మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
బాలకార్మికత ఘటనలను పెన్సిల్ పోర్టల్ లేదా చైల్డ్ లైన్ 1098 పై ఫిర్యాదు చేయవలసిందిగా పౌరులకు విజ్ఞప్తి చేసిన శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ
Posted On:
12 JUN 2021 2:45PM by PIB Hyderabad
బాలకార్మికులకు సంబంధించిన దృష్టాంతాలను పెన్సిల్ (PENCIL) పోర్టల్ లో లేదా చైల్డ్ లైన్ 1098 నెంబరుకు ఫోన్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవలసిందిగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి, జౌళి పరిశ్రమల మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. శనివారం అంతర్జాతీయ బాలకార్మికత వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో, ప్రతి బాలుడు/ బాలికకు చదువుకునే, సంతోషకరమైన బాల్యాన్ని అనుభవించే హక్కు ఉంది. బాల కార్మికత వ్యతిరేక దినోత్సవ సందర్భంగా బాల కార్మికతపై పోరాటానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. ప్రజల భాగస్వామ్యంతోనే బాల, బాలికలు తమకు అర్హమైన బాల్యాన్ని అనుభవించేలా చూద్దాం, అని పేర్కొన్నారు.
మరొక ట్వీట్లో. బాలకార్మికతకు సంబంధించిన దృష్టాంతాలను పెన్సిల్ పోర్టల్ https://pencil.gov.in/ లేదా చైల్డ్ లైన్ 1098 అన్న నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవలసిందిగా ప్రతి పౌరుడికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే, మన దేశ భవిష్యత్తు అయిన మన పిల్లలకు మనం రుణపడి ఉన్నాం, అని అన్నారు.
అంతర్జాతీయ బాలకార్మికత వ్యతిరేక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 12న జరుపుకుంటారు. ప్రపంచ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) ప్రపంచ స్థాయిలో బాలకార్మికతపై దృష్టి పెట్టి దానిని నిర్మూలించడానికి, చర్య తీసుకోవడం ద్వారా కృషి చేయడం కోసంబాలకార్మికతకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని 2002లో ప్రారంభించింది.
***
(Release ID: 1726654)
Visitor Counter : 207