ప్రధాన మంత్రి కార్యాలయం

దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి


18 ఏళ్ల వయస్సు పైబడిన భారతీయ పౌరులు అందరికీ ఉచితంగా టీకా మందు ను సమకూర్చనున్న భారత ప్రభుత్వం


రాష్ట్రాల పరిధి లో ఉన్నటువంటి 25 శాతం టీకాకరణ కార్యక్రమాన్ని ఇక భారత ప్రభుత్వం చేపడుతుంది: ప్ర‌ధాన మంత్రి


టీకా మందు ఉత్పత్తిదారుల మొత్తం ఉత్పత్తి లో 35 శాతం ఉత్పత్తి ని భారత ప్రభుత్వం కొనుగోలు చేసి, రాష్ట్రాల కు ఉచితం గా సమకూర్చుతుంది: ప్ర‌ధాన మంత్రి
 

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ను దీపావళి వరకు పొడిగించడమైంది: ప్ర‌ధాన మంత్రి

నవంబరు వరకు, 80 కోట్ల మంది ప్రజలు ప్రతి నెల ఆహారధాన్యాల ను ఉచితం గా పొందడమనేది కొనసాగనుంది: ప్ర‌ధాన మంత్రి


కరోనా గడచిన వంద సంవత్సరాల లో ఎదురైన అత్యంత చెడ్డ విపత్తు: ప్ర‌ధాన మంత్రి

రానున్న రోజుల లో టీకామందు సరఫరా పెరగగలదు: ప్ర‌ధాన మంత్రి

కొత్త టీకామందు ల అభివృద్ధి పురోగమిస్తోందని తెలిపిన ప్రధాన మంత్రి
 

పిల్లల కు టీకామందుల కోసం, ముక్కు లో నుంచి వేసే టీకామందు కోసం యత్నాలు సాగుతున్నాయి


టీకా లు వేసే కార్యక్రమాన్ని గురించి భయాల ను రేకెత్తించే వారు ప్రజల ప్రాణాల తో ఆడుకొంటున్నారు: ప్ర‌ధాన మంత్రి

Posted On: 07 JUN 2021 6:46PM by PIB Hyderabad

దేశ ప్రజల ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమవారం ప్రసంగించారు.
 



మహమ్మారి బారిన పడి ప్రాణాల ను కోల్పోయిన వారికి ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు.  ఈ ప్రపంచ వ్యాప్త వ్యాధి ని గడచిన వంద సంవత్సరాల లో విరుచుకుపడ్డ అతి పెద్ద విపత్తు గా ఆయన పేర్కొంటూ, ఇటువంటి మహమ్మారి ని ఆధునిక ప్రపంచం చూడటం గాని, లేదా అనుభవం లోకి తెచ్చుకోవడం గాని జరుగలేదన్నారు.   దేశం ఈ మహమ్మారి తో అనేక యుద్ధ క్షేత్రాల లో పోరాడింది అని ప్రధాన మంత్రి అన్నారు.  శ్రీ నరేంద్ర మోదీ అనేక ముఖ్యమైన ప్రకటనల ను వెలువరించారు.

టీకామందు ను వేసే వ్యూహాన్ని పున:పరిశీలించాలన్న డిమాండు తోను, మే 1వ తేదీ కంటే ముందు ఉన్న పద్ధతి ని తిరిగి తీసుకురావాలన్న డిమాండు తోను అనేక రాష్ట్రాలు ముందుకు వచ్చినందువల్ల, రాష్ట్రాల పరిధి లో ఉన్నటువంటి 25 శాతం టీకామందు ను వేసే కార్యక్రమాన్ని ఇక భారత ప్రభుత్వం చేపట్టాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమైంది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.  దీని ని రెండు వారాల లో అమలు లోకి తీసుకురావడం జరుగుతుంది.  రెండు వారాల లో, కేంద్రం, రాష్ట్రాలు కొత్త మార్గదర్శకాల ప్రకారం అవసరమైన సన్నాహాల ను చేస్తాయి.  జూన్ 21 నాటి నుంచి, భారత ప్రభుత్వం 18 ఏళ్ల  వయస్సు పైబడిన భారతదేశం లోని పౌరులు అందరికీ టీకామందు ను ఉచితంగా అందజేస్తుంది అని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.  టీకామందు ఉత్పత్తిదారుల మొత్తం ఉత్పత్తి లో 75 శాతం ఉత్పత్తి ని భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది; రాష్ట్రాల కు టీకామందు ను ఉచితం గా సమకూర్చుతుంది.  ఏ రాష్ట్ర ప్రభుత్వమూ టీకామందుల కోసం ఎలాంటి ఖర్చు చేయబోదు.  ఇంత వరకు, కోట్ల కొద్దీ ప్రజలు టీకామందు ను ఉచితంగా అందుకొన్నారు.  ఇక 18 ఏళ్ల విభాగాన్ని ఈ వర్గాని కి జత పరచడం జరుగుతుంది.  భారత ప్రభుత్వం పౌరులు అందరికీ టీకామందు ను ఉచితం గా అందజేస్తుంది అని ప్రధాన మంత్రి తిరిగి చెప్పారు.

25 శాతం టీకామందుల ను ప్రయివేటు ఆసుపత్రులు నేరు గా సేకరించే పద్ధతి కొనసాగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.  టీకాల కు నిర్ణయించిన ధర కంటే ప్రయివేటు ఆసుపత్రులు 150 రూపాయల సర్వీసు చార్జి ని మాత్రమే వసూలు చేసేటట్లు రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ జరుపుతాయి.

మరొక ప్రధాన ప్రకటన లో భాగం గా, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ను దీపావళి వరకు  పొడిగిస్తూ నిర్ణయం జరిగింది అని ప్రధాన మంత్రి తెలియజేశారు.  అంటే నవంబరు వరకు, నిర్ణయించిన మేరకు ఆహార ధాన్యాల ను 80 కోట్ల మంది ప్రజలు ప్రతి నెల ఉచితం గా పొందుతూనే ఉంటారన్న మాట.  మహమ్మారి కాలం లో, ప్రభుత్వం పేద వారి అన్ని అవసరాల ను తీర్చడానికి వారి మిత్రుని వలె వారి వెన్నంటి నిలబడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఏప్రిల్, మే నెలల్లో సెకండ్ వేవ్ సందర్భం లో మెడికల్ ఆక్సీజన్ కు డిమాండు మునుపు లేనంత గా పెరిగిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, ప్రభుత్వం లోని అన్ని వ్యవస్థల ను రంగం లోకి దింపడం ద్వారా సవాలు ను యుద్ధ ప్రాతిపదిక న తట్టుకోవడం జరిగింది అని వివరించారు.  భారతదేశం చరిత్ర లో, మెడికల్ ఆక్సీజన్ కు ఇంతగా డిమాండు ఏర్పడటం అనేది ఎన్నడూ అనుభవం లోకి రాలేదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  

ప్రపంచ వ్యాప్తం గా చూస్తే, టీకామందు లకు ఉన్న డిమాండు కంటే టీకామందు ను ఉత్పత్తి చేసే కంపెనీలు, దేశాలు చాలా తక్కువ గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  అటువంటి స్థితి లో, మేడ్ ఇన్ ఇండియా టీకా భారతదేశానికి కీలకం గా మారింది.  గతం లో, టీకా లు విదేశాల లో అభివృద్ధి అయిన తరువాత దశాబ్దాల కు భారతదేశం టీకాల ను అందుకొంటూ ఉండేది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఇది గతం లో ఇతర దేశాలు టీకా తాలూకు పని ని ముగించే దశ లో ఉండగా, భారతదేశం కనీసం టీకాల ను ఇప్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనైనా ప్రారంభించ లేకపోయే స్థితి ని కల్పించింది.  ఉద్యమ తరహా లో కృషి చేయడం ద్వారా, మనం టీకా కవరేజి ని 5-6 సంవత్సరాల లో 60 శాతం నుంచి 90 శాతానికి పెంచాం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  మనం టీకాల ను వేయించే కార్యక్రమం తాలూకు వేగాన్ని పెంచడం ఒక్కటే కాకుండా టీకాల ను వేయించే పరిధి ని కూడా విస్తరించాం అని ప్రధాన మంత్రి అన్నారు.  

ఈ సారి, భారతదేశం అన్ని భయాల ను స్పష్టమైనటువంటి విధానం ద్వారాను, నిలకడతనంతో కూడాన కఠోర శ్రమ ద్వారాను చెదరగొట్టింది, కోవిడ్ కై కేవలం ఒకటి కాదు రెండు మేడ్- ఇన్- ఇండియా వ్యాక్సీన్ లు భారతదేశం లో ప్రారంభానికి నోచుకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  మన శాస్త్రవేత్త లు వారి శక్తి ని, సామర్థ్యాన్ని నిరూపించుకొన్నారు. ఈ నాటి వరకు, దేశం లో 23 కోట్ల కు పైగా టీకా మందు డోసుల ను ఇప్పించడమైందన్నారు.    

కేవలం కొన్ని వేల కోవిడ్-19 కేసు లు ఉన్నప్పుడు వ్యాక్సీన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది, మరి టీకామందు కంపెనీల కు వాటి యత్నాల లోను, పరిశోధన- అభివృద్ధి పరం గాను ప్రభుత్వం ద్వారా సాధ్యమైన అన్ని విధాలు గా మద్దతు లభించింది అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  గొప్ప ప్రయాస, కఠోర శ్రమ ల కారణం గా, టీకామందు సరఫరా రాబోయే రోజుల లో పెరగనుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.  ప్రస్తుతం ఏడు కంపెనీ లు వివిధ తరహా టీకామందుల ను ఉత్పత్తి చేస్తున్నాయి అని ఆయన వెల్లడించారు.  మరో మూడు వ్యాక్సీన్ లను తీసుకు వచ్చే ప్రయత్నాలు పురోగమన దశ కు చేరుకొన్నాయి అని ప్రధాన మంత్రి తెలిపారు.  పిల్లల కోసం రెండు టీకామందుల ను కనుగొనేటందుకు, అలాగే ‘ముక్కు ద్వారా వేసే వ్యాక్సీన్’ ను తీసుకు వచ్చేందుకు యత్నాలు సాగుతున్నాయి అని కూడా ఆయన వివరించారు.  

టీకామందు ను వేయించే కార్యక్రమం పై వేరు వేరు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.  కరోనా కేసు లు తగ్గుముఖం పడుతుండటం తో, రాష్ట్రాల ఎదుట నిర్ణయ లోపం గురించిన ప్రశ్నలు తలెత్తాయని, కేంద్ర ప్రభుత్వం ప్రతిదీ ఎందుకు నిర్ణయిస్తోంది అంటూ కొందరు అడిగారు.  లాక్ డౌన్ లో సారళ్యం, ఒకే సైజు పరిమాణం అందరికీ సరిపోదు అనే తరహా వాదన ముందుకు వచ్చింది.  జనవరి 16 మొదలుకొని ఏప్రిల్ నెలాఖరు వరకు, భారతదేశ టీకాకరణ కార్యక్రమం చాలావరకు కేంద్ర ప్రభుత్వ అధీనం లోనే నడిచింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  అందరికీ ఉచితం గా టీకామందు ను ఇప్పించే కార్యక్రమం ముందుకు సాగుతూ వచ్చింది, మరి ప్రజలు వారి వంతు వచ్చినప్పుడు టీకా ను వేయించుకోవడం లో క్రమశిక్షణ ను ప్రదర్శించారు.  దీనంతటికీ మధ్య టీకామందు ను ఇచ్చే కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలి అనే డిమాండు లు వచ్చాయి, కొన్ని వయో వర్గాల వారికి ప్రాధాన్యాన్ని గురించిన నిర్ణయం తెర మీదకు వచ్చింది.  అనేక రకాలైన ఒత్తిడులు బయలుదేరాయి, ప్రసార మాధ్యమాల లో కొన్ని విభాగాలు దీని ని ఒక ప్రచారంలా భుజానికి ఎత్తుకొన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  

 



టీకామందు ను వేయించుకొనే కార్యక్రమాని కి వ్యతిరేకం గా వదంతుల ను వ్యాప్తి లోకి తీసుకు వస్తున్న వారి పట్ల అప్రమత్తం గా ఉండవలసిందంటూ ప్రజల కు ప్రధాన మంత్రి ముందు జాగ్రత్త చెప్పారు.

 

 

DS


(Release ID: 1725196) Visitor Counter : 331