ప్రధాన మంత్రి కార్యాలయం

వీవాటెక్ 5వ సంచిక లో కీలకోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి


తరువాతి మహమ్మారి కోసం మన గ్రహాన్ని సిద్ధం గా ఉంచవలసిన అవసరాన్ని నొక్కి చెప్పిన ప్రధాన మంత్రి

మహమ్మారి కాలం లో మనం సంకటాన్ని ఎదుర్కోవడం లోను, సంకటం తో ఒకరితో మరొకరు జత పడి సంప్రదింపులను కొనసాగించడం లోను,చిన్న చోటు నుంచి అయినా సరే  పనిచేయడం లోను, ఓదార్పు ను పొందడం లోను డిజిటల్ టెక్నాలజీ మనకు సహాయపడింది: ప్రధానమంత్రి

అంతరాయం అంటే నిరాశ అని అర్ధం కాదు, మనం మరమ్మతు మరియు తయారీ అనేటటువంటి జోడు పునాదుల పైన శ్రద్ధతీసుకోవాలి: ప్రధాన మంత్రి 

మన భూమి కి ఎదురయ్యే సవాళ్ళ ను సామూహిక భావన తో, మానవ కేంద్రిత దృష్టికోణంతో మాత్రమే అధిగమించగలం: ప్రధాన మంత్రి 

ఈ మహమ్మారి మన ప్రతిఘాతకత్వాన్ని మాత్రమే కాక, మన కల్పన కు కూడాను ఒక పరీక్షాకాలం; అది అందరికీ మరింత ఎక్కువ సమ్మిళితమైనటువంటి, సంరక్షణభరితం అయినటువంటి మరియు స్థిరమైన భవిష్యత్తు నునిర్మించుకొనేందుకు ఒక అవకాశం వంటిది: ప్రధాన మంత్రి 

భారతదేశం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్ ల లోఒకటి గా ఉంది; భారతదేశం నూతన ఆవిష్కర్త లకు, పెట్టుబడిదారుల కు అవసరమైన వాటిని ఇవ్వజూపుతోంది: ప్రధాన మంత్రి 

ప్రతిభ, బజారు, మూలధనం, ఇకో-సిస్టమ్, బహిరంగ సంస్కృతి అనే ఐదు అంశాల ను పరిశీలించి భారతదేశం లోపెట్టుబడులు పెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను నేను ఆహ్వానిస్తున్నాను : ప్రధానమంత్రి 

ఫ్రాన్స్, యూరోప్ లు మా ముఖ్య భాగస్వాములు,మా భాగస్వామ్యాలు మానవాళి సేవ లో ఓ ప్రధానఉద్దేశ్యాన్ని నెరవేర్చవలసివుంది: ప్రధాన మంత్రి 

Posted On: 16 JUN 2021 4:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీవాటెక్ 5వ సంచిక ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసాన్ని ఇచ్చారు. ప్రధాన మంత్రి ని 2016 నుంచి ప్రతి సంవత్సరం పారిస్‌లో నిర్వహిస్తున్నటువంటి వీవాటెక్-2021ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేయాలంటూ ముఖ్య అతిథి గా ఆహ్వానించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం యూరోప్ లోకెల్లా అతి పెద్ద డిజిటల్, స్టార్ట్- అప్ కార్యక్రమాలలో ఒక కార్యక్రమంగా ఉంది.

 

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ భారతదేశం, ఫ్రాన్స్‌ లు వివిధ రంగాల లో కలసి పనిచేస్తూ వస్తున్నాయన్నారు. వీటిలో, సాంకేతిక విజ్ఞానం, డిజిటల్ సహకారం తాలూకు వర్ధమాన రంగాలు కూడా కలసి ఉన్నాయి. ఇలాంటి సహకారాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం వర్తమాన కాలాన్ని బట్టి చూస్తే ఎంతయినా అవసరం. దీనితో మన దేశాల కు మాత్రమే కాక యావత్తు ప్రపంచానికి కూడా చాలా వరకు సహాయం అందుతుందని ఆయన అన్నారు. ఇన్ఫోసిస్ ఫ్రెంచ్ ఓపన్ టూర్నమెంట్ కు సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని, ఎటోస్, కేప్ జెమినీ ల వంటి ఫ్రాన్స్ కంపెనీల తో కలసి సాగుతోందని, అలాగే భారతదేశానికి చెందిన టిసిఎస్, విప్రో లు ప్రపంచవ్యాప్తం గా కంపెనీల కు, సేవలను అందిస్తున్న రెండు దేశాల ఐటి ప్రతిభ కు ఉదాహరణలు గా ఉన్నాయని శ్రీ మోదీ అన్నారు.

సంప్రదాయం విఫలం అయిన చోట నూతన ఆవిష్కరణ తో సాయం లభిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి కాలం లో డిజిటల్ టెక్నాలజీ మనకు సంకటాన్ని ఎదుర్కోవడం లోను, ఒకరితో మరొకరు జత పడి సంప్రదింపులు జరుపుకోవడం లోను, హాయి గా కాలాన్ని గడపడం లోను, సాంత్వన ను పొందడం లోను తోడ్పడింది అని ఆయన అన్నారు. భారతదేశ సార్వత్రిక, ప్రత్యేక బయో మెట్రిక్ డిజిటల్ గుర్తింపు వ్యవస్థ అయినటువంటి ఆధార్పేదల కు కాలబద్ధ ఆర్థిక సహాయాన్ని అందించడం లో ఊతం గా నిలచిందని ఆయన చెప్పారు. ‘‘మేం 800 మిలియన్ మంది కి ఉచిత భోజనాన్ని సరఫరా చేయగలిగాం; అనేక కుటుంబాల కు వంట గ్యాసు సబ్సిడి ని ఇచ్చాం. భారతదేశం లో మేం తక్కువ సమయం లో విద్యార్థుల కు సాయపడటం కోసం రెండు ప్రభుత్వ డిజిటల్ విద్య కార్యక్రమాలు స్వయమ్’, ‘దీక్షలను నిర్వహించగలిగాం’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.

 

మహమ్మారి విసరిన సవాలు ను అధిగమించడం లో స్టార్ట్- అప్ రంగం పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. పిపిఇ కిట్ లు, మాస్క్ లు, పరీక్షలు చేయడానికి వినియోగించే వస్తు సామగ్రి వంటి వాటి కొరత ను తీర్చడం లో ప్రైవేటు రంగం ముఖ్య పాత్ర ను పోషించింది. వైద్యులు టెలి-మెడిసిన్‌ విధానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించి కోవిడ్, మరికొన్ని కోవిడ్ యేతర సమస్యల ను వర్చువల్ మాధ్యమం ద్వారా వైద్యులు పరిష్కరించగలిగారు. రెండు టీకామందులను భారతదేశంలో తయారు చేయడం జరుగుతోంది. మరిన్ని టీకా లు అభివృద్ధి దశ లో గాని, లేదా పరీక్ష ల దశ లో గాని ఉన్నాయి. స్వదేశీ ఐటి ప్లాట్ ఫార్మ్ ఆరోగ్య సేతు కాంటాక్ట్ ట్రేసింగు ను ప్రభావవంతమైన విధం గా అమలుపరచిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. అదేవిధంగా కోవిన్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ తో ముందుగానే లక్షల కొద్దీ మంది కి టీకా సంబంధి సమాచారాన్ని అందించడం లోను, టీకామందు ను ఇప్పించడానికి గాను వ్యక్తుల పేరుల ను నమోదు చేయడం లోను సహాయం అందింది.

 

ప్రపంచం లోనే అతిపెద్ద స్టార్ట్- అప్ ఇకోసిస్టమ్ లలో భారతదేశం ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవలి సంవత్సరాలలో అనేక ప్రత్యేక యునికార్న్ లు ప్రారంభమయ్యాయి. నూతన ఆవిష్కర్తల కు, పెట్టుబడిదారుల కు అవసరమైన వాటిని భారతదేశం అందిస్తోంది. ప్రతిభ, బజారు, మూలధనం, ఇకోసిస్టమ్, బహిరంగ సంస్కృతి అనే ఐదు స్తంభాల ఆధారంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, ఆయన, ఈ సందర్భంగా, ప్రపంచ దేశాలను ఆహ్వానించారు. భారతీయుల ప్రతిభ, మొబైల్ ఫోన్ ల విస్తృతి, ఏడు వందల డెబ్బై ఐదు మిలియన్ మంది ఇంటర్ నెట్ వినియోగదారులు, ప్రపంచంలో అత్యధిక మరియు చౌకైన డేటా వినియోగం లతో పాటు అత్యధిక స్థాయి లో సామాజిక మాధ్యమం ఉపయోగం వంటి అంశాలు పెట్టుబడిదారులను భారతదేశానికి ఆహ్వానించడానికి ఉన్న బలాలు అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

 

ప్రజల కు అందుబాటు లో అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు, లక్షా యాభై ఆరు వేల విలేజ్ కౌన్సిల్ ల ను కలుపుతూ ఐదు వందల ఇరవై మూడు వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్, దేశవ్యాప్తం గా సార్వజనిక వై-ఫై నెట్‌వర్క్‌ లు వంటి అనేక కార్యక్రమాల గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు. ఆవిష్కరణల సంస్కృతి ని పెంపొందించే ప్రయత్నాలను కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. అటల్ ఇన్నోవేశన్ మిశన్ లో భాగం గా ఏడు వేల ఐదు వందల పాఠశాలల్లో ఆధునిక ఇన్నోవేశన్ ల్యాబ్స్ ఏర్పాటు అయినట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు.

 

గత ఏడాది, వివిధ రంగాలలో జరిగిన అంతరాయం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, అంతరాయం అంటే నిరాశ అని అర్థం చేసుకోకూడదని, అందుకు బదులుగా, మరమ్మత్తు మరియు సన్నద్ధత అనే జంట పునాదులపై మనం దృష్టి పెట్టాలని, వివరించారు. ‘‘గత ఏడాది, ఈ సమయానికి, ప్రపంచం ఇంకా టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం, మనకు కొన్ని టీకామందులు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా, మనం ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల తో పాటు మన ఆర్థిక వ్యవస్థల ను కూడా మరమ్మతు చేసే ప్రయత్నాలను కొనసాగించవలసివుంది. భారతదేశం లో మేం వివిధ రంగాల లో .. అది గనుల తవ్వకం రంగం కానివ్వండి, అంతరిక్షం, బ్యాంకింగ్ వ్యవహారాలూ, అణు శక్తి, మరి అనేక రంగాలు కానివ్వండి.. పెద్ద ఎత్తున సంస్కరణల ను తీసుకువచ్చాం. మహమ్మారి కాలం లోనూ, మార్పుల ను స్వీకరించేందుకు, చురుకైందిగాను నిలచేందుకు ఒక దేశం గా భారతదేశం తగినది అని ఈ పరిణామం నిరూపించిందిఅని శ్రీ మోదీ వివరించారు.

 

తరువాతి మహమ్మారి వల్ల మన గ్రహానికి ఎలాంటి ఆపద వాటిల్లకుండా చూసుకోవలసిన అవసరం ఉందని కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పర్యావరణ క్షీణత ను నిలువరించే దీర్ఘకాలిక జీవన శైలుల పై మనం దృష్టి ని సారించాలి. నూతన ఆవిష్కరణల తో పాటు పరిశోధనల ను పెంచడంలో సహకారాన్ని పటిష్టపరచుకోవాలి. ఈ సవాలు ను అధిగమించడానికి సమష్టి స్ఫూర్తి తో, మానవ కేంద్రిత విధానం తో నాయకత్వం వహించి పని చేయాలి అని ప్రధాన మంత్రి స్టార్ట్- అప్ ల సముదాయానికి పిలుపునిచ్చారు. ‘‘స్టార్ట్- అప్ ల లోకం లో యువతదే పైచేయి గా ఉంది. వారికి గతం నుంచి వచ్చిపడినటువంటి బాధ్యతల బరువు అనేది ఏదీ లేదు. ప్రపంచ పరివర్తన కు అవసరమైన శక్తి ని వారు చాలా చక్కగా ధారపోయగలరు. ఆరోగ్య సంరక్షణ, వ్యర్థాల పునర్వినియోగం, వ్యవసాయం, నేర్చుకోవడం కోసం నూతన యుగ సాధనాల నిర్మాణం సహా పర్యావరణ అనుకూల సాంకేతిక విజ్ఞ‌ానం వంటి రంగాల లో మన స్టార్ట్- అప్ లు దూసుకుపోవాలిఅని ప్రధాన మంత్రి సూచించారు.

 

భారతదేశం ముఖ్య భాగస్వాముల లో ఫ్రాన్స్, యూరోప్ లు ఉన్నాయని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. మే నెల లో పోర్టో లో ఇయు నేతల తో శిఖర సమ్మేళనం లో అధ్యక్షుడు మాన్య శ్రీ మేక్రోన్ తో కలసి తాను జరిపిన సంభాషణ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, స్టార్ట్- అప్ ల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు డిజిటల్ భాగస్వామ్యం ఒక ముఖ్య ప్రాధాన్యం రూపం లో ఎదిగింది అని పేర్కొన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం లో నాయకత్వం సాధించడం అనేది ఆర్థిక బలానికి, ఉద్యోగాలకు, సమృద్ధి కి చోదకం గా ఉంటోంది అని చరిత్ర చెప్పింది. అయితే, మన భాగస్వామ్యాలు మానవాళి సేవ అనే ఒక విశాల ప్రయోజనానికి సైతం ఉపయోగపడాలి. ఈ మహమ్మారి మన ప్రతిఘాతకత్వానికి ఒక పరీక్షే కాక మన కల్పన కు కూడా పరీక్ష. అది అందరి కోసం మరిన్ని అవకాశాలు అందించేటటువంటి, శ్రద్ధ వహించేటటువంటి, దీర్ఘకాలికమైనటువంటి భవిష్యత్తు ను నిర్మించుకోవాలనే మన కల్పన శక్తి కి ఇది ఒక అవకాశం’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

***



(Release ID: 1727818) Visitor Counter : 172