హోం మంత్రిత్వ శాఖ

ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపిఎస్‌) 72వ బ్యాచ్ కు చెందిన ప్రొబేషనరీ అధికారుల తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


అధికార యంత్రాంగం ప్ర‌స్తుత కాలం అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా శిక్ష‌ణ ను పొందిన‌ప్పుడు మాత్ర‌మే వ్య‌వ‌స్థ ను మార్చ‌గ‌లం అనేది ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దృష్టి కోణం గా ఉంది

పోలీసు లు నిష్క్రియాప‌ర‌త్వాన్ని, తీవ్ర చ‌ర్య ను తోసిరాజ‌ని నిష్పాక్షిక‌మైన విధి నిర్వ‌హ‌ణ దిశ‌ గా ప‌య‌నించాలి

‘‘సంభాషణ, సున్నిత‌త్వం’’అనేవి పోలీసుల ప్ర‌తిష్ట ను మెరుగు ప‌ర‌చ‌డానికి అవ‌స‌రం; ఈ కారణంగానే పోలీసులంద‌రినీ సెన్సిటైజ్ చేయ‌డంతో పాటు ప్ర‌జా సంబంధాల ను, క‌మ్యూనికేశన్ ను కూడా పెంచుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్‌పి) స్థాయి పోలీసు అధికారులు గ్రామాలకు, త‌హ‌సీళ్ళ కు వెళ్ళి ప్ర‌జ‌ల ను క‌లుసుకోవాలి; అక్కడే రాత్రి పూట బ‌స చేయాలి

స‌ర్దార్‌ ప‌టేల్‌ ‘మ‌నం ఒక మంచి అఖిల భార‌త స‌ర్వీసు ను ఏర్ప‌ర‌చుకోలేదంటే అప్పుడు యూనియ‌న్ అనేది అంతం అవుతుంది; భార‌త‌దేశం ఒక్క తాటి మీద ఉండ‌జాల‌దు; స‌మాఖ్య స్వ‌రూపాన్ని ప‌టిష్ట‌ ప‌ర‌చి, దేశ స‌మైక్య‌త ను ప‌రిర‌క్షించ‌డం మీ బాధ్య‌త’ అని సూచించారు

పోలీసు అధికారులు ద‌ర్యాప్తులను సాక్ష్యాల పై ఆధార‌ప‌డి శాస్త్రీయంగా తీర్చిదిద్దితే అప్పుడు మాన‌వ వ‌న‌రుల అవ‌స‌రం త‌క్కువగానే ఉంటుంది

సైబ‌ర్ నేరాల‌ కు వ్య‌తిరేకం గా మూడు సంవ‌త్స‌రాల లో అనేక ముఖ్య‌మైన చ‌ర్య‌ల ను మోదీ ప్ర‌భుత్వం తీసుకొంది; సైబ‌ర్ నేరాల ను అరిక‌ట్ట‌డానికి నాలుగు సంస్థ‌ల ను ఏర్పాటు చేసింది

పోలీసు కానిస్టేబుళ్ళ గ్రేడు ను పెంచ‌వ‌ల‌సిఉంది, ఈ విష‌యం లో పోలీసు అధికారులు వారి జీవిత ప‌ర్యంతం కృషి చేయాల్సిందే

ఐపిఎస్ 72వ బ్యాచ్ ప్రొబేషనరీ అధికారులే కాకుండా ఈ కార్య‌క్ర‌మం లో నేపాల్, భూటాన్ మాల్దీవులు, మారిశస్ ల‌కు చెందిన పోలీసు అధికారులు కూడా పాలుపంచుకొన్నారు

Posted On: 01 JUL 2021 7:00PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజున ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్ (ఐపిఎస్‌) 72వ బ్యాచ్ కు చెందిన ప్రొబేషనరీ అధికారుల‌ ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్మాధ్య‌మం ద్వారా మాట్లాడారు.  ఈ సంద‌ర్భంలో కేంద్ర హోం శాఖ స‌హాయమంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్‌, కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి, స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్‌ జాతీయ పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌రు ల‌తోపాటు హోం శాఖ కు చెందిన సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు.  కోవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణం గా ప్రాణాలనుకోల్పోయిన పోలీసులకు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లకు కేంద్ర హోంమంత్రి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  వైద్యులదినాన్ని, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ (సిఎ డే)దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న త‌న శుభాకాంక్ష‌లను తెలియ‌జేశారు.
 

                                                              IMG-4352__01
 

యువ పోలీసు అధికారుల ను ఉద్దేశించిశ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ఏ సంస్థ‌ కు అయినా ఒక వ్య‌ వ‌స్థ అనేదిచాలా ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు.  ఏ సంస్థ అయినా స‌రే,దానిని న‌డిపే వారు వ్య‌వ‌స్థ లో భాగంగా మారిదానిని బ‌లోపేతం చేయ‌డం కోసం పాటుప‌డిన‌ప్పుడు మాత్ర‌మే ఆ సంస్థ విజ‌య‌వంతం గా న‌డుస్తుందిఅని శ్రీ అమిత్ షా అన్నారు.  సంస్థ తాలూకు వ్య‌వ‌స్థను మెరుగు ప‌ర‌చ‌డంద్వారా సంస్థ దానంత‌ట అదే ఉత్త‌మంగా రూపుదిద్దుకొని చ‌క్క‌ని ఫ‌లితాల‌ను ఇస్తుందిఅని ఆయ‌న చెప్పారు.  సంస్థను వ్య‌వ‌స్థ ప్ర‌ధాన‌మైందిగాతీర్చిదిద్ద‌డం అనేది విజ‌యానికి కీల‌కం అని కూడా శ్రీ అమిత్ షా అన్నారు. ప్ర‌స్తుత కాల‌ం అవ‌స‌రాల‌ కు త‌గిన‌ట్లుగా వ్య‌వ‌స్థలోని అందరూ యంత్రాంగం శిక్ష‌ణ ను పొందిన‌ప్పుడే వ్య‌వ‌స్థలో మార్పుల‌ను తీసుకురాగ‌లుగుతాంఅనేదే ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌గా ఉంది అని హోం మంత్రిఅన్నారు.  స‌మ‌స్య‌లను ఏరి పార‌వేయ‌డానికి శిక్ష‌ణకాలం లోనే విత్త‌నాన్ని వేయాల‌ని, త‌ద్వారా ఒక వ్య‌క్తిని మ‌రింత‌ బాధ్య‌తక‌లిగిన‌వారు గాను, క‌ర్త‌వ్య నిష్ఠ క‌లిగిన‌ వారు గానుతీర్చిదిద్ద‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని వివ‌రించారు. శిక్ష‌ణ అనేది వ్య‌క్తిత్వాన్ని, ప‌ని చేసే ప‌ద్ధ‌తి ని మ‌ల‌చుతుంద‌ని, శిక్ష‌ణ స‌రి అయిన రీతిలో సాగితే అప్పుడు మిగ‌తా జీవితం లో స‌త్ఫ‌లితాల‌ను పొందవచ్చని ఆయ‌న చెప్పారు.   పోలీసుల‌ కు వ్య‌తిరేకం గా వారుఎటువంటి చ‌ర్య‌ల ను తీసుకోరు అని గాని లేదా అవ‌స‌ర‌మైన దాని క‌న్నా ఎంతో ఎక్కువ‌గా చ‌ర్య‌లు తీసుకొంటార‌ని గాని ఆరోప‌ణ‌లు ఉన్నాయి అని కేంద్ర హోం మంత్రి శ్రీఅమిత్ షా అన్నారు.  ఇటువంటి వాటిని పోలీసులునివారించుకోవాల‌ని, న్యాయబ‌ద్ధ‌మైన చ‌ర్య‌ల దిశ‌గా వారుసాగాల‌ని కేంద్ర హోం మంత్రి హిత‌వు ప‌లికారు.  న్యాయ‌బ‌ద్ధ‌మైన చ‌ర్య అంటే స్వాభావిక‌మైన చ‌ర్య అని అర్థ‌మ‌ని,పోలీసులు చ‌ట్టాన్ని అవగాహన చేసుకొని స‌రి అయినప‌నిని చేయాల‌ని ఆయ‌న ఉద్బోధించారు.    

 

                                                  IMG-4356
 
  పోలీసు శాఖ ప్రతిష్ట మెరుగుపడాలంటే ఆదిశగా కృషి చేయాల్సింది పోలీసులే అని శ్రీ అమిత్‌ షా అన్నారు. పోలీసుల ప్రతిష్టమెరుగుపడాలంటే “ప్రజలతో సత్సంబంధాలు-అవగాహన” అవసరం అని హోం మంత్రి అన్నారు. అందుకే పోలీసు సిబ్బంది అవగాహన ను పెంచుకోవడంతో పాటు ప్రజా సంబంధాల నిర్వహణనైపుణ్యాన్ని కూడా పెంచుకోవాలని ఆయన చెప్పారు. ప్రజలతో నిత్య సంబంధాలు లేకుండా నేరాలపై సమాచార సేకరణ చాలా కష్టమని శ్రీ షాపేర్కొన్నారు. కాబట్టి పోలీసు సూపరింటెండెంట్ లు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ స్థాయి ఉన్నతాధికారులు తరచుగా తహసీళ్లకు,గ్రామాలకు వెళ్లాలని, ఆ రోజు రాత్రి కి అక్కడ మకాం పెట్టాలని సూచించారు. దీంతోపాటుముఖ్యమైన పోలీస్ ఠాణాల పోలీసులు తమ తమ పరిధులలో నివసించే ప్రజలతో క్రమం తప్పక సంభాషిస్తూ ఉండాలని చెప్పారు.

   

                                          IMG-4355

 

 యువ పోలీసు అధికారులందరూ దేశ చట్టాలపట్ల, దేశ రాజ్యాంగం పట్ల విధేయతను కలిగిఉండాలని శ్రీ అమిత్‌ షా అన్నారు. నేర న్యాయ చట్టానికి సంబంధించిన కీలక బాధ్యతలువారి భుజస్కంధాల మీదనే ఉంటాయని, వాటి నిర్వహణ లో ఏమాత్రం తొందరపాటుదొర్లినా ఎవరో ఒకరికి అన్యాయం వాటిల్లుతుందని ఆయన అన్నారు.  కాబట్టి వారంతా అప్రమత్తంగా పనిచేయవలసిఉంటుందన్నారు. దేశం లోని ప్రతి పౌరునికీ రాజ్యాంగం రక్షణ హక్కును ప్రసాదించిందని,దానికి అనుగుణంగా వారికి భద్రతను కల్పించడంపోలీసుల కర్తవ్యంఅని వివరించారు.  మన ప్రథమహోం శాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ గారు దేశాన్నీ ఏకీకృతం చేయడంలో తిరుగులేని కృషి చేశారని శ్రీ షాపేర్కొన్నారు. ఆయన పాత్ర లేని ఆధునిక భారతాన్ని మనం ఊహించడం కూడా సాధ్యంకాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో అఖిల భారత సర్వీసులపై అనేకసందేహాలు ఉండేవని ఆయన గుర్తుచేశారు. అయితే, మనకు చక్కని అఖిల భారత సర్వీసు వ్యవస్థ లేకపోతే కేంద్రం ఉనికే ఉండదని,భారతదేశం ఏకీకృతం కావడం అసాధ్యమని సర్దార్‌పటేల్‌ గారు స్పష్టం చేశారన్నారు. అందువల్ల దేశ సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతంచేయడమేగాక, సమగ్రతను పరిరక్షించే బాధ్యత పోలీసుసిబ్బందిపైనే ఉందన్న వాస్తవాన్ని ఎల్లప్పటికీ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. 
 
   

                                             IMG-4357

శాస్త్రీయ పరిశోధన ఆవశ్యకతను గురించికేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా వివరిస్తూ, నేర పరిశోధన ఎంత శాస్త్రీయంగా, సాక్ష్యాధారాల సహితంగా ఉంటే మానవ వనరుల అవసరం అంత తక్కువగా ఉంటుందని  స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నమానవ వనరులను మెరుగుగాను, గరిష్ఠంగాను వాడుకోగల ప్రాజెక్టునుపోలీసు అధికారులు ప్రారంభించాలని ఆయన సూచన చేశారు. శాస్త్రీయ పరిశోధన పద్ధతినిప్రోత్సహించే దిశగా మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొందన్నారు. ఇందులో భాగంగాకిందటి సంవత్సరం లో ‘నేషనల్‌ రక్షా శక్తి యూనివర్సిటీ’ని, ‘నేషనల్‌ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ’ని ప్రారంభించినట్లు ఆయనగుర్తుచేశారు.  తద్వారా పరిశోధనలను నేరప్రదేశం నుంచి న్యాయస్థాదనం వరకు తీసుకుపోవడానికి వీలు అవుతుందని పేర్కొన్నారు.రానున్న దశాబ్దాలలో దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిస్థితి బలోపేతం చేయడంలో ఈ రెండువిశ్వవిద్యాలయాలు ప్రముఖ పాత్ర ను పోషించగలవన్నారు. గడచిన మూడు సంవత్సరాల లో సైబర్‌నేరాల నిరోధం లోనూ ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలను తీసుకొందని కేంద్ర హోం మంత్రిచెప్పారు. ఈ మేరకు సైబర్‌ నేర పరిశోధన-నియంత్రణ దిశగా నాలుగు కొత్త సంస్థలనుఏర్పాటు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలపై ప్రజల్లో సత్వర అవగాహననుకల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సైబర్‌ నేరాలతో పాటు ఆర్థిక నేరాలు, మాదకద్రవ్య నియంత్రణ దిశగానూ అనేక చర్యలు చేపట్టడం జరిగింది అని హోంమంత్రి తెలిపారు.పోలీసు కానిస్టేబుళ్ల ఉన్నతీకరణ నుగురించి నొక్కిచెబుతూ- ఇందుకోసం పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం కృషి చేయాలని శ్రీఅమిత్‌ షా చెప్పారు. పోలీసు బలగాల్లో 85 శాతంకానిస్టేబుళ్లేనని, పోలీసు వ్యవస్థలో ముఖ్య పాత్రవారిదేనని ఆయన తెలిపారు. వారికి మెరుగైన శిక్షణ, వారి ఆరోగ్యం, వారికి చక్కని పని పరిస్థితులు,వారి నివాస వసతి వంటి అంశాలపై శ్రద్ధవహించకపోతే మిగిలిన 15శాతం సిబ్బందితో వ్యవస్థను చక్కగానడపడం సాధ్యమేనా? అని శ్రీ అమిత్ షా ప్రశ్నించారు.పోలీసు సిబ్బందిలో అత్యంత కష్టతరమైన బాధ్యతలు నిర్వర్తించేది కానిస్టేబుళ్లేననిశ్రీ షా అన్నారు. కాబట్టి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడం, వారి పట్ల సౌహార్దత ను ప్రదర్శించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. 

 

                                                 IMG-4353
 

ఓటర్లు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలగలిస్తేనే ప్రజాస్వామ్యం సంపూర్ణం కాగలదని కేంద్ర హోంశాఖ మంత్రి అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పదవీకాలం ఐదేళ్లు మాత్రమేనని, ప్రభుత్వాధికారులు 30-35 సంవత్సరాలు సేవలందిస్తారని పేర్కొన్నారు. ఇక రాజ్యాంగ వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో ప్రొబేషనరీ పోలీసు అధికారులు ఒక ముఖ్యమైన భాగమని ఆయన అన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, గిరిజనుల సమస్యలపై వారు సున్నితత్వం, అవగాహన కలిగి ఉంటూ, దేశ ప్రగతి కోసం కృషిచేయాలని సూచించారు.

   ఓటర్లు అఖిలభారత సర్వీసుల అధికారులు... ముఖ్యంగా ఐపీఎస్‌ అధికారులు ప్రచారానికి దూరంగా ఉండాలని, ప్రచార యావ వారి పనితీరును దెబ్బతీస్తుందని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటం కష్టమే అయినా, పోలీసు అధికారులు వాటికి దూరంగా ఉంటే, తమ విధులపై దృష్టి పెట్టాలని చెప్పారు. పోలీసు అకాడమీని వదిలి వెళ్లేముందు శ్రీ షా మాట్లాడుతూ- ‘మనం చేసిన పని కేవలం ప్రచారం కోసమే చేశామా? అని నిత్యం ఆత్మవిమర్శ చేసుకుంటూ డైరీలో నమోదు చేసుకోవాలి’ అని సూచించారు.

   పోలీసు వ్యవస్థలో ‘పక్కకు తప్పించే పోస్టింగ్‌’ అన్నది వేళ్లూనుకున్నదని శ్రీ అమిత్‌ షా అన్నారు. అటువంటి పద్ధతుల గురించి ఆలోచించడం మానుకోవాలని, పోలీసు వ్యవస్థలో ప్రాముఖ్యంలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి యోచన ఉంటే వారు నిత్యం ఒత్తిడిలో ఉంటారని, ఫలితంగా బదిలీ అవుతామేమోనన్న భయంతో అనేక సందర్భాల్లో విధులను సవ్యంగా నిర్వర్తించలేరని శ్రీ షా పేర్కొన్నారు. బదిలీ అన్నది ఉద్యోగంలో ఒక భాగమని భావిస్తే మానసిక భారం, ఒత్తిడి గణనీయంగా తగ్గిపోతాయని ఆయన చెప్పారు. బదిలీ భయాన్ని వదిలించుకుంటే మీ విధులను మీరు మెరుగ్గా నిర్వర్తించగలరని ఉద్బోధించారు.

   భారత పోలీసు సర్వీసును ఎంచుకోవడంపై యువ అధికారులను కేంద్ర హోంమంత్రి  అభినందించారు. పనిచేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి వారు ఉత్సాహంతో ఉంటారని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలను ఈ యువ అధికారులు నెరవేర్చగలరన్న విశ్వాసం తనలో ఉందని శ్రీ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ 72వ బ్యాచ్‌ ప్రొబేషనరీ అధికారులతోపాటు నేపాల్‌, భూటాన్‌, మాల్దీవ్స్‌, మారిషస్‌ల నుంచి కూడా పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


(Release ID: 1732240) Visitor Counter : 529