ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఆరోగ్యం, ఇంధన రంగ కార్యాచరణ వేదిక నుద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్షవర్ధన్
సమగ్ర అభివృద్ధి, తక్కువ కార్బన్ ఉద్గారాలతో కూడిన నూతన ఆర్ధిక నమూనాను ముందుకు తీసుకువెళ్లేందుకు ఇండియా ప్రత్యేక స్థానంలో ఉందన్న డాక్టర్ హర్షవర్ధన్
మానవీయ కేంద్రిత భారత విధానం అంతర్జాతీయంగా ప్రపంచ ప్రజల మంచి కోసం కీలకం కానున్నదన్న మంత్రి.
Posted On:
10 JUN 2021 11:41AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ , ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఆరోగ్య, ఇంధన కార్యాచరణ ప్లాట్‌ఫాం తొలి ఉన్నతస్థాయి కూటమి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సమావేశౄనికి పలువురు ప్రముఖుల, దేశాధినేతలు, ప్రపంచ బ్యాంకుకు చెందిన వివిధ స్టేక్‌హొల్డర్లు, అంటే ప్రపంచబ్యాంకు, యుఎన్‌డిపి, యుఎన్‌హెచ్ార్‌సి, ఇంటర్నేషనల్ రెన్యువబుల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఆర్ ఇ ఎన్ ఎ) తదితరాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
వారి ప్రసంగంలోని అంశాలు:
ప్రపంచం ఇప్పుడు మున్నెన్నడూ లేనంతటి ముప్పును కోవిడ్ -19 నుంచి ఎదుర్కొంటున్నది. ఇది ప్రభుత్వాలు, పౌరులు ప్రజల ప్రాణాలను కాపాడడానికి, ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యను తగ్గించడానికి అసాధారణ చర్యలు తీసుకోవలసి వస్తున్నది.కోవిడ్ మహమ్మారి, అలాగే దీనిని నియంత్రించడానికి జరుగుతున్న అసాధరణ కృషిగమనించినపుడు వివిధ రంగాలు ఎంతగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయో పునరుద్ఘాటిస్తొంది. అలాగే మన విధానాలు పటిష్టమైనచ నిరంతర సేవలను అందించాలంటే వివిధ రంగాల మధ్య అనుసంధానత ఉండేలా చూడాల్సిన అవసరాన్నీ ఇది నొక్కి చెబుతోంది.
మానవ ఆరోగ్యంపై వాతావరణ మార్పు ప్రభావంపై సాధారణ ప్రజలు, ఆరోగ్య సంరక్షకులు,విధాన నిర్ణేతలకు అవగాహన కల్పించేందుకు వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యంపై జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళిక పేరుతో ఒక నిపుణుల సంఘాన్ని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ జాతీయ నిపుణుల గ్రూపు 2021 ఏప్రిల్ లో తన నివేదికను సమర్పించింది. ఒకే ఆరోగ్యం, వాతావరణమార్పులో ముడిపడిన వ్యాధులకు సంబంధించి ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికను కూడా ఇందులో చేర్చింది.
హరిత, వాతావరణ మార్పులకు తట్టుకునే ఆరోగ్య సంరక్షణ సదుపాయాలకు సంబంధించి, ఇండియా 2017 నాటి మాలే డిక్లరేషన్ పై సంతకం దారు.ఇది ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకనే విధింగా వాతావరణ మార్పుల అనుకూల సదుపాయాలను ప్రోత్సహించేందుకు అంగీకరించింది.
ఇండియా ప్రస్తుతం తక్కువ కార్బన్ ఉద్గారాలకు సంబంధించి సరికొత్త ఆర్ధికాభివృద్ధి ని ముందుకు తీసుకుపోవడంలో ఇండియా ప్రత్యేక స్థాయిలో ఉంది. ఇందులో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్‌కూడా ఒక ప్రధాన నిర్ణయాత్మక అంశంగా ఉంది.
ఆరోగ్యం, ఇంధన రంగానికి సంబంధించిన సామర్ధ్యాలను, వనరులను పెద్ద ఎత్తున సమీకరించడానికి స్థిరమైన, రాజకీయ, ఆర్థిక సంకల్పం ప్రస్తుత అవసరమని మేం విశ్వసిస్తున్నాం. కోవిడ్ -19 అనంతర పరిస్థితులకు వివిధ దేశాలు సన్నద్ధమౌతున్న దశలో , గ్లోబల్ రీసెట్‌కు అద్భుత అవకాశాలు ఉన్నాయి.
పెద్ద ఎత్తున హ రిత చోదక ప్రణాళికలు వాటి ఆర్థిక వ్యవస్థలను పునరుద్ధరించడానికి, వాటి ఇంధన పరివర్తనకు ఆయా దేశాలకు ఉపయోగపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ సమష్టి, ఉమ్మడి కార్యాచరణ హరిత, ఆరోగ్యకరమైన భూగోళాన్ని సాధించడానికి ఇది ఎంతగానో దోహదపడగలదు.
***
(Release ID: 1726037)
Visitor Counter : 217