రైల్వే మంత్రిత్వ శాఖ

దేశానికి సేవ చేస్తూ 25000 ఎంటీలకు పైగా ఆక్సిజన్ రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు


1500 పైగా ట్యాంకర్ల ద్వారా దేశం వివిధ ప్రాంతాలకు చేరిన ఆక్సిజన్

15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తూ ఆక్సిజన్ అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

ఝార్ఖండ్ నుంచి 80 ఎంటీల ఆక్సిజన్ తో అస్సాం చేరిన అయిదవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌

కర్ణాటకకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా చేరిన 3000 ఎంటీలకు పైగా ఎల్‌ఎంఓ



మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తరప్రదేశ్ కు దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్కి 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5790 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2212 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 3097 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 2787 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 2602 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 2474 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్ కు 38, అస్సాంకు 400 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ తరలింపు

Posted On: 05 JUN 2021 2:28PM by PIB Hyderabad

అడ్డంకులను అధిగమిస్తూ  కొత్త పరిష్కారాలను ద్వారా  భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) ను పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. 

దేశానికి సేవ చేస్తూ సాగిస్తున్న ప్రయాణంలో భారతీయ రైల్వేలు ఇంతవరకు దేశం వివిధ ప్రాంతాలకు 25000 ఎంటీలకు పైగా ఆక్సిజన్ ను రవాణా చేశాయి.

ఇప్పటివరకు భారత రైల్వే శాఖ 1503కి పైగా ట్యాంకర్లలో దాదాపు 25629  మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు రవాణా చేసింది.

 

వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించిన తరువాత 368 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. 

ఈ ప్రకటన వెలువడిన సమయానికి 30 ట్యాంకర్లలో 482 ఎంటీల ఎల్‌ఎంఓను నింపుకుని ఏడు  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ గమ్యస్థానాల వైపు ప్రయాణిస్తున్నాయి. 

ఝార్ఖండ్ నుంచి నాలుగు ట్యాంకర్లలో 80 ఎంటీల ఎల్‌ఎంఓతో అయిదవ  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ అస్సాం చేరింది. 

కర్ణాటకకు  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల  ద్వారా 3000 ఎంటీల ఎల్‌ఎంఓ చేరింది. 

దేశంలో అవసరం అయినా రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేసే కార్యక్రమాన్ని రైల్వేశాఖ ఏప్రిల్ 24వ తేదీన ప్రారంభించింది. 126 ఎంటీల ఆక్సిజన్ ను తొలిసారిగా రైల్వేశాఖ రవాణా చేసింది. 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ల  ద్వారా ఆక్సిజన్  ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్,  జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలకు సరఫరా అయ్యింది. 

ఈ ప్రకటన వెలువడిన సమయానికి మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ఉత్తరప్రదేశ్ కు  దాదాపు 3797 మెట్రిక్ టన్నులుమధ్యప్రదేశ్కి 656 మెట్రిక్ టన్నులుఢిల్లీకి 5790 మెట్రిక్ టన్నులుహర్యానాకు 2212 మెట్రిక్ టన్నులురాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులుకర్ణాటకకు 3097 మెట్రిక్ టన్నులుఉత్తరాఖండ్‌కు 320 మెట్రిక్ టన్నులుతమిళనాడుకు 2787 మెట్రిక్ టన్నులుఆంధ్రప్రదేశ్‌కు 2602 మెట్రిక్ టన్నులుపంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులుకేరళకు 513 మెట్రిక్ టన్నులుతెలంగాణకు 2474 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్ కు 38, అస్సాంకు 400 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ సరఫరా అయ్యింది. 

ఇంతవరకు 15 రాష్ట్రాల్లో  39 నగరాలు/ పట్టణాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఆక్సిజన్ చేరింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నో,వారణాసి, కాన్పూర్, బారెయిలీ, గోరఖ్ పూర్, ఆగ్రాలకు,మధ్యప్రదేశ్ లోని సాగర్, జబల్పూర్, కాట్నే,భోపాల్ కు, మహారాష్ట్రలో సోలాపూర్,ముంబయి, పూణే,నాసిక్, నాగపూర్ లకు,  తెలంగాణాలో హైదరాబాద్, ఢిల్లీలో ఓఖ్లా,ఢిల్లీ కంటోన్మెంట్, తుగ్లకాబాద్, హర్యానాలో గురుగాం, ఫరీదాబాద్, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు,గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నంలకు, కేరళలో ఎర్నాకులం, తమిళనాడులో తిరువల్లూర్, చెన్నై,టుటికోరన్, కోయంబత్తూరు, మధురైలకు, పంజాబ్ లో భటిందా, ఫిల్లర్ లకు, అస్సాంలో కామరూప్, ఝార్ఖండ్ లో రాంచికి ఆక్సిజన్ రవాణా అయ్యింది.

రాష్ట్రాల అవసరాల మేరకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి రైల్వేలు వివిధ మార్గాలను సిద్ధం చేశాయి. ఎల్‌ఎంఓను తీసుకురావడానికి అవసరమైన ట్యాంకర్లను  భారత రైల్వేకు ఆయా రాష్ట్రాలు అందిస్తున్నాయి. 

భారతీయ రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా మరియు తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుంచి  ఆక్సిజన్ ను సమగ్ర కార్యాచణతో   ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ,  ఉత్తర ప్రదేశ్ , అస్సాం రాష్ట్రాలకు రవాణా చేస్తోంది. 

ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూసేందుకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా  రైళ్లను నడపడంలో రైల్వే కొత్త ప్రమాణాలను, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న ఈ రైళ్లు ఒకోసారి 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి.  సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఆక్సిజన్ గమ్య స్థానానికి చేరుకునేలా చూడడానికి గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ వివిధ జోన్ల మధ్య సమన్వయం సాధిస్తూ  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లను అత్యవసర ప్రాతిపదికన నడుపుతోంది . వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక స్టాప్‌లను 1 నిమిషానికి తగ్గించారు.

ఎలాంటి అంతరాయం లేకుండా  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి తమ మార్గాలను సిద్ధం చేస్తున్న రైల్వేలు   ఇతర సరకుల రవాణాకు అంతరాయం లేకుండా చర్యలను అమలు చేస్తున్నాయి. 

ఆక్సిజన్‌ను తరలించడం చాలా క్లిష్టమైన అంశం. ఈ గణాంకాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.  మరికొన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.  

***



(Release ID: 1724704) Visitor Counter : 191