ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప‌న్నుచెల్లింపుదారుల‌కోసం, జూన్ 7, 2021 న ప్రారంభం కానున్న‌ ఆదాయ‌న్నుశాఖ‌కు చెందిన స్నేహ‌పూర్వ‌క‌ నూత‌న ఈ -ఫైలింగ్ పోర్ట‌ల్‌ ప‌లు కొత్త ఫీచ‌ర్లు


అందుబాటులోకి రానున్న ఉచిత ఐటిఆర్ త‌యారీ ఇంట‌రాక్టివ్ సాఫ్ట్‌వేర్
ప‌న్ను చెల్లింపుదారులకు స‌హాయప‌డేందుకు కొత్త కాల్ సెంట‌ర్

Posted On: 05 JUN 2021 8:36PM by PIB Hyderabad

ఆదాయ‌ప‌న్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్ట‌ల్ www.incometax.gov.in ను 2021 జూన్ 7న ప్రారంభించ‌నుంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు వీలుగా ఉండేందుకు, ఆధునిక‌, ఎలాంటి అడ్డంకులు లేని అనుభ‌వం క‌లిగించ‌డం ఈ నూత‌న ఈ ఫైలింగ్ పోర్ట‌ల్ ల‌క్ష్యం. నూత‌న పోర్ట‌ల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు కింద తెల‌ప‌డం జ‌రిగింది..

ప‌న్ను చెల్లింపుదారుల‌కు అనుకూలంగా ఉండే నూత‌న పోర్ట‌ల్ లో త‌క్ష‌ణం ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నుల  (ఐటిఆర్‌ల)ప్రాసెసింగ్ నుంచి  ప‌న్ను చెల్లింపుదారుల‌కు  త్వ‌ర‌గా రిఫండ్ చెల్లించ‌డం వంటి వాటి వ‌ర‌కు ఉన్నాయి.
అన్ని లావాదేవీలు, అప్‌లోడ్‌లు లేదా పెండింగ్ చ‌ర్య‌లు అన్నీ ఒకే డాష్ బోర్డులో ప‌న్ను చెల్లింపుదారు ఫాలోఅప్ చ‌ర్య కోసం ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతాయి.


ఉచితంగా ఐటిఆర్ త‌యారీ సాఫ్ట్‌వేర్ ఇంట‌రాక్టివ్ ప్ర‌శ్న‌ల‌తో ఇందులో అందుబాటులో ఉంటుంది. ఇది ఐటిఆర్ 1,4 ప‌న్ను చెల్లింపుదారుల‌కు (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) అలాగే ఐటిఆర్ 2 ( ఆఫ్‌లైన్‌)  వారికి ముందు ఉప‌యోగ‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే 3,5,6,7 వారికి కూడా ఐటిఆర్ త‌యారీ ని అందుబాటులోకి తెస్తారు.

ప‌న్ను చెల్లింపుదారులుత‌మ వేత‌నంతోపాటు ఇంటికి సంబంధించిన ఆస్తి, వ్యాపార‌, ప్రొఫెష‌న్ వంటి వాటి ఆదాయానికి సంబంధించిన కొంత స‌మాచారాన్ని అందించ‌డం ద్వారా  వారు ప్రొఫైల్ అప్‌డేట్ చేయ‌గ‌లుగుతారు. దీనిని ఐటిఆర్ ముంద‌స్తుగా నింప‌డానికి ఉప‌యోగిస్తారు.

స‌వివ‌రమైన ప్రీ ఫిల్లింగ్ , వేత‌న రాబ‌డి, వ‌డ్డీ, డివిడెండ్‌, కాపిట‌ల్ గెయిన‌స్ వంటివి టిడిఎస్‌, ఎస్‌.ఎఫ్‌.టి స్టేట్‌మెంట్ లు అప్ లోడ్ చేసిన త‌ర్వాత తెలుస్తుంది. (ఇందుకు గ‌డువు 2021 జూన్ 30)
ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌హాయం చేసేందుకు కొత్త కాల్ సెంట‌ర్  ఏర్పాటు అవుతుంది. ప‌న్నుచెల్లింపుదారుల ప్ర‌శ్న‌ల‌కు స‌త్వ‌ర స‌మాధానం ల‌భిస్తుంది. త‌రచూ అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు, దీనిని ఉప‌యోగించేందుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శి, వీడియోలు, చాట్ బాట్ లైవ్ ఏజెంట్ కూడా ఉంటుంది.

ఆదాయప‌న్ను ఫార‌మ్‌లు ఫైల్ చేయ‌డానికి సంబంధించ‌చిన విధివిధానాలు, యాడ్ టాక్స్ ప్రొఫెష‌న‌ల్స్‌, ఫేస్‌లెస్ ప‌రిశీల‌న‌, లేదా అప్పీళ్ల‌కు సంబంధించి నోటీసుల‌కు స్పంద‌న‌ల‌ను స‌మ‌ర్పించే అవ‌కాశం కూడా ఇందులో ఉంటుంది..

ప‌న్ను చెల్లింపు దారుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా , అడ్వాన్సు ప‌న్ను వాయిదా తేదీ అయిన 2021 జూన్ 18 త‌ర్వాత కొత్త ప‌న్ను చెల్లింపు వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించ‌నున్న‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు. పోర్ట‌ల్ ప్రారంభించిన త‌ర్వాత ప‌న్ను చెల్లింపుదారులు వివిధ ఫీచ‌ర్లు తెలుసుకునే విధంగా మొబైల్ యాప్‌ను కూడా ఆ త‌ర్వాత విడుద‌ల చేయ‌నున్నారు. కొత్త విధానం అల‌వాటు కావ‌డానికి కొంత కాలం ప‌డుతుంది.అందువ్ల ప‌న్ను చెల్లింపుదారులు, ఇత‌ర స్టేక్‌హోల్డ‌ర్లు కొత్త పోర్ట‌ల్ ప్రారంభించిన త‌ర్వాత , ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన‌వి విడుద‌ల చేసేవ‌ర‌కు ఒర్పు వ‌హించాల‌ని కోరారు. ఎందుకంటే ఇది ప్ర‌ధాన‌మైన ప‌రివ‌ర్త‌న‌గా ఉండ‌నుంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు, ఇత‌ర స్టేక్ హోల్డ‌ర్ల‌కు ఫైలింగ్‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు సిబిడిటి తీసుకున్న మ‌రో చ‌ర్య‌గా చెప్ప‌వ‌చ్చు.

***(Release ID: 1724850) Visitor Counter : 201