ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో ఇప్పటిదాకా 36.48 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు


గత 24 గంటలలో 45,892 కొత్త కోవిడ్ కేసులు

చికిత్సలో మొత్తం కేసులు 4,60,704; మొత్తం కేసుల్లో 1.50%
రోజువారీ పాజిటివిటీ 2.42%; నెల రోజులుగా 5% లోపే

Posted On: 08 JUL 2021 10:24AM by PIB Hyderabad

భారత దేశపు మొత్తం కోవిడ్ టీకా డోసుల పంపిణీ నిన్నటికి 36.48 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం

 ప్రకారం 47,40,833 శిబిరాల ద్వారా 36,48,47,549 డోసుల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో 33,81,671 టీకాలిచ్చారు. వాటి

 వివరాలు ఇలా ఉన్నాయి.  

 ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,38,831

రెండో డోస్

73,57,382

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,76,29,332

రెండో డోస్

97,78,648

18-44 వయోవర్గం

మొదటి డోస్

10,63,61,310

రెండో డోస్

31,93,918

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,21,04,824

రెండో డోస్

2,14,42,733

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

6,95,55,573

రెండో డోస్

2,71,84,998

మొత్తం

36,48,47,549

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు  

చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  45,892 కొత్త కరోనా కేసులు  

నమోదయ్యాయి. ఆ విధంగా రోజుకు 50 వేల లోపు కేసులు రావటం గత 11 రోజులుగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల

ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OZCR.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,60,704 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.50% మాత్రమే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0023S7X.jpg

 

 కోలుకున్నవారి సంఖ్య పెరుగుతూ 2,98,43,825  కు చేరింది. కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. గత

24  గంటలలో  44,291 మంది కోలుకున్నారు.  దీంతో మొత్తం కోలుకున్నవారి శాతం 97.18% కు చేరింది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001W4S6.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 18,93,800 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన

 మొత్తం పరీక్షలు 42.52 కోట్లకు పైగా (42,52,25,897) అయ్యాయి. ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ 

తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.37% కాగా రోజువారీ పాజిటివిటీ  2.42%  అయింది. వరుసగా 17 రోజులుగా

ఇది 3% లోపు. నెలరోజులుగా 5% లోపే ఉంటోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004M5JW.jpg

***

 


(Release ID: 1733634) Visitor Counter : 198