ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో ఒలింపిక్స్ లో పాలుపంచుకొనే భారతదేశం క్రీడాకారుల తో జులై 13న మాట్లాడనున్న ప్రధాన మంత్రి
Posted On:
11 JUL 2021 3:42PM by PIB Hyderabad
టోక్యో ఒలింపిక్స్ కు వెళ్లే భారతదేశ క్రీడాకారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం జులై 13న సాయంత్రం 5 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడుతారు.
క్రీడాకారులు ఆటల పోటీల లో పాలుపంచుకొనే కన్నా ముందు వారికి ప్రేరణ ను అందించే ప్రయాస లో భాగంగా వారి తో ప్రధాన మంత్రి మాట్లాడనున్నారు. టోక్యో-2020 కి వెళ్తున్న భారతదేశ దళానికి ఉద్దేశించిన సౌకర్యాల కోసం సాగుతున్న సన్నాహాల ను గురించి ప్రధాన మంత్రి ఇటీవలే ఒక సమీక్ష ను నిర్వహించారు. కొంత మంది క్రీడాకారుల స్ఫూర్తిదాయకమైన యాత్రల ను గురించి ఆయన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో చర్చించారు కూడాను; అంతేకాదు, దేశ ప్రజల ను ముందడుగు వేసి క్రీడాకారుల ను హృదయపూర్వకం గా సమర్థించవలసిందంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రులు శ్రీ నిసిథ్ ప్రమాణిక్, చట్టం- న్యాయం శాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజూ లు కూడా హాజరు అవుతారు.
భారతదేశ దళం గురించి :
భారతదేశం నుంచి 18 క్రీడా విభాగాల లో మొత్తం 126 మంది క్రీడాకారులు టోక్యో కు బయలుదేరి వెళ్లనున్నారు. ఏదైనా ఒలింపిక్ క్రీడోత్సవాల లో భారతదేశం నుంచి వెళ్తున్న ఈ దళమే ఇప్పటి వరకు ఒలింపిక్స్ కు వెళ్లిన దళాలన్నిటి లోకీ అతి పెద్ద దళం. ఈసారి భారతదేశం 18 వేరు వేరు క్రీడా విభాగాల లో మొత్తం 69 పోటీల లో పాల్గొననుంది. భారతదేశం ఇంత పెద్ద సంఖ్య లో వేరు వేరు పోటీల లో పాలుపంచుకొంటూ ఉండడమనేది ఇంతవరకు జరుగలేదు.
ఈ సారి భారతదేశం తరఫున వివిధ ఆటల లో మొదటి సారి గా భాగం పంచుకోవడం జరుగుతోంది. ప్రాతినిధ్యం విషయానికి వస్తే మొదటి సారి గా నమోదు కాబోతున్న అంశాలు అనేకం ఉన్నాయి. చరిత్ర లో ఒకటో సారి గా, భారతదేశానికి చెందిన ఒక ఫెన్సర్ (భవానీ దేవి) ఒలింపిక్ క్రీడోత్సవాల కు అర్హత ను సంపాదించారు. నేత్ర కుమానన్ ఒలింపిక్ క్రీడల కోసం అర్హత సాధించిన ప్రప్రథమ మహిళా నావికురాలు (సైలర్) గా ఉన్నారు. సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్ లు భారతదేశం పక్షాన ఈత లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని చేజిక్కించుకొని ఒక ఒలింపిక్స్ కు భారతదేశం నుంచి అర్హత ను సాధించిన తొలి ఈత క్రీడాకారులు గా ఉన్నారు.
***
(Release ID: 1734686)
Visitor Counter : 191
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam