ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో కొత్తకేసులు లక్షలోపు, ఇది 61 రోజుల అత్యల్పం


2 లక్షలలోపు కేసులు నమోదవటం ఇది 11వ రోజు
చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 14,01,609 కు తగ్గుదల

25వరోజుకూడా కొత్తకేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువమంది

కోలుకునవారిశాతం స్థిరంగా పెరుగుతూ 93.94% కు చేరిక

రోజువారీ పాజిటివిటీ 6.34%; 14రోజులుగా 10% లోపే
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 23.27 కోట్ల టీకా డోసుల పంపిణీ

Posted On: 07 JUN 2021 11:02AM by PIB Hyderabad

దేశంలో గత 24 గంటలలో 1,00,636 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలలకాలంలో ఇది అత్యల్పం. వరుసగా 11 రోజులుగా దేశంలో రోజూ  2 లక్షలలోపు కేసులు నమోదవుతూ వస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వంతో రాష్టాలు, కేమ్ద్రపాలితప్రాంతాలు సమన్వయంతో ఉమ్మడిగా చేస్తున్న కృషి ఫలితం.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KSXM.jpg

చికిత్సపొందుతున్నవారి సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య రెండు రోజులుగా 15 లక్షలకు లోపే ఉంటూ ఉండగా నేడు  14,01,609 గా నమోదైంది. 7 రోజులుగా 20 లక్షలలోపు నమోదైంది. గత 24 గంటలలో నికరంగా 76,190 కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 4.85% మాత్రమే.   

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025SBB.jpg

ఎక్కువమంది కోలుకుంటూ ఉండటంతో కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారే అధికంగా ఉంటున్న ధోరణి 25 రోజులుగా సాగుతోంది. గత 24 గంటలలో 1,74,399 మంది కోవిడ్ బారినుంచి బైటపడ్డారు. మొన్నటి  కంటే నిన్న కోలుకున్నవారు  73,763 మంది ఎక్కువ

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003C8MK.jpg

ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి మొత్తం సంఖ్య  2,71,59,180 కాగా కోలుకున్నవారి శాతం 93.94%. ఇది పెరుగుతున్న ధోరణి కొనసాగిస్తోంది. గత 24 గంటలలో 15,87,589 కోవిడ్ నిర్థారణ పరీక్షలు జరపగా ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు 36 కోట్లు దాటి  36,63,34,111 కు చేరాయి. 

ఒకవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల సంఖ్య పెంచగా పాజిటివిటీ శాతం బాగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ పాజిటివిటీ ప్రస్తుతం 6.34% కు చేరగా వరుసగా 14 రోజులుగా అది 10% లోపే ఉంటోంది.   

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004W5V1.jpg

టీకాల విషయానికొస్తే ఇప్పటిదాకా 23.27 కోట్ల డోసుల పంపిణీ జరిగింది.  ఈ ఉదయం 7 గంతలకు అందిన నివేదిక ప్రకారం 32,68,969 శిబిరాల ద్వారా 23,27,86,482 టీకా డోసుల పంపిణీ జరిగింది.  వివరాలు ఇవి: . 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,68,836

రెండో డోస్

68,62,013

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,62,06,661

రెండో డోస్

86,71,758

 18-44 వయోవర్గం

మొదటి డోస్

2,86,18,514

రెండో డోస్

1,68,302

45-60 వయోవర్గం

మొదటి డోస్

7,10,44,966

రెండో డోస్

1,13,34,356

60 పైబడ్డ్దవారు

మొదటి డోస్

6,06,75,796

రెండో డోస్

1,92,35,280

మొత్తం

23,27,86,482

 

***


(Release ID: 1725047) Visitor Counter : 189