సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ఎంట‌ర్‌ప్రైజెస్ ఉద్యోగ్ ఆధార్ మెమొరాండంను 2021 మార్చి 31 నుంచి 2021 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు పొడిగింపు

Posted On: 17 JUN 2021 7:19PM by PIB Hyderabad

సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా, ఎంట‌ర్‌ప్రైజెస్ మంత్రిత్వ‌శాఖ‌, ఒరిజిన‌ల్ నోటిఫికేష‌న్ నెం. ఎస్‌.ఒ. 2119( ఇ) తేదీ 26-06-2020ను 16-06-2021తేదీ 2347 ( ఇ) ప్ర‌కారం దాని ఇఎం పార్ట్ -2, యుఎఎంఎస్ ల చెల్లుబాటును 31.03.2021 నుంచి 31.12.2021 వ‌ర‌కు పొడిగించ‌డం జ‌రిగింది.
ఇది ఇఎం పార్ట్ -2, యుఎఎంఎస్ క‌లిగిన వారు ప్ర‌స్తుత వివిధ ప‌థ‌కాల కింద గ‌ల నిబంధ‌ల‌న ప్ర‌కారం ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి వీలు క‌లుగుతుంది. అలాగే ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు ప్రాధాన్య‌తా రంగ రుణ ప్ర‌యోజ‌నాల‌ను కూడా క‌ల్పిస్తుంది.
ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల‌లో ఎం.ఎస్‌.ఎం.ఇలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని  అలాగే వివిధ ఎం.ఎస్‌.ఎం.ఇ అసోసియేష‌న్లు, ఆర్ధిక సంస్థ‌లు, ఎం.ఎస్‌.ఎం.ఇ రంగంతో వ్య‌వ‌హ‌రిస్తున్న వివిధ ప్ర‌భుత్వ విభాగాల నుంచి వ‌చ్చిన అభ్య‌ర్థ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.
ప్ర‌స్తుత ఇఎం పార్ట్ -2 , యుఎఎం హోల్డ‌ర్లు ఉద్యం కొత్త రిజిస్ట్రేష‌న్‌కు మార‌డానికి అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. దీనిని 2020 జూలై 1న ప్రారంభించారు. దీన ద్వారాప్ర‌భుత్వ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి అవ‌కాశం ఉంది. ఇది ఎం.ఎస్‌.ఎం.ఇల‌ను బలోపేతం చేయ‌డానికి ఉప‌క‌రిస్తుంది. ఫ‌లితంగా ఇది స‌త్వ‌ర రిక‌వ‌రీకి, వారి ఆర్ధిక కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేయ‌డానికి , ఉపాధి క‌ల్పించ‌డానికి వీలు క‌లుగుతుంది.
ఆస‌క్తిగ‌ల ఎంట‌ర్ ప్రైజ్‌ల‌వారు ఉచితంగా  https://udyamregistration.gov.in ఎలాంటి డాక్యుమెంట్లు అవ‌స‌రం లేకుండా రిజిస్ట‌ర్ చేయించుకోవ‌చ్చు.  ఉద్యం పోర్ట‌ల్‌లో రిజిస్ట‌ర్ చేయించుకోవ‌డానికి పాన్‌, ఆధార్ ఉంటే స‌రిపోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ పోర్ట‌ల్ 17.06.2021 (సాయంత్రం 5.26.43 గంట‌ల స‌మ‌యానికి 33,16,210 ఎంట‌ర్ ప్రైజ్‌ల రిజిస్ట్రేష‌న్‌, వ‌ర్గీక‌ర‌ణ‌కు వీలు క‌ల్పించింది.


 

*****(Release ID: 1728058) Visitor Counter : 183