హోం మంత్రిత్వ శాఖ
సర్దార్ పటేల్ జాతీయ ఏకతా అవార్డు -2021 నామినేషన్ల గడువు తేదీ ఆగస్టు 15, 2021
Posted On:
02 JUL 2021 4:51PM by PIB Hyderabad
సర్దార్ పటేల్ జాతీయ ఏకతా వార్డు -2021 అవార్డు కోసం అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసులు పంపడానికిగాను ఆగస్టు 15, 2021 చివరి తేదీ. కేంద్ర హోంశాఖకు చెందిన https://nationalunityawards.mha.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను పంపవచ్చు.
దేశ ఐకమత్యం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేసేవారికి ఇచ్చే ఈ పౌర అవార్డును శ్రీ సర్దార్ వల్లభాయి పటేల్ పేరుమీద కేంద్ర హోంశాఖ ప్రారంభించింది. జాతీయ ఐకమత్యాన్ని కాపాడుతూ దృఢమైన బలమైన భారతదేశ సాధనకోసం కృషి చేసేవారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి ఈ అవార్డును నెలకొల్పారు. కుల మత ప్రాంత రాజకీయాలు వయస్సు వృత్తికి అతీతంగా ఎవరైనా సరే ఈ అవార్డుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులే కాదు సంస్థలు కూడా ఈ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత దేశంలోని ఏ వ్యక్తయినా, ఏ సంస్థయినా సరే అర్హత వున్నవారిని, అర్హత వున్న సంస్థల పేర్లను ఈ అవార్డు కోసం పంపవచ్చు. అలాగే ఎవరికి వారు తమ స్వంతంగా కూడా దరఖాస్తులు పంపవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఆయా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు కూడా అవార్డుకోసం దరఖాస్తులు పంపవచ్చు.
(Release ID: 1732497)
Visitor Counter : 187