వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వ్యవసాయం, ముతక ధాన్యాల పంపిణీని ప్రోత్సహించడానికి నిబంధనలను సవరించాల్సిన సమయమిది: శ్రీ పియూష్ గోయల్
- ఉపాంత రైతులకు సహాయం చేయడానికి, వ్యవసాయం, ముతక ధాన్యాల సేకరణ పెంచడం అవసరం: శ్రీ గోయల్
- మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు మొదలైనవి మంచి ఆరోగ్యానికి మాత్రమే కాదు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తాయి
- భారతదేశంలో ముతక ఆహార ధాన్యాల సేకరణ, పంపిణీ, ప్రజలకు తగినట్టు
అందుబాటులో ఉంచేందుకు, పాతస్టాక్‌ను పారవేసేందుకు గాను విధానపరమైన ఫ్రేమ్ వర్క్‌ను సమీక్షించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ, రైల్వే, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్
Posted On:
15 JUN 2021 7:09PM by PIB Hyderabad
"భారత దేశంలో ముతక ధాన్యాల సాగు మరియు పంపిణీని ప్రోత్సహించడానికి నిబంధనలను సవరించడానికి సమయం ఆసన్నమైంది" అని కేంద్ర ఆహారం మరియు ప్రజా పంపిణి, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వే, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ముతక ఆహార ధాన్యాల సేకరణ.., పంపిణీ.., ప్రజలకు తగినట్టుగా వాటిని అందుబాటులో ఉంచడం, పాత స్టాక్‌ను పారవేడానికి గాను అవసరమైన విధానపరమైన ఫ్రేమ్ వర్క్‌ను కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్
ఈ రోజు సమీక్షించారు. ముతక ధాన్యాల వ్యవసాయం మరియు సేకరణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఆహార, ప్రజా పంపిణీ శాఖ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలోని పలు విభాగాలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు మొదలైనవి మంచి ఆరోగ్యానికి మాత్రమే కాదు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తాయని అన్నారు. దేశంలో చిరుధాన్యాలను ప్రొత్సహించాల్సిన ఆవశ్యకతను ఇటీవల ప్రధాని ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ-2023 సంవత్సరాన్ని "ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్"గా ప్రకటించింది. విధాన మార్గదర్శకాలలో ఈ సవరణను దృష్టిలో ఉంచుకొని ముతక ధాన్యాల సేకరణ, పంపిణీ, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నిబంధనలను సవరించడం వల్ల ముతక ధాన్యం సేకరణను ప్రోత్సహిస్తామని మంత్రి చెప్పారు. ముతక ధాన్యాలు మంచి పౌష్టికాహారంగా ఉండటం వలన వీటి సాగు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దారితీస్తుంది. పంటల యొక్క వైవిధ్యీకరణను, వాటి సేకరణను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ ధాన్యాల రీసైక్లింగ్‌కు అవకాశాలను నివారించేందుకు గాను మునుపటి స్టాక్‌లను పారవేసిన తర్వాత మాత్రమే సేకరణకు అనుమతి ఇవ్వబడుతుంది. ముతక ధాన్యాల వినియోగించే రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా అంతర్రాష్ట్ర రవాణా
చేపట్టడం. ఉపాంత, నీటిపారుదల భూమిలో చిరుధాన్యాలను పండిస్తారు. ఇది సేకరణ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సహాయపడుతుంది. మిల్లెట్లు ఎంతగానో పౌష్టికమైనవి. ఇవి దేశం పౌష్టికాహార లోపాలకు వ్యతిరేకంగా తగిన పోరాడటానికి సహాయపడుతుంది. చిరుధాన్యాలు పర్యావరణ అనుకూలమైనవి. అందువల్ల ఇవి స్థిరమైన సాగును ప్రోత్సహించడంలోను మరియు పర్యావరణ పరిరక్షణలోను సహాయపడతాయి. స్థానిక సేకరణ మరియు స్థానిక వినియోగం రవాణా మరియు ఇతర తృణధాన్యాలు.. తప్పనిసరైన రవాణాను కూడా ఆదా
చేస్తుంది. కొన్ని ముతక ధాన్యాల నిల్వ సమయం మూడు నెలల కన్నా కూడా ఎక్కువ. ముతక ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు / ఎఫ్‌సీఐ రైతుల నుండి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సేకరిస్తాయి. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పరిధిలో ఉన్న ప్రధాన ముతక ధాన్యాల పంటలలో జొన్న (హైబ్రిడ్), జొన్న (మాల్దాండి), సజ్జలు, రాగి, మొక్కజొన్న, బార్లీ ఉన్నాయి. అన్ని మిల్లెట్స్, మొక్కజొన్న మరియు బార్లీలను ముతక ధాన్యాలు అంటారు. కేఎంఎస్ 2020-21 కాలంలో భారతదేశంలో మొత్తం 3,04,914 మంది రైతులు లబ్ధిని పొందారు. 2020-21 సంవత్సరంలో.. మొత్తం 1162886 (11.62 ఎల్‌ఎమ్‌టీల) ముతక ధాన్యాలు సేకరించబడ్డాయి. ముతక ధాన్యాల కోసం 21.03.2014 నాటి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన సేకరణ కాలం మూడు నెలలు దాటి ఉండకూడదు. వాటి సేకరణ కాలం కూడా సాధారణ పంట కోత ముగిసినప్పటి నుండి ఒక నెల దాటి ఉండకూడదు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ముతక ధాన్యాల సేకరణ మరియు పంపిణీ కోసం రాష్ట్రాలకు గరిష్టంగా 6 నెలల సమయం ఇవ్వబడుతుంది.
****
(Release ID: 1727405)
Visitor Counter : 249