పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం సహజవాయువుల కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రామేశ్వర్ తేలి
Posted On:
08 JUL 2021 1:27PM by PIB Hyderabad
కేంద్ర పెట్రోలియం సహజవాయువుల మంత్రి గా శ్రీ శ్రీ హర్దీప్ సింగ్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి గా శ్రీ రామేశ్వర్ తేలి బాధ్యతలు స్వీకరించారు. కొత్త మంత్రుల బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు శాఖ బాధ్యతలు నిర్వహించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి హర్దీప్ సింగ్ పూరి కృతజ్ఞతలు తెలిపారు.
' నాపై నమ్మకం ఉంచి నాకు కీలకమైన మంత్రిత్వ శాఖ బాధ్యతలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లోటును భర్తీ చేయడం కష్టమైన పని.
ఈ మంత్రిత్వ శాఖ ప్రతి పౌరునితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉంటుంది. మంత్రిత్వ శాఖలోని ఇంధన అంశాలు అపారమైన అవకాశాలతో పాటు సవాళ్లను ముందు ఉంచుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనితీరును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది.
అయిదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇంధన వినియోగం, లభ్యత కీలక అంశాలుగా ఉంటాయి. ప్రధానమంత్రి నిర్దేశించిన విధంగా ఆత్మ నిర్భర్ భారత్ సాధన కోసం నేను స్వదేశంలో చమురు, సహజ వాయువుల ఉత్పత్తిని ఎక్కువ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకుంటాను.
సహజ వాయువు ఆధారిత ఆర్ధిక వ్యవస్థ రూపకల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ప్రధానమంత్రి ప్రకటించిన విధంగా 2030నాటికి ప్రాధమిక ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటా 15%కి పెరిగేలా చూడడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తాము.
గత ఏడు సంవత్సరాల కాలంలో శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఈ రంగంలో అనేక వినూత్న సంస్కరణలను అమలు కావడమే కాకుండా అనేక ముఖ్యమైన కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. వీటిని అమలు చేస్తూ ప్రధానమంత్రి, ప్రజలు, దేశం ఆశిస్తున్న విధంగా వారి అంచనాలకు అనుగుణంగా బాధ్యతలను నిర్వహిస్తాను' అని శ్రీ హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.
***
(Release ID: 1734095)
Visitor Counter : 166