మంత్రిమండలి

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పిఎమ్-జికెఎవై) ని 2021 జులై నుంచి 2021 నవంబరు వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం


ఎన్ఎఫ్ఎస్ఎ పరిధి లోకి వచ్చే లబ్ధిదారులు అందరికీ 2020 ఏప్రిల్-నవంబరు మధ్య కాలానికి పిఎమ్-జికెఎవై ని గత సంవత్సరం లో ప్రకటించిన ప్రభుత్వం

దాదాపు గా 80 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారులకు 8 నెలల కాలానికి గాను అదనం గా 5 కిలోల ఆహారధాన్యాల ను ఉచితం గా కేటాయించడమైంది

2021 లో పిఎమ్-జికెఎవై ని రెండు నెలల (మే మరియు జూన్) కాలానికి 26,602 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో  ప్రకటించడమైంది

పిఎమ్-జికెఎవై పథకాన్ని దీపావళి వరకు అంటే 2021లో నవంబరు వరకు మరో అయిదు నెలలు పాటు పొడిగించనున్నట్లు మాన్య ప్రధాన మంత్రి 2021 జూన్ 7 నాడు దేశ ప్రజల ను ఉద్దేశించి తాను చేసిన ప్రసంగం లో ప్రకటించారు

మరో 5 నెలల కాలానికి గాను సుమారు 67,266 కోట్ల రూపాయల మేరకు ఉండగల ఆర్థిక ప్రభావం ప్రసరించే 204 ఎల్ఎం టి ఆహార ధాన్యాల ను అదనం గా రమారమి 80 కోట్ల మంది ఎన్ఎఫ్ ఎస్ఎ లబ్ధిదారుల కు అందించడం జరుగుతుంది

ఈ అదనపు ఉచిత ఆహార ధాన్యాల ను ఎన్ఎఫ్ఎస్ఎ పరిధి లోని  లబ్ధిదారులకు నెలవారీ గా ఇస్తున్న నియమిత ఆహార ధాన్యాల కు మించి  కేటాయించడం జరుగుతుంది

ఈ అదనపు కేటాయింపు తాలూకు మొత్తం ఖర్చు ను భారత ప్రభుత్వం తానే భరిస్తుంది

Posted On: 23 JUN 2021 12:59PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న నాలుగో ద‌శ లో భాగం గా జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం (ఎన్ఎఫ్ఎస్ఎ.. అంత్యోద‌య అన్న యోజ‌న - ప్రాధాన్యత క‌లిగిన కుటుంబాలు) ప‌రిధి లోని 81.35 కోట్ల మంది వ్యక్తుల కు - వీరి లో ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌న బ‌దిలీ (డిబిటి) ప‌రిధి లోకి వ‌చ్చే లబ్ధిదారులు కూడా కలిసున్నారు- 5 నెలల పాటు అంటే 2021 జులై మొదలుకొని 2021 నవంబరు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కి 5 కిలో ల వంతు న ఉచితం గా అదనపు ఆహారధాన్యాల ను ఇచ్చేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.


2020వ సంవత్సరం లో, భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 (ఎన్ఎఫ్ఎస్ఎ) లో భాగంగా పేదలకు మేలు చేసే పిఎమ్ గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ పరిధి లోని లబ్ధిదారులు అందరికీ ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’’ (పిఎమ్-జికెవై) ని 2020 ఏప్రిల్-నవంబరు కాలానికి ప్రకటించింది. సుమారు 80 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఎ లబ్దిదారుల కు అదనం గా 5 కిలోల ఆహార ధాన్యాల ను (గోధుమలు లేదా బియ్యం), 8 నెలల కాలానికి (2020 ఏప్రిల్-నవంబర్ మధ్య) కేటాయించడమైంది. దీని ద్వారా, కోవిడ్-19 చెలరేగిన నేపథ్యంలో దేశం లో తలెత్తిన ఆర్థిక అంతరాయాల వల్ల పేదలు/ఇక్కట్టుల బారిన పడే లబ్ధిదారులు/కుటుంబాల కు ఆహార భద్రత కల్పించడానికి పూచీపడినట్లు అవుతుంది. పిఎమ్-జికెవై లో, (2020 ఏప్రిల్-నవంబర్ మధ్య), మొత్తం సుమారు 321 లక్షల ఎమ్ టి ఆహార ధాన్యాల ను విభాగం అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల (యుటి ల)కు కేటాయించింది. దాదాపు 305 లక్షల ఎమ్ టి ఆహార ధాన్యాల ను రాష్ట్రాలు/యుటి లు తీసుకోగా, ఇంచుమించు 298 ఎల్ఎమ్ టి ఆహార ధాన్యాలను (అంటే కేటాయించిన పరిమాణం లో దాదాపు గా 93 శాతం) దేశవ్యాప్తం గా పంపిణీ చేయడం జరిగింది.    

2021 లో, అప్పటికి కోవిడ్-19 మహమ్మారి దేశమంతటా తీవ్రంగా ఉండి, ఆర్థిక ఇబ్బందులు ఉత్పన్నం అయినందున, భారత ప్రభుత్వం పిఎమ్ జికెఎవై 2020 తరహా లోనే ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’’ (పిఎమ్-జికెఎవై) ని రెండు నెలల పాటు అంటే 2021 మే, 2021 జూన్ లకు సుమారు 26,602 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో అమలు చేయనున్నట్లు ప్రకటించింది.  దీనికోసం 79 ఎల్ఎమ్ టి కి పైగా ఆహార ధాన్యాల ను కేటాయించడం జరిగింది. పిఎమ్-జికెఎవై 2021 లో (2021 మే-జూన్), ఇంత వరకు, 76 లక్షల ఎమ్ టి కి పైగా ఆహార ధాన్యాల ను అంటే, కేటాయించిన ఆహార ధాన్యాల లో 96 శాతానికి పైగా, రాష్ట్రాలు/యుటిలు తీసుకొన్నాయి.  ఇంకా, 35 లక్షల ఎమ్ టి ఆహార ధాన్యాల కు పైగా (అంటే నెలవారీ కేటాయించిన దాని లో సుమారు 90 శాతం) రాష్ట్రాల కు/యుటిల కు 2021 మే నెల కోసం పంపిణీ చేయడమైంది.  23 లక్షల ఎమ్ టి కి పైగా ఆహార ధాన్యాల ను (అంటే నెలవారీ కేటాయింపు లో దాదాపు గా 59 శాతం) 2021 జూన్ నెల లో పంపిణీ చేయడం జరిగింది.  రమారమి 80 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారులు 2021 మే, 2021 జూన్ నెలల కు గాను 5 కిలోల అదనపు ఆహార ధాన్యాల ను ఉచితం గా అందుకొంటున్నారు.

దేశం లో కోవిడ్ 19 స్థితి కొనసాగుతూ ఉండటాన్ని సమీక్షించి, పేదల కు, అవసరమైన వర్గాల కు ఈ సంకట కాలం లో సాయపడటానికి గాను, మాన్య ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2021 జూన్ 7 నాడు దేశ ప్రజలను ఉద్దేశించి తాను చేసిన ప్రసంగం లో పిఎమ్ జికెఎవై (2021) పథకాన్ని మరొక అయిదు నెలల కాలం పాటు  దీపావళి వరకు అంటే 2021 నవంబరు దాకా పొడిగించనున్నట్లు ప్రకటించారు. అదనం గా 5 కిలోల ఆహార ధాన్యాల ను (గోధుమలు గాని, లేదా బియ్యం గాని) ఉచితం గా, మరొక 5 నెలల కాలానికి దాదాపు 80 కోట్ల మంది ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారులకు ఉచితం గా అందజేయడం జరుగుతుంది. దీనికి గాను 204 ఎల్ఎమ్ టి ఆహార ధాన్యాలను ఇవ్వవలసి వస్తుంది. ఈ పద్దు వల్ల పడే ఆర్థిక ప్రభావం 67,266 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.  ఈ అదనపు ఉచిత ఆహార ధాన్యాల కేటాయింపు, ఎన్ఎఫ్ఎస్ఎ లబ్ధిదారుల కు నెలవారీ గా కేటాయించిన నియమిత ఆహార ధాన్యాల కంటే మించి, ఉండబోతోంది.  పిఎమ్ జికెఎవై లో భాగం గా ఉండే ఈ అదనపు కేటాయింపు తాలూకు మొత్తం వ్యయాన్ని, అంతర్ రాష్ట్ర రవాణా ఖర్చు ను, డీలర్ ల మార్జిన్ ను వగైరాల ను కూడా కలిపి, రాష్ట్రాలు/యుటిల కు ఎలాంటి భాగం పంచకుండా భారత ప్రభుత్వం తానే భరించనుంది.  (Release ID: 1729717) Visitor Counter : 302