శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొల్చిసిన్ ఉన్న కొవిడ్ -19 రోగులపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి లక్సాయ్ లైఫ్ సైన్సెస్ భాగస్వామ్యంతో సిఎస్ఐఆర్ రెగ్యులేటరీ అనుమతి పొందింది.
Posted On:
12 JUN 2021 9:02AM by PIB Hyderabad
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్), మరియు లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్ హైదరాబాద్, కొవిడ్-19 రోగుల చికిత్స సమయంలో క్లినికల్ ఫలితాల మెరుగుదలలో కొల్చిసిన్ అనే ఔషధం యొక్క భద్రత మరియు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రెండోదశ -2 క్లినికల్ ట్రయల్ చేపట్టడానికి డిసిజిఐ రెగ్యులేటరీ అనుమతి ఇచ్చింది. ఈ ముఖ్యమైన క్లినికల్ ట్రయల్‌లో భాగస్వామి సిఎస్‌ఐఆర్ ఇనిస్టిట్యూట్‌లు హైదరాబాద్‌లోని సిఎస్‌ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి) మరియు జమ్మూలోని సిఎస్‌ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (ఐఐఐఎం).
గౌట్ మరియు సంబంధిత పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఈ ఆమోదించిన ఔషధంపై క్లినికల్ ట్రయల్ నిర్వహించడానికి మంజూరు చేసిన అనుమతిపై సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే సంతోషం వ్యక్తం చేశారు. డిజి-సిఎస్ఐఆర్ సలహాదారు డాక్టర్ రామ్ విశ్వకర్మ, కొల్చిసిన్ ప్రామాణిక సంరక్షణతో కలిపి కోవిడ్ రోగులకు కార్డియాక్ కో-మోర్బిడిటీస్ మరియు ప్రోఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ తగ్గించడం కోసం ఒక ముఖ్యమైన చికిత్స అవుతుందని, ఇది వేగంగా కోలుకోవడానికి దారితీస్తుందని తెలిపారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు మరియు కొవిడ్ అనంతరం సమయంలో గుండె సమస్యలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అనేక ప్రపంచ అధ్యయనాలు ధృవీకరించాయి. అందువల్ల కొత్త లేదా పునర్నిర్మించిన ఔషధాల కోసం అన్వేషణ చాలా అవసరం.
డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ (డైరెక్టర్ సిఎస్ఐఆర్-ఐఐసిటి, హైదరాబాద్) మరియు డాక్టర్ డిఎస్ రెడ్డి (డైరెక్టర్, సిఎస్ఐఆర్- ఐఐఐఎం, జమ్మూ), సిఎస్ఐఆర్‌కు చెందిన ఈ రెండు భాగస్వామ్య సంస్థలు రెండో దశ క్లినికల్ ఎఫిషియసీ ట్రయల్ ఫలితం కోసం ఎదురు చూస్తున్నాయని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సతో పాటు వారి ప్రాణాలను రక్షించడంలో కొల్చిసిన్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కీలక ఔషధం యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో భారతదేశం ఒకటి. ఇది ఔషధం విజయవంతమైతే ఇది సరసమైన ఖర్చుతో రోగులకు అందుబాటులో ఉంటుంది.
భారతదేశం అంతటా పలు సైట్లలో రోగుల నమోదు ఇప్పటికే ప్రారంభమైందని, రాబోయే 8-10 వారాల్లో ట్రయల్స్ పూర్తయ్యే అవకాశం ఉందని లక్సాయ్ సీఈఓ డాక్టర్ రామ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఈ ట్రయల్ మరియు రెగ్యులేటరీ ఆమోదం ఫలితాల ఆధారంగా ఈ ఔషధాన్ని భారతదేశంలో ఎక్కువమందికి అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
హృదయ శస్త్రచికిత్స మరియు కర్ణిక ఫైబ్రిలేషన్ అబ్లేషన్ తరువాత పునరావృత పెరికార్డిటిస్, పోస్ట్-పెరికార్డియోటోమీ సిండ్రోమ్ మరియు పెరి-ప్రొసీజరల్ అట్రియల్ ఫైబ్రిలేషన్ రేట్లలో గణనీయమైన తగ్గింపుతో కొల్చిసిన్ సంబంధం ఉన్నట్లు ప్రముఖ వైద్య పత్రికలలో ఇటీవలి క్లినికల్ అధ్యయనాలు నివేదించాయి.
****
(Release ID: 1726652)
Visitor Counter : 244