శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
జంతు ప్రయోగాల అధ్యయన వేదికను ఏర్పాటు చేసిన డీబీటీ-ఐఎల్ఎస్
Posted On:
07 JUN 2021 5:54PM by PIB Hyderabad
కోవిడ్-19 ఒక ప్రధాన ప్రపంచ మహమ్మారి. సమర్థవంతమైన నివారణ చర్యలు, చికిత్సలను అభివృద్ధి చేయడానికి సైంటిఫిక్, క్లినికల్ విభాగాలు చురుకుగా నిమగ్నమై ఉన్నాయి. ఈ కరోనా వైరస్ మహమ్మారి నుండి మానవులను రక్షించడానికి ఒక ముఖ్య వ్యూహం సమర్థవంతమైన వ్యాక్సిన్లు, చికిత్సా విధానాల అభివృద్ధి. ప్రస్తుతం బహుళప్రయోజన క్లినికల్ ట్రయల్స్ జరుగుతుండగా, సమాంతరంగా, వైరస్ ను అర్థం చేసుకోవడానికి మరియు భద్రత మరియు సమర్థత కోసం చికిత్సా ఏజెంట్లను పరీక్షించడానికి ఇన్ విట్రో మరియు మోడల్ జీవులపై ముందస్తు పరిశోధన కూడా అవసరం. మానవులలో సార్స్-కోవ్-2 - ప్రేరిత వ్యాధికి సంబంధించిన వ్యాధికారకతను దగ్గరగా పోలి ఉండే జంతు నమూనాలు వ్యాధి యంత్రాంగాలపై పరిశోధనలు ఔషధాల మూల్యాంకనం కోసం అవసరం. ఎలుకలు మరియు సిరియన్ చిట్టెలుక వంటి చిన్న జంతువులు సార్స్-కోవ్-2 ను అధ్యయనం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. మానవులలో కోవిడ్-19 పాథాలజీని నమ్మకంగా పునరుత్పత్తి చేస్తాయి. అందుబాటులో ఉన్న వివిధ జంతు నమూనాలలో, ఇప్పటివరకు సార్స్-కోవ్-2 సంక్రమణ అధ్యయనాలలో చిట్టెలుకలను విస్తృతంగా ఉపయోగించారు. కోవిడ్-19 హాంస్టర్ మోడల్ మానవ వ్యాధి తేలికపాటి నమూనాను అనుకరిస్తుంది, పూర్తిగా కోలుకునేలా చేస్తుంది.
జంతువులతో ప్రయోగానికి బహుళ నైపుణ్యం మరియు ప్రత్యేకమైన జంతు జీవ భద్రత స్థాయి 3 ప్రయోగశాలలు (ఎబిఎస్ఎల్ 3) అవసరం. సార్స్-కోవ్-2 కోసం యాంటీవైరల్, వ్యాక్సిన్ కాండిడేట్స్ ను అభివృద్ధి చేయడానికి ఈ అవసరాల ప్రాముఖ్యతను గ్రహించి, భువనేశ్వర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు (భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం స్వయంప్రతిపత్త పరిశోధనా సంస్థ) ఈ జంతు నమూనాలను, ఒక ఏబిఎస్ఎల్3 ప్రయోగశాల మిషన్ కోవిడ్ సురక్ష ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) సహకారంతో ఐఎల్‌ఎస్‌లో ఈ వేదికను ఏర్పాటు చేశారు.
ఈ ఇన్స్టిట్యూట్ కి చెందిన కోవిడ్-19 పరిశోధనా బృందం ఇటీవల సార్స్-కోవ్-2 సంక్రమణకి సంబంధించిన చిట్టెలుక నమూనాలను విశ్లేషించే పని చేపట్టింది. ఐఎల్ఎస్ లో జరిపిన ప్రోటీమిక్ అధ్యయనాలు మానవులలో, చిట్టెలుకలలో సార్స్-కోవ్-2 సంక్రమణ మధ్య సారూప్యతను చూపుతాయి. క్లినికల్ పారామితుల విశ్లేషణతో పాటు కోవిడ్- 19 రోగులలో ముందు కణజాల నమూనాలు సార్స్-కోవ్-2 సంక్రమణ పాథోఫిజియోలాజికల్ అభివ్యక్తిని చూపిస్తాయని గమనించడం జరిగింది. ఈ అధ్యయనం ఫలితాలు ఇటీవల ప్రతిష్టాత్మక పత్రిక ఎఫ్ఏఎస్ఈబి (ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ) జర్నల్‌లో ప్రచురించారు.
డాక్టర్ శశిభూషణ్ సేనాపతి, డాక్టర్ గులాం సయ్యద్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సార్స్-కోవ్-2 కోసం ఔషధాలు, టీకా కాండిడేట్ల పరీక్ష, విశ్లేషణ కోసం సేవలను అందించడంలో ఈ జంతు నమూనా, సంస్థ ఏబిఎస్ఎల్-3 సౌకర్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ పరీడా అభిప్రాయపడ్డారు. ఈ సదుపాయం ఫీజు-ఫర్-సర్వీస్ మోడ్‌లో లేదా భాగస్వామ్య మోడ్‌లో పనిచేస్తుంది. భారతదేశం, విదేశాల నుండి విద్యావేత్తలు, పరిశ్రమలు, స్టార్టప్‌ల పరిశోధకుల ఉపయోగం కోసం అందుబాటులో ఉంటుంది.
ఇంకా సమాచారం కోసం డీబీటీ/బిఐఆర్ఏసి కమ్యూనికేషన్ విభాగాన్ని సంప్రదించవచ్చు.
www.dbtindia.gov.inwww.birac.nic.in
***
(Release ID: 1725267)
Visitor Counter : 710