ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ‌ వైద్యుల దినం నాడు డాక్ట‌ర్ల‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


క‌రోనా కాలం లో వైద్యులు అందించిన సేవ‌ల‌ కు, వారు చేసిన త్యాగాల‌ కు ఆయ‌న న‌మ‌స్సు లు అర్పించారు.

ఆరోగ్య రంగ బ‌డ్జెటు ను రెట్టింపు చేసి, 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లకు పైగా చేర్చడమైంది: ప్ర‌ధాన మంత్రి

కొత్త‌ గా, వేగం గా రూపు ను మార్చుకొంటున్న వైర‌స్ ను మ‌న వైద్యులు వారి అనుభ‌వం తోను, నైపుణ్యం తోను ఎదుర్కొంటున్నారు: ప్ర‌ధాన మంత్రి

వైద్యుల‌ సురక్ష కు ప్ర‌భుత్వం కట్టుబడి ఉంది: ప్ర‌ధాన మంత్రి

యోగ ప్ర‌యోజ‌నాల పై రుజువు ఆధారిత అధ్య‌య‌నాలు జ‌ర‌గాలంటూ పిలుపునిచ్చారు

డాక్యుమెంటేశన్ కు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు; స‌మ‌గ్రమైన డాక్యుమెంటేశన్ కు కోవిడ్ మ‌హ‌మ్మారి ఒక చక్క‌ని ఆరంభ బిందువు కాగ‌ల‌ద‌న్నారు

Posted On: 01 JUL 2021 3:37PM by PIB Hyderabad

ఈ రోజు న, వైద్యుల దినం సంద‌ర్భం లో, వైద్య స‌ముదాయాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.  ఈ రోజు ను, మన వైద్య స‌ముదాయం తాలూకు అత్యున్న‌త ఆద‌ర్శాల ప్ర‌తీక గా ఉన్న డాక్ట‌ర్ బి.సి. రాయ్ స్మృతి లో, జ‌రుపుకొంటున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు.  క‌రోనా తాలూకు గ‌త ఒక‌టిన్న‌ర సంవ‌త్సరాల క‌ఠిన కాలం లో వైద్యులు అందించిన సేవ‌ల కు 130 కోట్ల మంది భార‌తీయుల ప‌క్షాన ప్రధాన మంత్రి డాక్ట‌ర్ల కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ఈ రోజు న ఇండియ‌న్ మెడిక‌ల్ ఎసోసియేశ‌న్ (ఐఎమ్ఎ) వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా నిర్వ‌హించిన ఒక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్రసంగించారు.

 

వైద్యుల సేవ‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి గుర్తిస్తూ, క‌రోనా కాలం లో వారి వీరోచిత ప్ర‌యాస‌ల‌ ను జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.  మాన‌వ జాతి కి సేవ‌ల ను అందించ‌డం లో ప్రాణాల ను త్యాగం చేసిన వారంద‌రికీ ఆయ‌న శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టించారు.  క‌రోనా రువ్విన స‌వాళ్లు అన్నిటికి మ‌న శాస్త్రవేత్త‌ లు, మ‌న వైద్యులు ప‌రిష్కార మార్గాల‌ ను క‌నుగొన్నార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కొత్త‌ గా, వేగం గా రూపు ను మార్చుకొంటున్న వైర‌స్ తో మ‌న వైద్యులు వారికి ఉన్న అనుభ‌వం తో, వారికి ఉన్న నైపుణ్యం తో తలపడుతున్నారు అని ఆయ‌న చెప్పారు.  వైద్య సంబంధి మౌలిక సదుపాయాలను చాలా కాలం గా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రతిబంధకాల కు తోడు జనాభా ఒత్తిడి కూడా ఉన్నప్పటికీ, భార‌త‌దేశం లో ప్రతి లక్ష మంది లో సంక్రమణ, మరణాల రేటు లు అభివృద్ధి చెందుతున్న దేశాల తో పోల్చి చూసిన‌ప్పుడు ఇప్ప‌టికీ సంబాళించగలిగినంత స్థాయి లో ఉన్నాయి అని ఆయ‌న అన్నారు.  ప్రాణ న‌ష్టం అనేది ఎప్ప‌టికీ బాధాక‌ర‌మే  అయినప్పటికీ ఎంతో మంది ప్రాణాల‌ ను కాపాడ‌డం కూడా జ‌రిగింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ ఖ్యాతి అంతాను క‌ఠోరం గా శ్ర‌మిస్తున్న వైద్యుల‌ కు, ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క‌ర్త‌ల‌ కు, ముందువ‌రుస‌ లో నిల‌బ‌డి శ్ర‌మిస్తున్న ఉద్యోగుల‌కు దక్కుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 

 

ఆరోగ్య సంరక్ష‌ణ ను ప‌టిష్ట ప‌ర‌చ‌డం లో ప్ర‌భుత్వం తీసుకొంటున్న శ్ర‌ద్ధ ను గురించి ప్ర‌ధాన‌ మంత్రి నొక్కి చెప్పారు.  ‘ఫ‌స్ట్ వేవ్’ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం దాదాపు గా 15 వేల కోట్ల రూపాయ‌ల‌ ను కేటాయించ‌డ‌మైంది, మ‌రి ఈ సంవ‌త్స‌రం ఆరోగ్య రంగ బ‌డ్జెటు ను రెండింత‌లు చేసి 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు మించేట‌ట్లు చేయ‌డ‌మైంద‌ని వివరించారు.  50 వేల కోట్ల రూపాయ‌ల‌ ను సేవ‌ల కు అంత‌గా నోచుకోని ప్రాంతాల‌ లో ఆరోగ్య రంగ మౌలిక రంగ స‌దుపాయాల‌ ను అభివృద్ధి ప‌ర‌చ‌డం కోసం ఉద్దేశించిన ఒక ప‌ర‌ప‌తి హామీ ప‌థ‌కానికి గాను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు.  కొత్త ఎఐఐఎమ్ఎస్, నూతనం గా వైద్య క‌ళాశాల‌ల ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  2014 లో ఉన్న‌టువంటి మొత్తం ఆరు ఎఐఐఎమ్ఎస్ ల‌కు భిన్నం గా, 15 ఎఐఐఎమ్ఎస్ ల తాలూకు ప‌ని ని మొద‌లుపెట్ట‌డం జ‌రిగింద‌ని ఆయన వివ‌రించారు.  వైద్య క‌ళాశాల‌ ల సంఖ్య‌ ను ఒక‌టిన్న‌ర రెట్ల మేర‌కు పెంచ‌డ‌మైంద‌న్నారు.  అండ‌ర్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ సీట్లు ఒక‌టిన్న‌ర రెట్లు పెరిగాయ‌ని, పిజి సీట్లు 80 శాతం మేర‌కు వృద్ధి చెందాయ‌ని ప్ర‌ధాన మంత్రి తెలియ‌ జేశారు.

 

డాక్ట‌ర్ల సుర‌క్ష కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ పున‌రుద్ఘాటిచారు. వైద్యుల‌ కు వ్య‌తిరేకం గా హింస‌ ను అడ్డుకోవడం కోసం క‌ఠిన‌త‌ర చ‌ట్టాల‌ ను తీసుకు రావ‌డమైందని ఆయ‌న ప్ర‌స్తావించారు.  దీనితో పాటే కోవిడ్ యోధుల కోసం ఒక ఉచిత బీమా ర‌క్ష‌ణ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

 ప్ర‌జ‌లు కోవిడ్ సంబంధిత జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ ను పాటించేట‌ట్లు, టీకా మందును వేయించుకొనేట‌ట్లు వారికి ప్రేర‌ణ‌ ను క‌లుగ‌జేయ‌డాన్ని కొన‌సాగించ‌వ‌ల‌సిందంటూ వైద్యుల‌ కు ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.  యోగ గురించిన చైత‌న్యాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు  వైద్యుల ను ఆయ‌న ప్ర‌శంసించారు కూడాను.  యోగ ను గురించి ప్ర‌చారం చేసేందుకు స్వాతంత్య్రం అనంత‌రం గ‌డ‌చిన ద‌శాబ్దం లో కృషి జ‌ర‌గ‌వ‌ల‌సి ఉండ‌గాఆ కృషి ని ప్ర‌స్తుతం చేయ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  కోవిడ్ సోకి న‌య‌మైన త‌రువాత ఉత్ప‌న్నం అయ్యే స‌మ‌స్య‌ల‌ ను ప‌రిష్క‌రించ‌డం లో యోగ తాలూకు ప్ర‌యోజ‌నాల పై నిద‌ర్శ‌న ఆధారిత అధ్య‌య‌నాల  కోసం వైద్యులు వారి కాలాన్ని వెచ్చిస్తున్నందుకు వారిని ఆయ‌న పొగడారు.  ఈ యోగ కు సంబంధించిన నిద‌ర్శ‌న ఆధారిత అధ్య‌య‌నాల ను ఐఎమ్ఎ ఒక ఉద్య‌మం త‌ర‌హా లో చేప‌ట్ట‌గ‌లుగుతుందాఅని ప్ర‌ధాన మంత్రి అడిగారు.  యోగ కు సంబంధించిన అధ్య‌య‌నాల ను అంత‌ర్జాతీయ ప‌త్రిక‌ల లో ప్ర‌చురించ‌వచ్చు అని అని కూడా ఆయ‌న సూచ‌న చేశారు.

 

వైద్యులు వారి అనుభావాన్ని గ్రంథ‌స్తం చేయ‌డానికి పెద్ద పీట వేయాలి అని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  అనుభవాల తో పాటు, రోగుల రోగల‌క్ష‌ణాలు, చికిత్స ప్ర‌ణాళిక.. ప్ర‌తి దీ నివేదిక రూపం లో భ‌ద్ర‌ప‌ర‌చ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అని ఆయ‌న అన్నారు.  ఒక ప‌రిశోధ‌నాత్మ‌క అధ్య‌య‌నం రూపం లో దీనిని చేప‌ట్టుకోవ‌చ్చున‌ని, దీని ద్వారా వేరు వేరు మందుల ప్ర‌భావాల ను, చికిత్స‌ల ను గ‌మ‌నించుకోవచ్చున‌ని ఆయ‌న చెప్పారు.  మ‌న వైద్యులు సేవ‌ల ను అందించిన రోగుల సంఖ్య ను బ‌ట్టి చూసినంత మాత్రాన‌నే ప్ర‌పంచం లో ఏ ఇత‌ర దేశం క‌న్నా మ‌న డాక్ట‌ర్లు అగ్ర భాగాన నిల‌వ‌డం ఖాయ‌మ‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.  ప్ర‌పంచం ఈ సంగ‌తి ని ప‌రిశీల‌న లోకి తీసుకొని, ఈ విధ‌మైన విజ్ఞాన శాస్త్ర సంబంధి అధ్య‌య‌నాల తాలూకు ప్రయోజనాన్ని అందుకోవ‌ల‌సిన స‌మ‌యం ఆస‌న్నం అయింద‌న్నారు.  దీని కోసం కోవిడ్ మ‌హ‌మ్మారి ఒక చ‌క్క‌ని ఆరంభ బిందువు కాగ‌ల‌ద‌న్నారు.  టీకా మందులు ఏ విధంగా మ‌న‌కు సాయ‌ప‌డుతున్న‌దీ, ముందస్తు రోగ నిర్ధార‌ణ ఏ రకం గా మనకు తోడ్పడుతున్నదీ మ‌నం మ‌రింత తీవ్ర‌మైన అధ్య‌య‌నం చేయ‌గలిగితే ఎంత బావుణ్ణో కదా! అంటూ ప్ర‌ధాన మంత్రి ఆశ్చర్యాన్ని వ్య‌క్తం చేశారు. గ‌డ‌చిన శతాబ్దం లో త‌లెత్తిన మ‌హ‌మ్మారి ని గురించిన డాక్యుమెంటేశన్ ఏదీ కూడా అందుబాటు లో లేదు; కానీ ఇప్పుడు మ‌నం కోవిడ్ కు ఎదురొడ్డి నిలవడానికి సరిపడ సాంకేతిక విజ్ఞానాన్ని, డాక్యుమెంటేశన్ ను కలిగివున్నాం, ఇది మాన‌వాళి కి తోడ్ప‌డ‌గ‌లుగుతుందని చెప్తూ, ప్ర‌ధాన‌ మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

 (Release ID: 1731958) Visitor Counter : 199