విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్న పొసొకో
Posted On:
21 JUN 2021 12:55PM by PIB Hyderabad
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సిపిఎస్‌యు, భారతీయ గ్రిడ్ ఆపరేటర్ పొసొకో సోమవారం 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 600మంది ఉద్యోగులు వారి కుటుంబాలు ఇందులో పాలుపంచుకున్నారు. పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ (పొసొకో) ఈ యోగా సెషన్ ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో కలిసి నిర్వహించింది. ఈ ఏడాది ఇతివృత్తమైన ఆరోగ్యం/ సంక్షేమం కోసం యోగ - వ్యక్తి భౌతిక మానసిక ఆరోగ్యం కోసం యోగసాధనపై దృష్టి కేంద్రీకరించింది.

ఈ సందర్భంగా పొసొకో సిఎండి కె.వి.ఎస్ బాబా సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారు, భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కలిగించే యోగను ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులూ యోగను తమ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. యోగ జీవ క్రియను మెరుగుపరచడమే కాక, సరైన రక్తాన్ని ప్రవాహాన్నినిర్వహించడమే కాక, శ్వాస సంబంధిత, తదితర సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుందని చెప్పారు. అది మానసిక ఆరోగ్యాన్ని, భావోద్వేగపరమైన సమతుల్యతను నిర్మించడమే కాక భయం, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో పోరాడేందుకు తోడ్పడుతుందన్నారు.
గంటపాటు జరిగిన ఈ యోగ సెషన్ లో, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ నిపుణుడి సూచనలకు అనుగుణం అనేక యోగ ఆసనాలు, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు సహా ప్రాణాయామాన్ని సాధన చేశారు.
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలో పూర్తి భారత ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థ పొసొకో. గ్రిడ్ సమగ్ర కార్యకలాపాలను నమ్మకమైన, సమర్ధవంతమైన సురక్షిత రీతిలో నిర్వహించడం ఈ సంస్థ బాధ్యత.ఈ సంస్థ నిర్వహణలో ఐదు ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్లు, జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉన్నాయి.
***
(Release ID: 1729057)
Visitor Counter : 178