ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈశాన్య ప్రాంతంలో ప్రోజెక్టుల అభివృద్ధికి ఇస్రో సహకరిస్తుందని వెల్లడించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఇస్రో ఇప్పటికే పర్యవేక్షణ చేయడం ప్రారంభించింది, అలాగే డోనర్ / ఎన్ఇసి నిధులతో ఈశాన్య ప్రాంతంలోని 221 సైట్లలో 67 ప్రాజెక్టులను జియో-ట్యాగ్ చేసింది

Posted On: 09 JUN 2021 4:47PM by PIB Hyderabad

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులకు సహాయం చేస్తుందని, ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాలలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మెరుగుగా ముందుకు తీసుకెళ్లడానికి శాటిలైట్ ఇమేజింగ్ మరియు ఇతర స్పేస్ టెక్నాలజీ అనువర్తనాలను వాంఛనీయ వినియోగం అందించడం ద్వారా సహకరిస్తామని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి (డోనర్), పీఎంఓ, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణు శక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చెప్పారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఇస్రో శాస్త్రవేత్తలు పాల్గొన్న ఉన్నతస్థాయి సమావేశానికి కేంద్ర మంత్రి అధ్యక్షత వహించారు. ఇస్రో అమలు చేయడానికి ఇప్పటికే ఆరు ఈశాన్య రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు పంపాయని, మరో రెండు రాష్ట్రాలు సిక్కిం, అసోం త్వరలోనే తమ ప్రతిపాదనలు పంపనున్నాయని మంత్రి చెప్పారు. 

కేంద్ర మంత్రిత్వ శాఖ నిధులతో మొత్తం 8 రాష్ట్రాల్లోని 221 సైట్లలో ఇస్రో ఇప్పటికే 67 ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోందని, జియో-ట్యాగింగ్ కూడా చేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం డేటాను మ్యాపింగ్ చేయడంలో, పంచుకోవడంలో ఇస్రో సంస్థాగత ప్రమేయం ఉందని, ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఒక నమూనాగా మారగలదని, మొత్తం దేశంలో ఇదే మొదటిదని ఆయన అన్నారు. డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు మోడీ పాలనలో ఎన్నో కీలక అంశాలు అమలులోకి వచ్చాయని, గత ఏడు సంవత్సరాలలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రధానంగా ఉపగ్రహాల ప్రయోగానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ అభివృద్ధి కార్యకలాపాల్లో ఇది తన పాత్రను నిరంతరం విస్తరిస్తోంది అని ఆయన అన్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్రకు దార్శనికత అయినా "ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా" సాకారం అయ్యేలా ఇవి సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (నేసాక్) కు ఈశాన్య రాష్ట్రాల నుండి అనేక ప్రతిపాదనలు వచ్చాయి. రాబోయే పక్షం రోజుల్లో ప్రతి రాష్ట్రాలతో ఒక్కొక్కటిగా ఇటువంటి ప్రాజెక్టుల సాధ్యత, వినతుల గురించి చర్చిస్తారు. గుర్తించిన తర్వాత, అటువంటి ప్రాజెక్టులన్నింటికీ ఆయా రాష్ట్రాలు మరియు నేసాక్ సంయుక్తంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంది.

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఈ ఏడాది జనవరిలో షిల్లాంగ్‌ను సందర్శించి నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (నేసాక్) సొసైటీతో సమావేశం నిర్వహించినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అటవీ అంతరాల ప్రాంతాల మ్యాపింగ్, ఉద్యానవన అభివృద్ధికి భూభాగం విస్తరించడం, చిత్తడి నేలలను గుర్తించడం మరియు పునరుజ్జీవనం చేయడం మరియు వరదనీటిని మళ్లించడం, జీవనోపాధి అవసరాలకు వెదురు వనరులను అంచనా వేయడం వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడానికి హోంమంత్రి జూలైలో మళ్లీ కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టుల అమలులో చాలా ప్రగతి ఉందని ఆయన అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో, వ్యవసాయం, రైల్వేలు, రోడ్లు మరియు వంతెనలు, వైద్య నిర్వహణ / టెలిమెడిసిన్, సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్ల సేకరణ, విపత్తు సూచన మరియు నిర్వహణ, వాతావరణం / వర్షం / వరద సూచనలతో సహా వివిధ రంగాలలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆనకట్ట నిర్మాణం, వరద తగ్గించడం, మూడు మోడల్ గ్రామాలు, ఉద్యానవనం, సున్నా స్థాయిలో సరిహద్దు ఫెన్సింగ్ వంటి ప్రాంతాలలో అరుణాచల్ ప్రదేశ్ నుండి ఏడు ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నాయని ఇస్రోకు చెందిన సీనియర్ అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఇలాంటి ప్రాజెక్టులు కూడా లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఉన్నాయి.
నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అనేది షిల్లాంగ్ వద్ద అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారతదేశంలోని ఈశాన్య ప్రాంతానికి ప్రత్యేక సేవలను అందిస్తుంది. అంటే. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, మరియు త్రిపుర. సహజ వనరుల నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక, ఆరోగ్య సంరక్షణ, విద్య, అత్యవసర కమ్యూనికేషన్, విపత్తు నిర్వహణ మద్దతు, మరియు అంతరిక్షంపై అంతరిక్ష శాస్త్ర మరియు సాంకేతిక సహకారాన్ని అందించడం ద్వారా భారతదేశ ఈశాన్య ప్రాంతం సమగ్ర అభివృద్ధిలో ఉత్ప్రేరక పాత్ర పోషించే దృష్టితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


<><><><><>


(Release ID: 1725858) Visitor Counter : 191