ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పుకార్లు-నిజాలు
గ్రామీణ ప్రాంతాల్లో సమర్థవంతమైన కోవిడ్-19 యాజమాన్యం దిశలో భారత ప్రభుత్వం కృషి;
గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం;
రాష్ట్రాల సహకారంతో ప్రజారోగ్యంపై దృష్టి
Posted On:
12 JUN 2021 3:03PM by PIB Hyderabad
ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పనలోనూ, సేవలు అందించటంలోను భారత ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగానే ఉన్నట్టు కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు, ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతాలు కనబడటం లేదనట్టు ఆ వార్తలున్నాయి.
నిజానికి భారత ప్రభుత్వం గ్రామీన ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ వస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, భాగస్వామ్యం తీసుకుంటూ వస్తోంది. ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలను పెంచటమన్నది నిరంతర ప్రక్రియ. వివిధ విధానాలు, పథకాలు, ప్రజారోగ్య చొరవల ద్వారా వెనుకబడిన భౌగోళిక ప్రాంతాల మీద దృష్టిసారిస్తూ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల చురుకైన భాగస్వామ్యంతో గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయటానికి భారత ప్రభుత్వం కృషి చేస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆరోగ్య వసతుల విస్తృతమైన నెట్ వర్క్ ఉంది. 2020 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,55,404 ఉప ఆరోగ్య కేంద్రాలు, 24,918 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5,895 పట్టణప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అదనంగా 2018 ఏప్రిల్ లో ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు భారత ఆరోగ్య చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. ఇప్పటివరకు 75,995 కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. అందులో 50,961 ఉప ఆరోగ్య కేంద్రాలు, 21,037 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 3,997 పట్టణప్రాంత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,50,000 ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 2022 డిసెంబర్ నాటికి ఆయుష్మాన్ భారత్ హెల్త్, వెల్ నెస్ కేంద్రాలుగా మార్చటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ విధంగా సమగ్ర వైద్య సేవలు అందిస్తారు. అందులో భాగంగా వ్యాధి నిరోధానికి, ఆరోగ్యం మెరుగుదలకు స్థానికంగానే దోహదపడాలన్నది లక్ష్యం. ఉచితంగా, సార్వజనీనంగా గ్రామీణ, పట్టణప్రాంతాలవారికి అత్యంత సమీపంలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రజల శ్రేయస్సుమీద దృష్టిపెట్టాలని నిర్ణయించారు.
బీఎస్సీ నర్సింగ్, బి ఎ ఎం ఎస్ లాంటి అర్హతలున్న డాక్టర్లు కాని వైద్య రంగ నిపుణులను శిక్షణ ద్వారా తయారు చేసి ఒక కొత్తరకం వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావటం కూడా ఇందులో భాగం. వాళ్ళకు కమ్యూనిటీ హెల్స్ ఆఫీసర్ అనే హోదా కల్పించి ఉప ఆరోగ్య కేంద్రాలను నిర్వహించేలా చూస్తారు. ఇతర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు కూడా వీరికి సహాయంగా ఉంటారు.
· ఉచితంగా అవసరమైన మందులిస్తారు. ఉప ఆరోగ్య కేంద్రాలలో 105 రకాల మందులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 172 రకాల మందులు అందుబాటులో ఉంటాయి.
· ప్రాథమిక ఆరోగ్య సేవల్లో ముఖ్యమైన లింగ సమానత్వం లాంటి విషయాలలో హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు దాదాపు 50.29 కోట్లమంది ప్రజలు ఈ కేంద్రాలలో సేవలు అందుకోగా వారిలో 54% మంది మహిళలే ఉన్నారు.
· ఈ కేంద్రాల ద్వారా అందే సేవలలో ముందస్తు ఆరోగ్య రక్షణ చాలా ముఖ్యమైనది. స్థానిక ఆరోగ్య సిబ్బంది అయిన ఎ ఎన్ ఎం లు, ఆశా కార్యకర్తలు 30 ఏళ్ళు పైబడిన జనాభా వివరాలు సేకరించి వాళ్ల రిస్క్ స్థాయిని లెక్కగడతారు. తీవ్రమైన అనారోగ్య లక్షణాలున్నవారి వివరాలు ఉండటం వలన వాళ్లందరికీ పరీక్శలు జరపటానికి వీలవుతుంది. చికిత్సతోబాటు ఎప్పటికప్పుడు పరిస్థితి అంచనా వేస్తారు. ఇప్పటిదాకా బీపీకి 10.98 కోట్ల వైద్య పరీక్షలు, మధుమేహానికి 9.01 కోట్లు, నోటి కాన్సర్ కు 5.73 కోట్లు, ఆడవాళ్లలో రొమ్ము కాన్సర్ కు 2.94 కోట్లు, సర్వైకల్ కాన్సర్ కు 2 కోట్ల పరీక్షలు జరిగాయి.
· టెలీ సంప్రదింపులు ఈ కేంద్రాల మరో ముఖ్యమైన ఉపయోగం. ఈ-సంజీవని వేదిక ద్వారా 60 లక్షలకు పైగా సంప్రదింపులు జరిగాయి. ఇందులో 26.42 లక్షలు హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలవద్దనే జరిగాయి.
· కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఒకవైపు కోవిడ్ బాధితుల రక్షణతోబాటు కోవిడేతర వ్యాధులతోబాధపడేవారి విషయంలోనూ ఆరోగ్య సేవలందించగలిగాయి. కోవిడ్ మహమ్మారి కాలంలో 2020 ఫిబ్రవరి మొదలుకొని ఇప్పటిదాకా నాన్-కోవిడ్ వ్యాధులలో 75% మేరకు ఇక్కడే పరీక్షలు జరిపారు. దీంతో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అంద్ వెల్ నెస్ కేంద్రాలమీద ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్టయింది.
2021 జూన్ 11 నాటికి హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రా పనితీరుపై విహంగ వీక్షణం
సంఖ్య
|
అంశం
|
మొత్తం పురోగతి (లక్షల్లో)
|
పురోగతి కాలం
|
(11.6.2021నాటికి )
|
1.2.2020 నుంచి 11.6.2021 దాకా (లక్షల్లో)
|
2
|
కేంద్రాలను సందర్శించినవారు
|
5028.89
|
4123.81
|
|
పురుషులు
|
2325.67
|
1911.05
|
|
స్త్రీలు
|
2691.31
|
2200.86
|
3
|
మొత్తం బీపీ పరీక్షలు
|
1098.23
|
788.58
|
4
|
మొత్తం మధుమేహం పరీక్షలు
|
900.89
|
636.85
|
5
|
మొత్తం నోటి కాన్సర్ పరీక్షలు
|
573.15
|
414.46
|
6
|
మొత్తం రొమ్ము కాన్సర్ పరీక్షలు
|
293.96
|
198.48
|
7
|
మొత్తం సర్వైకల్ కాన్సర్ పరీక్షలు
|
200.08
|
135.71
|
8
|
మొత్తం 3 రకాల కాన్సర్ల పరీక్షలు
|
1067.19
|
748.65
|
9
|
అంటువ్యాధులు కాని జబ్బుల పరీక్షలు
|
3066.31
|
2174.08
|
10
|
యోగా సహా చేపట్టిన వెల్ నెస్ సెషన్ల సంఖ్య
|
70.51
|
63.7
|
అంతే కాకుండా, అనేక జిల్లాల్లో పట్టణ శివార్లకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరిస్తూ ఉండటంతో 2021 మే 16న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆ ప్రాంతాల్లో కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన ప్రామాణిక ఆచరణా విధానాలను రూపొందించి పంపిణీ చేసింది. ఆ సమాచారాన్ని ఈ క్రింది లింక్ లో చూడవచ్చు:
https://www.mohfw.gov.in/pdf/SOPonCOVID19Containment&ManagementinPeriurbanRural&tribalareas.pdf)
ఉప ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంత, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు సహా అన్ని ప్రజారోగ్య కేంద్రాలలో రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ల అందుబాటులో ఉందాలని అందులో నిర్దేశించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఎ ఎన్ ఎం లు ఈ పరీక్షలు జరపటంలో శిక్షణ పొందాలని కూడా చెప్పారు.
కోవిడ్ టీకాలకు సంబంధించి భారతదేశం జనవరి 16 నుంచి అతిపెద్ద టీకాల కార్యక్రమం చేపట్టింది. ఇప్పటివరకు దేసవ్యాప్తంగా 24 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో టీకాలకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.
భారత దేశం కోవిన్ డిజిటల్ వేదికను వాడుకుంటూ టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది. లబ్ధిదారులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈ వేదిక ఉపయోగపడుతోంది. లబ్ధిదారులు నేరుగా దగ్గర్లోని టీకా కేంద్రానికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. వృద్ధులకు, దివ్యాంగులకు కూడా వీలుండేలా పంచాయితీ కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, పాఠశాల భవనాల వంటి చోట్ల కూడా టీకాలు వేస్తున్నారు.
***
(Release ID: 1726677)
Visitor Counter : 237