ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చదువుకోడానికి లేదా ఉపాధి అవకాశాల కోసం లేదా టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారతదేశం నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వ్యక్తులకు రెండో మోతాదు టీకాలు ఇవ్వడానికి కేంద్రం ప్రామాణిక నిర్వహణా పద్ధతులను (ఎస్ఓపీ) జారీ చేసింది


అటువంటి యాత్రికుల పాస్‌పోర్ట్‌కు కోవిన్ సర్టిఫికెట్లను అనుసంధానిస్తారు.


టీకా రకాన్ని “కోవిషీల్డ్” గా పేర్కొంటే సరిపోతుంది; టీకా సర్టిఫికెట్లలో ఇతర అర్హత ఎంట్రీలు అవసరం లేదు

Posted On: 07 JUN 2021 7:13PM by PIB Hyderabad

ఈ ఏడాది జనవరి 16 నుండి ‘హోల్ ఆఫ్ గవర్నమెంట్’ విధానం ప్రకారం సమర్థవంతమైన టీకా డ్రైవ్ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. టీకా డ్రైవ్‌ను అందరికీ వర్తింపజేయాలనే లక్ష్యంతో, 2021 మే 1 నుండి భారత వ్యాక్సిన్ స్ట్రాటజీ  లిబరలైజ్డ్ ఫేజ్ III ను ప్రారంభించింది. 18 ఏళ్లు పైబడిన పెద్దలందరికీ ప్రభుత్వం టీకాలు వేస్తోంది. జనాభాలోని అన్ని విభాగాలకు టీకా కవరేజీని పెంచడానికి, టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది.  కోవిషీల్డ్  మొదటి మోతాదు (డోసు) మాత్రమే తీసుకొని,  చదువు కోసం లేదా ఉపాధి కోసం అంతర్జాతీయ ప్రయాణాన్ని చేపట్టాలని కోరుకునే వ్యక్తుల కోసం కోవిషీల్డ్  రెండవ మోతాదును వేయడానికి అనుమతించాలని కేంద్ర ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు అనేక విజ్ఞప్తులు అందాయి. టోక్యో ఒలింపిక్ క్రీడలకు భారతదేశం తరఫున హాజరయ్యే జట్టు కూడా టీకాలు తీసుకోవాల్సి ఉంది. వీరికి మొదటి మోతాదు తేదీ నుండి 84 రోజులతప్పనిసరి కనీస విరామం పూర్తి కావడానికి ముందే ప్రయాణాలు ఉంటాయి. ఇలాంటి వారికి టీకాలు వేయడానికి వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ ప్రామాణిక నిర్వహణా విధానాలను జారీ చేసింది. వీటి గురించి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు.. వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని  కోరింది. ఈ ప్రామాణిక నిర్వహణా పద్ధతులను వెంటనే అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

ప్రామాణిక నిర్వహణా పద్ధతులు  క్రింది విధంగా ఉన్నాయి:

 

ప్రస్తుతం, కొవిడ్–19(నెగ్వ్యాక్) కొరకు వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ సిఫారసుల మేరకు.. నేషనల్ కోవిడ్ టీకా వ్యూహం ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారికి రెండో మోతాదును 12-–16 వారాల వ్యవధిలో (అంటే 84 తరువాత)  ఇవ్వాలి.

 

కోవిషీల్డ్  మొదటి మోతాదు మాత్రమే తీసుకొని  చదువుల కోసం లేదా ఉపాధి అవకాశాల కోసం లేదా టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం  విదేశాలకు వెళ్లే వారికి 84 రోజులు దాటకముందే కోవిషీల్డ్ రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో అభ్యర్థనలు వచ్చాయి. దీనిపై  ఎంపవర్డ్ గ్రూప్ 5 (ఇజి -5) చర్చించి తగిన సిఫార్సులను తీసుకుంది.

 

టీకా  పూర్తి కవరేజీని అందించడానికి, నిజమైన కారణాల వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు అవసరం ఉన్న వారికి కోవిషీల్డ్ వ్యాక్సిన్  రెండవ మోతాదును నిర్వహించడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి.

 

ఈ ప్రత్యేక పంపిణీ వీరికి అందుబాటులో ఉంటుంది -

 

–చదువు కోసం విదేశీ ప్రయాణాన్ని చేపట్టాల్సిన విద్యార్థులు.

విదేశాలలో ఉద్యోగాలు చేపట్టాల్సిన వ్యక్తులు.

–టోక్యోలో అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలకు హాజరయ్యే క్రీడాకారులు,  భారత బృందానికి చెందిన సిబ్బంది

–ఇలాంటి వారికి కోవిషీల్డ్  రెండవ మోతాదు ఇవ్వడం కోసం రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ప్రతి జిల్లాలో ప్రాధికార సంస్థలను నియమిస్తాయి.

మొదటి మోతాదు తేదీ తర్వాత 84 రోజుల వ్యవధికి ముందు రెండవ మోతాదు వేయడానికి సంబంధి ఈ క్రింది వాటిని తనిఖీ చేస్తుంది -

 

మొదటి మోతాదు తేదీ తర్వాత 28 రోజుల వ్యవధి ముగిసిందా ? లేదా ?

విదేశీ ప్రయాణం అనివార్యమని నిరూపించే  అడ్మిషన్ ఆఫర్లు లేదా  సంబంధిత అనుబంధ అధికారిక పత్రాలను.

ఒక వ్యక్తి ఇప్పటికే ఒక విదేశీ విద్యా సంస్థలో చదువుతున్నాడా ? వారి విద్యను కొనసాగించడానికి ఆ సంస్థకు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉందా ?

ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కు వెళ్తుంటే సంబంధిత లెటర్లు ఉన్నాయా ?

టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి నామినేషన్.

 

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అనుమతించదగిన గుర్తింపు పత్రాలలో ఒకటైన పాస్‌పోర్ట్ ద్వారా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. పాస్‌పోర్ట్ సంఖ్యను సర్టిఫికెట్‌పై ముద్రిస్తారు. మొదటి మోతాదు సమయంలో పాస్‌పోర్ట్ నంబరు ఉపయోగించకపోతే, టీకా కోసం ఉపయోగించిన ఫోటో ఐడీ కార్డ్ వివరాలను టీకా సర్టిఫికెట్‌లో చేర్చుతారు. టీకా సర్టిఫికెట్‌లో పాస్‌పోర్ట్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట, టీకాల సర్టిఫికెట్‌ను లబ్ధిదారుడి పాస్‌పోర్ట్ నంబర్‌తో అనుసంధానించే మరొక ప్రమాణపత్రాన్ని ఇచ్చే అధికారం సంస్థకు ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని చేయాల్సిన వారికి 2021 ఆగస్టు 31 వరకు   ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. కొవిడ్ టీకా కేంద్రాలు, ఏఈఎఫ్ఐ నిర్వహణ మొదలైన వాటికి సంబంధించి మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలలో సూచించిన అన్ని సాంకేతిక నియమాలను సరళతరం చేశారు.  సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన, డీసీజీఐ గుర్తింపు పొందిన కోవిషీల్డ్ డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిన టీకాల్లో ఒకటని 2021 జూన్ 3 వ తేదీన స్పష్టం చేయబడింది. సంబంధిత ఎంట్రీ డబ్ల్యూహెచ్ఓ ఈయూఎల్  సీరియల్ నంబర్ 4 వద్ద అందుబాటులో ఉంది: https://extranet.who.int/pqweb/sites/default/files/documents/Status%20of%20COVID-19%20Vaccines%20within%20WHO%20EUL-PQ%20evaluation%20process%20-%203%20June%202021.pdf  

 

టీకా రకాన్ని “కోవిషీల్డ్” గా పేర్కొనడం సరిపోతుంది  టీకా ధృవీకరణ పత్రాలలో ఇతర అర్హత ఎంట్రీలు అవసరం లేదు.

అటువంటి అసాధారణమైన సందర్భాల్లో 2 వ మోతాదును ఇవ్వడానికి కోవిన్ వ్యవస్థ త్వరలో సౌకర్యాన్ని అందిస్తుంది.

***


(Release ID: 1725203) Visitor Counter : 1456