ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రస్తుతం వేరియంట్ ఆందోళన (వి.ఓ.సి) గా ఉన్న, డెల్టా ప్లస్ వేరియంట్ పై మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సూచనలిచిన - కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
డెల్టా ప్లస్ వేరియంట్ కనుగొన్న జిల్లాలు, క్లస్టర్లలో తక్షణ నియంత్రణ చర్యలు, మెరుగైన పరీక్ష, ట్రాకింగ్ తో పాటు టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని - ఆదేశాలు.
కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తుల నుండి తగినన్ని నమూనాలను తీసుకుని, వెంటనే ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. యొక్క నియమించబడిన ప్రయోగశాలలకు పంపాలి. తద్వారా రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా, సంక్రమణ రోగ విజ్ఞాన పరమైన విషయాలను తెలుసుకోవచ్చు.
Posted On:
22 JUN 2021 6:58PM by PIB Hyderabad
బహుళ-స్థాయి ఆరోగ్యం మరియు పరీక్షా మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేయడం ద్వారా మరియు రాష్ట్రాలతో చురుకైన సహకారంతో కేంద్రీకృత ప్రజారోగ్య చర్యల ద్వారా భారత ప్రభుత్వం సమర్థవంతమైన కోవిడ్-19 నిర్వహణ కోసం క్రియాశీలకంగా పని చేస్తోంది. "మొత్తం ప్రభుత్వ" విధానం కింద, సమర్థవంతమైన ప్రజారోగ్య ప్రతిస్పందనను అమలు చేసినందుకు కోవిడ్-19 నిరోధానికి కీలకమైన అంశాల పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.
ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. ఇటీవలి ఫలితాల ఆధారంగా, మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్-19 కి చెందిన డెల్టా ప్లస్ వేరియంట్ కనబడే అవకాశమున్న కొన్ని జిల్లాలను అప్రమత్తం చేయాలని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయా రాష్ట్రాలకు సూచించింది.
ఈ వేరియంట్ మహారాష్ట్ర లోని రత్నగిరి మరియు జల్గావ్ జిల్లాలు, కేరళలోని పాలక్కాడ్ మరియు పతనంతిట్ట జిల్లాలు, మధ్యప్రదేశ్ లోని భోపాల్ మరియు శివపురి జిల్లాల నుండి జన్యు శ్రేణి నమూనాలలో కనుగొనబడినట్లు, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఈ మూడు రాష్ట్రాలకు తెలియజేశారు.
ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. అనేది - కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, మొత్తం జన్యు శ్రేణి కోసం, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ; జీవ సాంకేతిక విజ్ఞాన శాఖ; భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్); శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్); లకు చెందిన 28 ప్రయోగశాలలతో ఏర్పడిన ఒక బృందం (కన్సార్షియం). ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. కేవలం, మొత్తం జన్యుశ్రేణి సీక్వెన్సింగ్ సమకూర్చడానికే కాకుండా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అవలంబించవలసిన తగిన ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలపై సకాలంలో సమాచారాన్ని అందించడానికి కూడా బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం వేరియంట్ ఆందోళన (వి.ఓ.సి) గా ఉన్న, డెల్టా ప్లస్ వేరియంట్ ఈ కింది లక్షణాలను కలిగి ఉందని ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. తెలియజేసింది:
* పెరిగిన ప్రసార సామర్ధ్యం.
* ఊపిరితిత్తుల కణాల గ్రాహకాలకు బలమైన బంధం
* మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రతిస్పందనలో సంభావ్య తగ్గింపు
ప్రజారోగ్య ప్రతిస్పందన చర్యలు, అంతకుముందు అమలు చేసినట్లు గా విస్తృతంగా మిగిలి ఉన్నప్పటికీ, మరింత దృష్టి మరియు ప్రభావవంతంగా మారాలని, మహారాష్ట్ర, కేరళ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. జిల్లాలు మరియు ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. గుర్తించిన క్లస్టర్ లలో - సమూహాలతోనూ, ప్రజలతోనూ కలవడాన్ని నివారించడం, విస్తృత పరీక్ష, ప్రాంప్ట్ ట్రేసింగ్ మరియు టీకా కవరేజ్ వంటి వాటితో సహా, తక్షణ నియంత్రణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు సూచించారు.
కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తుల నుండి తగినన్ని నమూనాలను తీసుకుని, వెంటనే ఐ.ఎన్.ఎస్.ఏ.సి.ఓ.జి. యొక్క నియమించబడిన ప్రయోగశాలలకు పంపేవిధంగా ఏర్పాట్లు చేయాలి. తద్వారా రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా, సంక్రమణ రోగ విజ్ఞాన పరమైన విషయాలను తెలుసుకోవచ్చు.
*****
(Release ID: 1729711)
Visitor Counter : 512