పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలో సీ ప్లేన్ సేవల అభివృద్ధికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందంపై ఈరోజు సంతకాలు చేశాయి.
కొత్త నీటి ఏరోడ్రోమ్ల అభివృద్ధిని వేగవంతం చేయడంలో మరియు భారతదేశంలో కొత్త సీప్లేన్ మార్గాల కార్యాచరణను వేగవంతం చేయడానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది: హర్దీప్ పూరి
సీప్లేన్స్ ట్రాన్స్పోర్టేషన్తో దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడం ద్వారా పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం.. పర్యాటక రంగానికి ప్రోత్సాహన్నివ్వడానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుంది: శ్రీ మన్సుఖ్ మాండవియా
, ద్వారా మరియు పర్యాటక రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచడానికి అవగాహన ఒప్పందం: మన్సుఖ్ మాండవియా
Posted On:
15 JUN 2021 3:41PM by PIB Hyderabad
భారతదేశంలో సీ ప్లేన్ సేవల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఓడరేవు, షిప్పింగ్, జలమార్గాల సహాయ మంత్రి(ఇన్చార్జ్) మన్సుఖ్ మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు.
సీప్లేన్ ప్రాజెక్టును త్వరగా సాకారం చేయడంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం ఓ ప్రధాన మైలురాయి. భారత ప్రభుత్వ ఆర్‌సిఎస్-ఉడాన్ పథకం కింద భారతదేశ ప్రాదేశిక పరిధిలో సీప్లేన్ సేవల యొక్క నాన్ షెడ్యూల్డ్ / షెడ్యూల్డ్ ఆపరేషన్స్ను అభివృద్ధి చేయాలని ఈ అవగాహన ఒప్పందం సంకల్పించింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం.. సీప్లేన్ సేవల కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేయడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ , పర్యాటక మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ మూడు మంత్రిత్వశాఖల అన్ని ఏజెన్సీలు వివిధ ప్రదేశాల్లో గుర్తించిన/ సూచించిన విధంగా సీప్లేన్ ఆపరేటింగ్ మార్గాల కార్యాచరణను పరిశీలిస్తాయి.
ఓడరేవులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ ఏరోడ్రోమ్స్ / ప్రదేశాల యొక్క జలముఖ మౌలిక సదుపాయాలను గుర్తించి, అభివృద్ధి చేస్తుంది. పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ, ఏఏఐలతో సమన్వయం చేసుకుంటూ సీప్లేన్ కార్యకలాపాల అభివృద్ధికి అవసరమైన చట్టబద్దమైన అనుమతులు, అమోదాలను పొందుతుంది.
పౌరవిమానయాన మంత్రిత్వశాఖ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా సామర్థ్యమున్న విమానయాన ఆపరేటర్లను ఎంపిక చేస్తుంది. ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖ ఉడాన్ పథకం కింద గుర్తించిన ప్రదేశాలను, మార్గాలను కలుపుతుంది. అంతేకాకుండా
ఆర్‌సిఎస్-ఉడాన్ పథకం కింద ఇవ్వబడిన నీటి ఏరోడ్రోమ్‌లకు సంబంధించి నిధులు / ఆర్థిక సహాయం అందించడం, సీప్లేన్స్ కార్యకలాపాల కోసం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమన్వయం చేసుకోవడం వంటి బాధ్యతలను పౌరవిమానయానశాఖ నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి(ఇన్చార్జ్) హర్దీప్సింగ్ పూరీ మాట్లాడుతూ.. నీటి ఏరోడ్రోమ్ల అభివృద్ధిని వేగవంతం చయడంతోపాటు భారతదేశంలో కొత్త సీప్లేన్ మార్గాల నిర్వహణకు ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుందని, భారతదేశంలో కొత్త తరహా పర్యాటక సేవలను అందించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల సహాయమంత్రి(ఇన్చార్జ్) మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతీయ సముద్రయాన, పౌరవిమానయాన రంగాల్లో ఈ అవగాహన ఒప్పందం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందన్నారు. సీప్లేన్ ట్రాన్స్పోర్ట్తో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందన్నారు.
***
(Release ID: 1727369)
Visitor Counter : 196