మంత్రిమండలి

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మరియు జపాన్ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (జెఎఫ్‌టిసి) ల మధ్య మెమోరాండం ఆన్ కోఆపరేషన్ (ఎంఓసి) కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Posted On: 08 JUL 2021 7:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మో అధ్యక్షతన కేంద్ర కేబినెట్.. కాంపిటీషన్ లా అండ్ పాలసీ విషయంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మరియు జపాన్ ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (జెఎఫ్‌టిసి) ల మధ్య సహకార ఒప్పందం (ఎంఓసి) ను ఆమోదించింది. .

ప్రభావం:

ఆమోదించబడిన ఎంవోసీ, సమాచార మార్పిడి ద్వారా సిసిఐ జపాన్‌లోని దాని ప్రతిరూప  సంస్థ యొక్క అనుభవాలు మరియు పాఠాల నుండి నేర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది. సిసిఐ రూపొందించిన కాంపిటేషన్‌ యాక్ట్‌ చట్టం, 2002 అమలును మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది.  ఆ ఫలితాలు వినియోగదారులకు భారీగా ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగే ఈక్విటీ మరియు సమగ్రతను ప్రోత్సహిస్తాయి.

వివరాలు:

సమాచార మార్పిడి మరియు సాంకేతిక సహకారం, అనుభవ భాగస్వామ్యం మరియు సహకారం వంటి రంగాలలో వివిధ నిర్మాణ కార్యక్రమాల ద్వారా కాంపిటేషన్‌ యాక్ట్‌ మరియు విధానాల విషయంలో సహకారాన్ని ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

నేపథ్యం:

కాంపిటీషన్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 18.. విదేశంలోని  ఏ ఏజెన్సీతోనైనా తన విధులను నిర్వహించడానికి లేదా చట్ట ప్రకారం దాని విధులను నిర్వర్తించడం కోసం ఏదైనా మెమోరాండం లేదా ఏర్పాట్లు చేయడానికి సిసిఐని అనుమతిస్తుంది.


 

********


(Release ID: 1734102) Visitor Counter : 165