ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులు దాఖలు చేయడానికి మరింత సడలింపును మంజూరు చేసిన - సి.బి.డి.టి.

Posted On: 05 JUL 2021 5:11PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం, ఫారం 15 సి.ఎ. / 15 సి.బి. లను ఎలక్ట్రానిక్‌ విధానం ద్వారా అందించాల్సిన అవసరం ఉంది.  ప్రస్తుతం, పన్ను చెల్లింపుదారులు ఫారం 15 సి.బి. లో చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్‌ తో పాటు ఫారం 15 సి.ఏ. ని, ఎక్కడ, అవసరమైతే అక్కడ, ఈ-ఫైలింగ్ పోర్టల్‌ లో, ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్‌ కు కాపీని సమర్పించే ముందు అప్‌-లోడ్ చేస్తారు.

ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులను, www.incometax.gov.in పోర్టల్ లో దాఖలు చేయడానికి, పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా, పన్ను చెల్లింపుదారులు, తమ 15 సి.ఏ. / 15 సి.బి. ఫారాలను, అధీకృత డీలర్‌ కు మాన్యువల్ ఫార్మాట్‌ లో, 2021 జూన్ 30 వరకు  సమర్పించవచ్చునని, సి.బి.డి.టి. ఇంతకు ముందు నిర్ణయించింది.

పైన పేర్కొన్న తేదీని 2021 జూలై, 15 వరకు పొడిగించాలని, ఇప్పుడు, నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఈ ఫారాలను మాన్యువల్ ఫార్మాట్‌ లో, 2021 జూలై, 15 తేదీ వరకు అధీకృత డీలర్లకు సమర్పించవచ్చు.  విదేశీ చెల్లింపుల ప్రయోజనం కోసం, 2021 జూలై 15వ తేదీ వరకు ఇటువంటి ఫారాలను అంగీకరించాలని, అధీకృత డీలర్లకు సూచించారు.  డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను రూపొందించడం కోసం ఈ ఫారం లను తరువాతి తేదీలో అప్‌-లోడ్ చేయడానికి వీలుగా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌ లో తగిన సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. 



(Release ID: 1732940) Visitor Counter : 189