గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జూలై 12న 167వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనున్న సీపీడబ్ల్యుడీ
Posted On:
10 JUL 2021 6:27PM by PIB Hyderabad
గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓహెచ్‌యుఏ) పరిధిలోని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సీపీడబ్ల్యుడీ) 2021 జూలై 12న
167వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనుంది. దేశానికి చేసిన అద్భుతమైన సేవ తలచుకొంటూ సీపీడబ్ల్యుడీ వ్యవప్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు.
కోవిడ్-19 మహమ్మారి విస్తరించి ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు. సీపీడబ్ల్యుడీ 1854 జూలైలో ప్రజా పనుల అమలుకు కేంద్ర ఏజెన్సీగా ఉనికిలోకి వచ్చింది. ఇది ఇప్పుడు సమగ్ర నిర్మాణ నిర్వహణ విభాగంగా అభివృద్ధి చెందింది, ఇది ప్రాజెక్ట్ రూపకల్పన మొదలు ఆయా పనులు పూర్తయ్యే వరకు మరియు నిర్వహణకు సేవలను అందిస్తుంది.
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈ కార్యక్రమాన్ని ‘ముఖ్య అతిథి’గాను గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కౌషల్ కిషోర్‌లు ఈ కార్యక్రమానికి ‘గౌరవ అతిథి’గాను హాజరు కానున్నారు. ప్రారంభోత్సవంలో, నాలుగు సాంకేతిక ప్రచురణలను విడుదల చేయనున్నారు సీపీడబ్ల్యుడీ ఫ్లోరల్ టేబుల్: ఎ ట్రెజర్ కలెక్షన్, ఆఆర్‌పీ ఇ-మాడ్యూల్స్, నిర్మన్ భారతి - సీపీడబ్ల్యుడీ మరియు సీపీడబ్ల్యుడీ టెలిఫోన్ డైరెక్టరీ 2021 యొక్క అంతర్గత ప్రచురణలను ప్రముఖులు ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. సీపీడబ్ల్యుడీ యొక్క కార్యకలాపాలు, విజయాలను వర్ణించేలా సీపీడబ్ల్యుడీ పై నిర్మించిన ఒక లఘుచిత్రాన్ని కూడా ఈ కార్యక్రమ సమయంలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా, సీపీడబ్ల్యుడీలో ఉత్తమమైన
సేవలను అందించిన అధికారులకు పతకాలను బహూకరించనున్నారు. సంస్థకు
చెందిన అధికారులు మరియు ఇతర నిపుణులచే పలు సాంకేతిక ప్రదర్శనలు ఇవ్వబడుతాయి.
***
(Release ID: 1734564)
Visitor Counter : 166