.ఎం.ఎస్. సమయంలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 10.22 లక్షల మంది రైతుల నుంచి, రికార్డు స్థాయిలో, 66.84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ని సేకరించడం జరిగింది.  ఇది రాష్ట్ర చరిత్ర లో జరిగిన అత్యధిక వరి సేకరణ.  ఉత్తరప్రదేశ్ రైతులకు, ఎం.ఎస్‌.పి. గా, మొత్తం 12,491.88 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 

గోధుమలను సేకరించే చాలా రాష్ట్రాల్లో, ప్రస్తుత 2021-22 మార్కెటింగ్ సీజన్, ముగిసిందని గమనించవచ్చు.   2021 జూలై, 8వ తేదీ వరకు, 433.32 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించడం జరిగింది.  (దీంతో, ఇది గత 2020-21 ఆర్.ఎం.ఎస్. లో అత్యధికంగా సేకరించిన 389.92 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించి, నూతన రికార్డును సాధించినట్లైంది) కాగా, గత ఏడాది, ఇదే సమయంలో, 387.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించడం జరిగింది.  ఇలా ఉండగా, ఇప్పటికే కొనసాగుతున్న ఆర్‌.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల ద్వారా, 85,581.02 కోట్ల రూపాయల మేర ఎం.ఎస్.పి. విలువ తో, సుమారు 49.16 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు.

వరి సేకరించే రాష్ట్రాల్లో, 2020-21 ఖరీఫ్ సీజన్ లో వరి సేకరణ కూడా, సజావుగా కొనసాగుతోంది.  2021 జూలై, 8వ తేదీ వరకు (ఖరీఫ్ పంట 707.59 లక్షల మెట్రిక్ టన్నులు మరియు రబీ పంట 158.46 లక్షల మెట్రిక్ టన్నులు కలిపి) మొత్తం 866.05 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరించడం జరిగింది. కాగా, గత ఏడాది, ఇదే సమయంలో, 756.80 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే వరి సేకరించడం జరిగింది.  ఇలా ఉండగా, ఇప్పటికే కొనసాగుతున్న కె.ఎం.ఎస్. సేకరణ కార్యకలాపాల ద్వారా, 1,63,510.77 కోట్ల రూపాయల మేర ఎం.ఎస్.పి. విలువ తో, సుమారు 127.76 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దీంతో, ఇది గత 2019-20 కె.ఎం.ఎస్. లో అత్యధికంగా సేకరించిన 773.45 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించి, నూతన రికార్డును సాధించినట్లైంది. 

 

 

 

*****



(Release ID: 1734936) Visitor Counter : 204