ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ టీకాల తాజా సమాచారం – 157వ రోజు


టీకాల పంపిణీలో కొత్త దశ ప్రారంభం; ఒక్క రోజులో 80 లక్షల టీకాల మైలురాయి దాటిన భారత్

Posted On: 21 JUN 2021 9:05PM by PIB Hyderabad

సార్వత్రిక టీకాల పంపిణీలో ఈరోజు సరికొత్త దశ మొదలైంది. మొదటి రోజునే 81 లక్షలకు పైగా  (80,95,314) టీకా డోసులు పంపిణీ చేయటం ద్వారా సరికొత్త మైలురాయి దాటినట్టయింది. ఇప్పుడు మొదలైన సరికొత్త దశను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2021 జూన్ 7న ప్రకటించారు. ప్రతి పౌరుడూ టీకా వేసుకోవాలని ఆ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. టీకాకు అర్హులైన వారందరినీ టీకాకు ప్రోత్సహించాలని కూడా చెప్పారు. కోవిడ్ మీద పోరులో ప్రభుత్వం పట్ల ప్రజలకున్న విశ్వాసానికి ప్రతీకే ఈ రోజు టీకాల సంఖ్యలో చూపిన పెరుగుదల.

 టీకాల పంపిణీని వేగవంతం చేయటంతోబాటు పరిధిని గణనీయంగా విస్తరించటం ద్వారా టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తోంది. మరిన్ని టీకా డోసుల అందుబాటు ద్వారా ఈ లక్ష్య సాధనకు కృషి జరుగుతోంది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు అందుబాటులొ ఉండే టీకాల సమాచారాన్ని అందించటం ద్వారా వారు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించటానికి, నిల్వకు, పంపిణీకి తగిన ఏర్పాట్లు చేసుకోవటానికి సాధ్యమవుతోంది. మే నెలలో 7.9 కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉండగా జూన్ లో ఆ సంఖ్యను గణనీయంగా పెంచటం ద్వారా ఇప్పుడు 11.78 కోట్ల డోసులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కేంద్రం ఉచితంగా ఇచ్చే డోసులతోబాటు రాష్టాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా కొనుగోలు చేసుకున్న టీకా డోసులు కూడా ఉన్నాయి.

జూన్ నెలలో ఎన్ని టీకా డోసులు అందుబాటులో ఉంటాయో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముందుగానే తెలియజేయటం వలన  పంపిణీ ప్రణాళికలు తయారుచేసుకొని జిల్లాలవారీగా కోవిడ్ పంపిణీ కేంద్రాల ద్వారా టీకాల కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసుకోవటానికి వెసులుబాటు కలిగింది. దీనివలన దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ భారీగా పెంచుకోవటం సాధ్యమైంది. 

 ఈ రోజు జరిగిన టీకాల పంపిణీ  వివరాలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు:

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

నేటి టీకాలు

అండమాన్, నికోబార్ దీవులు

783

ఆంధ్రప్రదేశ్

47328

అరుణాచల్ ప్రదేశ్

12892

అస్సాం 

330707

బీహార్

470352

చండీగఢ్

6738

చత్తీస్ గఢ్

84638

దాద్రా, నాగర్ హవేలి

4176

ఢిల్లీ

76216

గోవా

15586

గుజరాత్

502173

హర్యానా

472659

హిమాచల్ ప్రదేశ్

98169

జమ్మూ కశ్మీర్

32822

జార్ఖండ్

82708

కర్నాటక

1067734

కేరళ

261201

లద్దాఖ్

1288

లక్షదీవులు

289

మధ్యప్రదేశ్

1542632

మహారాష్ట

378945

మణిపూర్

6589

మేఘాలయ

13052

మిజోరం

17048

నాగాలాండ్

9745

ఒడిశా

280106

పుదుచ్చేరి

17207

పంజాబ్

90503

రాజస్థాన్

430439

సిక్కిం

11831

తమిళనాడు

328321

తెలంగాణ

146302

త్రిపుర

141848

ఉత్తరప్రదేశ్

674546

ఉత్తరాఖండ్

115376

పశ్చిమ బెంగాల్

317991

డామన్, డయ్యీ

4374

మొత్తం

80,95,314

 

***


(Release ID: 1729281) Visitor Counter : 250