రైల్వే మంత్రిత్వ శాఖ

శ్రీనగర్ తో సహా కాశ్మీర్ లోయలో ఉన్న 15 రైల్వే స్టేషన్లు రైల్వే వైఫై వ్యవస్థతో అనుసంధానం

అనుసంధానం కాని వాటిని అనుసంధానం చేసే డిజిటల్ ఇండియా అమలులో ఇదో పెద్ద అడుగు.. శ్రీ పియూష్ గోయల్

Posted On: 20 JUN 2021 12:53PM by PIB Hyderabad

కాశ్మీర్ లోయలో శ్రీనగర్ తో సహా 15 రైల్వే స్టేషన్లు భారత రైల్వే  వైఫై నెట్‌వర్క్‌ అందిస్తున్న  6021 స్టేషన్లతో అనుసంధానం అయ్యాయి. 

రైల్ వైర్ పేరుతో భారతీయ రైల్వే అందిస్తున్న వైఫై సౌకర్యం కేంద్రపాలిత ప్రాంతమైన కాశ్మీర్ లోని నాలుగు జిల్లా ప్రధాన కేంద్రాలైన శ్రీనగర్బుడ్గావ్బనిహాల్ మరియు ఖాజిగుండ్ లలో ఉన్న 15 రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. బారాములాహమ్రేపట్టన్మజోమ్బుద్గామ్శ్రీనగర్పాంపూర్కాకాపోరాఅవంతిపురపంజ్‌గంబిజ్‌బెహారాఅనంత్‌నాగ్సాదురాఖాజిగుండ్బనిహాల్ రైల్వే స్టేషన్లలో రైల్ వైర్ వ్యవస్థ ఏర్పాటయింది. 

ఇప్పటికే వైఫై జమ్మూ లోని జమ్మూ-కతువాబుధిచాన్ అరోరియన్హీరా నగర్ఘగ్వాల్సాంబవిజయపూర్బారి బ్రాహ్మణజమ్మూ తవిబజల్టాసంగర్మన్వాల్రామ్ నగర్ లోని 15 స్టేషన్లలో అందుబాటులో ఉంది.

రైల్వే స్టేషన్లలో ప్రజలకు  వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే బాధ్యతను రైల్ టెల్ కు రైల్వే శాఖ అప్పగించింది. డిజిటల్ సౌకర్యాల కల్పనకు రైల్వే ప్లాట్‌ఫామ్‌ను వేదికగా చేయాలన్న లక్ష్యంతో ఈ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ప్రస్తుతం దేశంలోని 6000కు పైగా రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రపంచంలో అతి పెద్ద సమీకృత వైఫై వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది. 

శ్రీనగర్ తో సహా కాశ్మీర్ లోయలోని 15 రైల్వే స్టేషన్ లను రైల్ వైఫై తో అనుసంధానం చేసినట్టు రైల్వేవాణిజ్యపరిశ్రమలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ  మంత్రి శ్రీ పియూష్ గోయల్ ప్రకటించారు. ' ప్రజలను ఒక తాటిపైకి తెచ్చే అంశంలో వైఫై కీలకంగా ఉంటుంది. ఇది పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న తారతమ్యాన్ని వేగంగా తగ్గిస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు హైస్పీడ్ వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో భారతీయ రైల్వేలు కృషి చేస్తున్నాయి. ప్రపంచ వైఫై దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ లోయలో శ్రీనగర్ తో సహా 15 రైల్వే స్టేషన్లు 6000కి పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందిస్తూ ప్రపంచంలో అతి పెద్ద ప్రజా వైఫై వ్యవస్థగా గుర్తింపు పొందిన రైల్ వైఫై తో అనుసంధానం అయినట్టు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. దీనితో కాశ్మీర్ లోయలోని అన్ని రైల్వే స్టేషన్లలో వైఫై అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది. డిజిటల్ ఇండియా రూపకల్పనల ఇదో పెద్ద ముందడుగు. ఇది అనుసంధానం కాని వాటిని అనుసంధానం చేస్తుంది. దీనిని సాకారం చేయడానికి భారతీయ రైల్వేలు, రైల్‌టెల్ ను నేను అభినందిస్తున్నాను.' అని ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో శ్రీ పియూష్ గోయల్ పేర్కొన్నారు. 

వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వేలను కేంద్ర సిబ్బంది,  ప్రజా ఫిర్యాదులు మరియు  పెన్షన్ మంత్రిత్వ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ప్రజలను ఒకరితో ఒకరిని  చేరువలోకి తెచ్చే అంశంలో వైఫై కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన అన్నారు. సమస్యల పరిష్కారానికి డిజిటల్ పరిష్కారాలను వైఫై అందిస్తున్నదని అన్నారు. కోవిడ్ సమయంలో మానవ సంబంధాలు మరింత మెరుగు పడవలసి ఉన్న ఈ సమయంలో వైఫై ద్వారా రైల్వేలు ఈ పాత్రను నెరవేరుస్తున్నాయని ఆయన చెప్పారు. రైల్ వైర్ వ్యవస్థతో కాశ్మీర్ లోయలోని 15 రైల్వే స్టేషన్లను అనుసంధానం  చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ జితేంద్రసింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 

 ఉత్తమ ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడానికి రైల్వే స్టేషన్లలో ఏర్పాటుచేసిన వైఫై  సౌకర్యం కేవైసి గల స్మార్ట్‌ఫోన్ గల ఏ వినియోగదారుకైనా అందుబాటులో ఉంటుంది. 

ప్రజలను ఒకరితో ఒకరితో కలపడమే కాకుండా ఆవిష్కరణ మరియు అభివృద్ధికి గల అవకాశాలను వైఫై అందుబాటులోకి తెస్తుంది. డిజిటల్ తారతమ్యాన్ని తగ్గించడమే కాకుండా వైఫై సౌకర్యాన్ని అందరికి అందుబాటులో తీసుకుని రావాలన్న నినాదంతో   ఈ సంవత్సరం ప్రపంచ వై-ఫై దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.  భారతదేశంలో  పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ తారతమ్యత ఎక్కువగా ఉంది.  తక్కువ కనెక్టివిటీ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వైఫై సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమంలో భాగంగా  పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ తన సేవలను  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న  5000 రైల్వే స్టేషనలలో ఏర్పాటు చేసింది. 

దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పబ్లిక్ వై-ఫైను అందుబాటులోకి తేవడం  ద్వారా రైల్వే స్టేషన్లను డిజిటల్ హబ్‌గా మార్చడానికి భారత రైల్వే కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఇంతవరకు  6021 రైల్వే  స్టేషన్లు రైల్‌టెల్ వైఫై సౌకర్యాన్ని కలిగివున్నాయి. 

 

***



(Release ID: 1728786) Visitor Counter : 150