రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

సవరణ సహా కొత్త పెట్టుబడి విధానం (ఎన్ఐపి)-2012 ని రామగుండం ఫర్టిలైజర్స్ ఎండ్ కెమికల్స్ లిమిటెడ్ కు కూడా వర్తించేటట్లుగా ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 09 JUN 2021 3:50PM by PIB Hyderabad

ఎరువుల విభాగం తీసుకువచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది.  ఈ ఆమోదం ప్రకారం, 2014 అక్టోబరు 7వ తేదీ నాటి  సవరణ సహితం గా కొత్త పెట్టుబడి విధానం (ఎన్ఐపి)-2012 ఇకపై రామగుండం ఫర్టిలైజర్స్ ఎండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ సిఎల్) విషయం లో కూడా వర్తింపు లోకి రానుంది.

ఆర్ఎఫ్ సిఎల్ అనేది ఒక జాయింట్ వెంచర్ కంపెనీ.  దీని ని నేశనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీయర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్), ఫర్టిలైజర్స్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్ సిఐఎల్) లు కలసి ఏర్పాటు చేశాయి.  దీనిని 2015 ఫిబ్రవరి 17న స్థాపించడమైంది.  ఎఫ్ సిఐఎల్ కు చెందిన ఇదివరకటి రామగుండం యూనిటు ను ఆర్ఎఫ్ సిఎల్ పునరుద్ధరిస్తోంది.  ఇందుకోసం గ్యాస్ పై ఆధారపడి పనిచేసేటటువంటి, వేప పూత సదుపాయం తో కూడిన యూరియా ను ఒక్కో సంవత్సరానికి 12.7 లక్షల మెట్రిక్ టన్ను ల మేర కు ఉత్పత్తి చేసే స్థాపిత సామర్థ్యం (ఎల్ఎమ్ టిపిఎ) కలిగిన ఒక గ్రీన్ ఫీల్డ్ (కొత్తది అయినటువంటి) ప్లాంటు ను ఏర్పాటు చేయడం జరుగుతోంది.  ఆర్ఎఫ్ సిఎల్ యూరియా ప్రాజెక్టు వ్యయం 6165.06 కోట్ల రూపాయలు గా ఉంది.  ఈ ప్లాంటు కు గ్యాసు ను జిఎస్ పిఎల్ ఇండియా ట్రాన్స్ కో లిమిటెడ్ (జిఐటిఎల్) తాలూకు ఎమ్ బిబివిపిఎల్ (మల్లావరం-భోపాల్- భీల్ వాడా- విజయ్ పుర్ గ్యాస్ పైప్ లైన్) ద్వారా ‘గేల్’ (జిఎఐఎల్) సరఫరా చేస్తుంది.  

యూరియా రంగం లో స్వయంసమృద్ధి ని సాధించడానికి గాను ఎఫ్ సిఐఎల్/ హెచ్ఎఫ్ సిఎల్ తాలూకు మూతపడ్డ యూరియా యూనిట్ లను పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం లో, గ్యాస్ పై ఆధారపడి పనిచేసేటటువంటి అత్యంత అధునాతనమైన ఆర్ఎఫ్ సిఎల్ ప్లాంటు ఒక భాగం గా ఉంది.  రామగుండం ప్లాంటు ను ఆరంభం అయ్యిందంటే గనక, దేశం లో తయారు అవుతున్నటువంటి యూరియా కు 12.7 ఎల్ఎమ్ టిపిఎ సామర్థ్యం కలిగివుండే ఉత్పాదన ను జతపరచగలుగుతుంది. అంతేకాదు, యూరియా ఉత్పత్తి లో భారతదేశాన్ని  ‘ఆత్మనిర్భర్’ (స్వయంసమృద్ధియుతమైంది)గా మలచాలి అన్న గౌరవనీయ ప్రధాన మంత్రి దార్శనికత ను నెరవేర్చడ లో సాయపడుతుంది కూడాను.  ఆ ప్లాంటు దక్షిణ భారతదేశం లో అతి పెద్ద ఎరువుల తయారీ విభాగాలలోకెల్లా ఒక ప్లాంటు కాగలుగుతుంది. ఈ ప్రాజెక్టు రైతులకు ఎరువు అందుబాటు ను మెరుగుపరచడం ఒక్కటే కాకుండా దేశ ఆహార భద్రత కు పూచీ పడడం తో పాటు ఆ ప్లాంటు ఉన్నటువంటి ప్రాంతం లో రహదారులు, రైలు మార్గాలు, అనుబంధ పరిశ్రమల వంటి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం సహా ఆ ప్రాంతం లో ఆర్థిక వ్యవస్థ కు ప్రోత్సాహాన్ని సైతం ఇస్తుంది.

ఆర్ఎఫ్ సిఎల్ లో వివిధ అద్వితీయమైన అంశాలు ఉన్నాయి.  వాటి లో యూరియా ఉత్పత్తి లో శక్తి ని ఆదా చేయడానికి గాను సింగిల్ ట్రేన్ లార్జెస్ట్ కెపాసిటీ యూరియా ప్లాంటు లలో కెల్లా అత్యధునాతనమైనటువంటి హెచ్ టిఇఆర్ (హాల్ దర్ టాప్ సే ఎక్స్ చేంజ్ రిఫార్మర్) సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమమైన యూరియా ప్రిల్స్ కు పూచీ పడేటటువంటి 140 మీటర్ల ఎత్తయిన ప్రిలింగ్ టావర్, ఒక్కో రోజు కు 4000 ఎమ్ టి యూరియా ను పంపగల సామర్థ్యం కలిగిన పూర్తి ఆటోమేటిక్ విధానం లో పనిచేసే బాగింగ్ ఎండ్ రైల్ / ట్రక్ లోడింగ్ ఫెసిలిటీ, ఎమ్ సిఆర్ (మెయిన్ కంట్రోల్ రూమ్) అమర్చిన డిసిఎస్ (డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్), ఇఎస్ డి (ఇమర్ జన్సి శట్- డౌన్ సిస్టమ్ ఫార్ ఇంప్రూవ్డ్ సేఫ్టీ ఎండ్ అవైలబలిటి), ఆన్ లైన్ ఎమ్ఎమ్ఎస్ (మశీన్ మానిటరింగ్ సిస్టమ్స్), ఒటిఎస్ (ఆపరేటర్ ట్రేనింగ్ సైమ్యులేటర్), పర్యావరణ నిఘా వ్యవస్థ లు కొన్ని.  ఈ వ్యవస్థల ను అత్యంత నిష్ఠ తో, సమర్పణ భావం కలిగివుండి, సుశిక్షితులైన ఆపరేటర్ ల ద్వారా నడిపించడం జరుగుతుంది.  

తెలంగాణ తో పాటు భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర తదితర దక్షిణ ప్రాంత రాష్ట్రాల, మధ్య ప్రాంత రాష్ట్రాల యూరియా అవసరాల ను తీర్చాలి అనేది  ప్రపంచంలోకెల్లా అతి ఉత్తమమైన సాంకేతికతల ను మేళవించుకొంటున్న ఈ సదుపాయం   లక్ష్యం గా ఉంది.  ఆర్ఎఫ్ సిఎల్ ద్వారా ఉత్పత్తి అయిన యూరియా విక్రయ బాధ్యత ను నేశనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ తీసుకొంటుంది.

భారత ప్రభుత్వం ఎఫ్ సిఐఎల్ / హెచ్ఎఫ్ సిఎల్ లకు చెందిన మూతపడ్డ అయిదు యూనిట్ లను తిరిగి నడిపేందుకు తగినవి గా మార్చుతున్నది.  ఈ పని ని రామగుండం (తెలంగాణ), తల్ చర్ (ఒడిశా), గోరఖ్ పుర్ (ఉత్తర్ ప్రదేశ్), సింద్రీ (ఝార్ ఖండ్), బరౌనీ (బిహార్) లలో ఒక్కొక్కటీ 12.7 ఎల్ఎమ్ టిపిఎ సామర్థ్యం కలిగివుండే కొత్త అమోనియా యూరియా ప్లాంటు ల ను ఏర్పాటు చేసి పూర్తి చేయడం జరుగుతుంది.  దీనికై సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తో అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థల కు చెందిన జాయింట్ వెంచర్ ల ను సిద్ధం చేయడం జరుగుతుంది.  ఈ ప్లాంటు లు నిర్వహణ దశ కు చేరుకొంటే దేశీయ యూరియా ఉత్పత్తి 63.5 ఎల్ఎమ్ టిపిఎ మేరకు వృద్ధి చెందుతుంది.  దీనితో యూరియా దిగుమతుల లో కోత సాధ్యపడి, విదేశీ మారక ద్రవ్యం భారీ మొత్తం లో ఆదా అవుతుంది; వీటి ద్వారా దేశం యూరియా రంగం లో స్వయంసమృద్ధి ని సాధించే దిశ లో ముందంజ వేయడానికి వీలవుతుంది, అది గౌరవనీయ ప్రధాన మంత్రి కన్న ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ ఆవిష్కారానికి అనుగుణం గా కూడా ఉంటుంది.    




 

***



(Release ID: 1725734) Visitor Counter : 156