రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఉత్తర ప్రదేశ్ & తమిళనాడులోని రక్షణ కారిడార్లలో పెట్టుబడులు పెట్టాలని స్వీడిష్ సంస్థలను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆహ్వానించారు;


భారతదేశం–-స్వీడన్ రక్షణ పరిశ్రమ సహకారంపై ఏర్పాటు చేసిన వెబ్‌నార్ లో ఆయన ప్రసంగించారు

మనదేశంతోపాటు ప్రపంచానికి చవక ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై ‘ఆత్మనిర్భర్ భారత్’ దృష్టి సారించిందని రాజనాథ్ సింగ్ ప్రకటించారు.

Posted On: 08 JUN 2021 4:08PM by PIB Hyderabad

‘వృద్ధి,  భద్రత కోసం అవకాశాలను అందుకోవడం’ పేరు భారత్–-స్వీడన్ రక్షణ పరిశ్రమ సహకారంపై 2021 జూన్ 08 న వెబ్నార్ను  సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ ఉత్పత్తి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందుకు సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐడీఎం)  స్వీడిష్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ (ఎస్ఓఎఫ్ఎఫ్) సహకారం అందించాయి. రక్షణ మంత్రి  రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా, స్వీడన్ రక్షణ మంత్రి పీటర్ హల్ట్క్విస్ట్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. స్వీడన్ లో భారత రాయబారి  తన్మయ లాల్; భారతదేశానికి స్వీడన్ రాయబారి మిస్టర్ క్లాస్ మోలిన్; రక్షణశాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, కార్యదర్శి (రక్షణ ఉత్పత్తి)  రాజ్ కుమార్; రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల ఇతర సీనియర్ అధికారులు; ఇండియన్ & స్వీడిష్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు  ఎస్ఐడీఎం & ఎస్ఓఎఫ్ఎఫ్ అధికారులు కూడా వెబ్‌నార్‌కు హాజరయ్యారు.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/PIC46DZF.JPG

 

  రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని  నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రగతిశీల విధానాలు,  విధానపరమైన సంస్కరణల గురించి వివరించారు. ఇవి రక్షణ పరిశ్రమను దేశీయ, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా మార్చాయని చెప్పారు. 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'  నినాదం 'మేక్ ఇన్ ఇండియా'  'మేక్ ఫర్ ది వరల్డ్' కోసమని ఆయన అన్నారు. రక్షణ రంగం భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. తక్కువ వ్యయంతో కూడిన నాణ్యత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిస్తామని అన్నారు. భారతదేశంతోపాటు  ప్రపంచం కోసం ఉత్పత్తులను రూపొందిస్తామని చెప్పారు.  

డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డీఏపీ) 2020 గురించి ప్రస్తావిస్తూ ఇది దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తుందని, రక్షణ ఉత్పాదక కేంద్రంగా భారతదేశం ఎదగడానికి బలమైన పునాదిని ఇచ్చిందని చెప్పారు. ఎఫ్‌డిఐ నియమాల సరళీకరణ కోసం, సులభతర  వ్యాపార నిర్వహణ కోసం తీసుకున్న విధాన నిర్ణయాలు ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ సంస్థలను ఆకర్షిస్తున్నాయని చెప్పారు.  భారతదేశంలో జాయింట్ వెంచర్లను విదేశీ కంపెనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎఫ్‌డిఐ నిబంధనల సరళీకరణ,  డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డిఎపి) 2020 లో బయ్ను (గ్లోబల్ - మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా) పరిచయం చేయడం వల్ల భారత రక్షణ పరిశ్రమలు విదేశీ కంపెనీలను ( ఓఈఎం) ఆహ్వానించవచ్చు. "విదేశీ ఓఈఎంలు సొంతంగా ఉత్పాదక సదుపాయాలను ఏర్పాటు చేయవచ్చు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్ స్థాపించవచ్చు. టెక్నాలజీ ఒప్పందం ద్వారా" మేక్ ఇన్ ఇండియా "అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు" అని ఆయన చెప్పారు.

  ఉత్తర ప్రదేశ్,  తమిళనాడులోని డిఫెన్స్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టాలని స్వీడన్ సంస్థలను మంత్రి సింగ్ ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రత్యేకమైన ప్రోత్సాహకాలతోపాటు భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి లభ్యత వల్ల ఎంతో ప్రయోజనం పొందవచ్చని అన్నారు. భారతదేశం–-స్వీడన్ భాగస్వామ్యం వల్ల అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. వివిధ రంగాలలో భారత రక్షణ పరిశ్రమకు  బలమైన సామర్థ్యాలు ఉన్నాయన్నారు.  పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహ–-అభివృద్ధికి,  సహ-–ఉత్పత్తి కోసం స్వీడిష్ కంపెనీలతో సహకరించడానికి తమ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

"స్వీడన్ సంస్థలు ఇప్పటికే భారతదేశంలో చాలా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. సహ ఉత్పత్తి,  సహ అభివృద్ధికి స్వీడిష్ , భారతీయ రక్షణ పరిశ్రమలకు చాలా అవకాశాలు ఉన్నాయి. భారతీయ పరిశ్రమలు స్వీడిష్ పరిశ్రమలకు భాగాలను సరఫరా చేయగలవు. టెక్నాలజీ -ఆధారిత ఎఫ్డీఐ విధానం భారతీయ పరిశ్రమలకు కీలకమైన, సైనిక సాంకేతిక రంగాలలో స్వీడిష్ కంపెనీలతో కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది” అని  రాజనాథ్ సింగ్ అన్నారు. భారతదేశంలో 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, తొమ్మిది డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఉన్నాయని సింగ్ అన్నారు. అంతేగాక  ప్రైవేటు రంగ పరిశ్రమలను విస్తరించడానికి 12,000 మైక్రో, స్మాల్  మీడియం ఎంటర్ ప్రైజెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. భారత రక్షణ పరిశ్రమలు విస్తృత నైపుణ్యం కలిగి ఉన్నాయని అన్నారు. ఆకాశం, భూమి, సముద్రం, అంతరిక్ష అవసరాల కోసం హైటెక్ రక్షణ వ్యవస్థల శ్రేణి ఉందని వివరించారు. "భారతదేశానికి బలమైన నౌకానిర్మాణ పరిశ్రమ ఉంది. భారతీయ షిప్‌యార్డులు నిర్మించిన నౌకలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తయారు చేశారు. ఇవి  చాలా తక్కువ ఖర్చుతో తయారైనవి. పరస్పర ప్రయోజనం కోసం భారతదేశం,  స్వీడన్ లు ఓడల నిర్మాణ పరిశ్రమలో సహకరించుకోవచ్చు”అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎస్ఐడీఎం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ),  ఎస్ఓఎఫ్ఎఫ్ లు  నిరంతర కృషి చేస్తున్నాయని  రాజనాథ్ సింగ్ ప్రశంసించారు.

 

ఈ సందర్భంగా, ద్వైపాక్షిక రక్షణ పారిశ్రామిక సంబంధాలను ప్రోత్సహించడానికి ఎస్ఐడీఎం,  ఎస్ఓఎఫ్ఎఫ్ ల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. పరస్పర లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రత్యేక జాయింట్ వర్కింగ్ గ్రూప్  ఏర్పడుతుంది. ఈ సందర్భంగా  రాజ్‌నాథ్ సింగ్ 'ఎస్ఐడీఎం సభ్యుల డైరెక్టరీ 2020–-21– ఇండియన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టార్ 360 డిగ్రీస్ ఓవర్ వ్యూ  మొదటి ఎడిషన్‌ను విడుదల చేశారు. ఈ  డైరెక్టరీ.. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలోని 437 కంపెనీల సామర్థ్యాలను వివరిస్తుంది. భారతీయ పరిశ్రమల సమాచారాన్ని సులభంగా పొందటానికి వీలు కల్పిస్తుంది.  ప్రపంచ రక్షణ సమాజానికి వన్-స్టాప్ రిఫరెన్స్‌గా పనిచేస్తుంది. డైరెక్టరీలో సరికొత్త 108 ఐటెమ్ లో రెండో  స్వదేశీకరణ జాబితా కూడా ఉంది.

 

***


(Release ID: 1725469) Visitor Counter : 252