రక్షణ మంత్రిత్వ శాఖ
ఇజ్రాయెల్ ఉప ప్రధాని &రక్షణ శాఖ మంత్రితో భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ టెలిఫోన్ సంభాషణ
రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేయడం, ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై ప్రధాన చర్చ
Posted On:
09 JUL 2021 12:23PM by PIB Hyderabad
రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇజ్రాయెల్ ఉప ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి అయిన లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గంట్జ్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గంట్జ్‌ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
ఈ సంభాషణ తర్వాత శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారాన్ని సుధృడం చేయడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆ ట్వీట్‌లో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ కోసం భారత్‌కు ఇజ్రాయెల్ సాయం అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, లెఫ్టినెంట్ జనరల్ బెంజమిన్ గంట్జ్‌కు శ్రీ రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
(Release ID: 1734522)