వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పి.ఎం. గరీబ్ కల్యాణ్ అన్నయోజన దీపావళి వరకూ పొడిగింపు!


నవంబరు వరకూ 80కోట్లమందికి ప్రతినెలా
ఉచిత ఆహార ధాన్యాల సరఫరా..
ఎఫ్.సి.ఐ. ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు
69లక్షల టన్నుల ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా..

మే నెల ఆహార ధాన్యాల కేటాయింపును అందుకున్న
36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
మే, జూన్ నెలల కేటాయింపును అందుకున్న అరుణాచల్,
మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర
ఆహార ధాన్యాల పంపిణీ భారం పూర్తిగా కేంద్రానిదే!

Posted On: 08 JUN 2021 5:23PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఎ.వై- III) పథకం అమలును దీపావళి వరకూ పొడిగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిన్న జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రకటించారు.  అంటే ఈ ఏడాది నవంబరు వరకూ దేశంలోని 80కోట్ల మందికిపైగా ప్రజలు ఈ పథకం కింద ప్రతి నెలా నిర్ణీత పరిమాణంలో ఆహార ధాన్యాలను ఉచితంగా అందుకుంటారన్నమాట.

ఈ ఏడాది జూన్ 7వ తేదీవరకూ, 69లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఆహార ధాన్యాలను 36రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) సరఫరా చేసింది. ఇలా ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలను అందుకున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో,.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, కేరళ, లక్షద్వీప్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, తెలంగాణ, త్రిపుర ఇప్పటికే,. ఈ ఏడాది మే, జూన్ నెలల పూర్తి కేటాయింపును అందుకున్నాయి. ఈ ఏడాది మే నెలకు సంబంధించిన ఆహారధాన్యాల కేటాయింపును 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు అందుకున్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, బీహార్, చత్తీస్ గఢ్, డామన్ డయ్యూ దాద్రా, నాగర్ హవేళి, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వందశాతం మే నెల ఆహార ధాన్యాల కేటాయింపును అందుకున్నాయి.  

  ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలకుగాను, ఐదు రాష్ట్రాలు ఈ ఏడాది మే, జూన్ కేటాయింపును సంపూర్ణ స్థాయిలో అందుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలు ఇలా అందుకున్నాయి. మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్న ఆహార ధాన్యాల స్వీకరణ ప్రక్రియ త్వరలోనే ముగిస్తుంది.

   దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సజావుగా ఆహార ధాన్యాలు అందాలన్న లక్ష్యంతో ఎఫ్.సి.ఐ. ఈ ధాన్యాలను రవాణాను నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఎఫ్.సి.ఐ. 1,433 ర్యాకుల మేర ఆహార ధాన్యాలను ఆయా రాష్ట్రాలకు పంపించింది. అంటే సగటును రోజుకు 46చొప్పున ర్యాకుల ఆహార ధాన్యాలను పంపించింది.

   ఆహార ధాన్యాల సరఫరా వ్యయం మొత్తాన్ని భారత ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఆహార సబ్సిడీ, ఆయా రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల మధ్య రవాణా వ్యయం, డీలర్ల కమిషన్, అదనపు డీలర్ల కమిషన్ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి ఖర్చును కేంద్రమే భరిస్తుంది. ఈ వ్యయాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకోవలసిన అవసరం లేదు.

  పి.ఎం.జి.కె.ఎ.వై. పథకం కింద కాలబద్ధమైన వ్యవధిలోగా ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని భారత ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రాంతాలకు తెలియజేసింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరాకోసం పి.ఎం.జి.కె.ఎ.వై. తగిన ఏర్పాట్లు చేసింది. లబ్ధిదారులందరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థికంగా దెబ్బతిని కష్టాల పాలైన నిరుపేదలకు అండగా నిలిచేందుకు పి.ఎం.జి.కె.ఎ.వై. పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారుల కుటుంబంలోని ఒక్కొక్కరికి నెలకు ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్.ఎఫ్.ఎస్.ఎ.) కింద ఈ ఆహార ధాన్యాల పంపిణీ చేపట్టారు.

 

పి.ఎం.జి.కె.ఎ.వై వివరాలు (2021 జూన్ 7వ తేదీవరకూ)

 

****



(Release ID: 1725462) Visitor Counter : 262