ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ పర్యావరణ దినం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


పెట్రోలు లో 20 శాతం ఇథెనాల్ ను కలిపే లక్ష్య సాధన కు గడువు ను, అనుకున్న కాలాని కన్నా ముందుగా, 2025 కు జరపడమైంది: ప్రధాన మంత్రి

రిసైక్ లింగ్ ద్వారా వనరుల ను చక్కగా వినియోగించుకోగలిగే 11 రంగాల ను ప్రభుత్వం గుర్తించింది: ప్రధాన మంత్రి


దేశవ్యాప్తం గా ఇథెనాల్ ఉత్పత్తి కి, ఇథెనాల్ పంపిణీ కి పుణే లో ఇ-100 ప్రయోగాత్మక పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు

Posted On: 05 JUN 2021 1:18PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినం సందర్భం లో పెట్రోలియమ్ & సహజ వాయువు మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ కలసి శనివారం నాడు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.  ఈ కార్యక్రమం లో భాగం గా పుణే కు చెందిన ఒక రైతు తో ఆయన మాట్లాడారు.  ఆ రైతు సేంద్రియ వ్యవసాయం తాలూకు తన అనుభవాన్ని, వ్యవసాయం లో బయో ఫ్యూయల్ వినియోగాన్ని గురించి వెల్లడించారు.

ప్రధాన మంత్రి ‘‘ రిపోర్ట్ ఆఫ్ ది ఎక్స్ పర్ట్ కమిటీ ఆన్ రోడ్ మేప్ ఫార్ ఇథెనాల్ బ్లెండింగ్ ఇన్ ఇండియా 2020-2025 ’’ ను ఆవిష్కరించారు.  దేశవ్యాప్తం గా ఇథెనాల్ ఉత్పత్తి కి, ఇథెనాల్ పంపిణీ కి ఉద్దేశించినటువంటి ఒక మహత్వాకాంక్షభరిత ప్రయోగాత్మక పథకం అయిన ఇ-100 ని ఆయన పుణే లో  ప్రారంభించారు.  ‘మెరుగైన పర్యావరణం కోసం బయోఫ్యూయెల్స్ కు ప్రోత్సాహాన్ని అందించడం’ అనేది ఈ సంవత్సర కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీయుతులు నితిన్ గడ్ కరీ, నరేంద్ర సింహ్ తోమర్, ప్రకాశ్ జావడేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ లు కూడా  పాల్గొన్నారు.
 
ప్రధాన మంత్రి ఈ సందర్భం లో మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ దినం నాడు ఇథెనాల్ రంగాన్ని అభివృద్ధిపర్చడం కోసం ఒక సమగ్ర మార్గ సూచీ ని ఆవిష్కరించడం ద్వారా భారతదేశం మరొక ముందడుగు ను వేసింది అన్నారు.  ఇథెనాల్ అనేది 21వ శతాబ్ది భారతదేశం ప్రధాన ప్రాధాన్యాల లో ఒకటి గా మారింది అని ఆయన అన్నారు.  ఇథెనాల్ పై వహిస్తున్న శ్రద్ధ పర్యావరణం పైన, అలాగే రైతుల జీవనాల పైన సైతం శ్రేష్ఠతర ప్రభావాన్ని కలగజేస్తోంది అని కూడా ఆయన అన్నారు.  పెట్రోలు లో 20 శాతం ఇథెనాల్ ను కలిపేందుకు పెట్టుకొన్న లక్ష్యాన్ని 2025 వ సంవత్సరం కల్లా సాధించాలి అని ప్రభుత్వం సంకల్పించుకొందని ఆయన అన్నారు.  అంతక్రితం ఈ లక్ష్యాన్ని 2030వ సంవత్సరానికల్లా సాధించాలి అన్నది సంకల్పం కాగా, ఇప్పుడు దీని ని 5 సంవత్సరాలు ముందుగానే సాధించాలని సంకల్పించుకోవడమైంది.  2014 వ సంవత్సరం వరకు, సగటు న, ఇథెనాల్ లో కేవలం 1.5 శాతాన్ని భారతదేశం లో మిశ్రణం చేయడం జరిగింది, ప్రస్తుతం ఇది సుమారు 8.5 శాతానికి చేరుకొంది అని ఆయన వివరించారు.  దేశం లో 2013-14 లో, దాదాపు గా 38 కోట్ల లీటర్ ల ఇథెనాల్ ను కొనుగోలు చేయడం జరిగింది, ప్రస్తుతం ఇది 320 కోట్ల లీటర్ లకు పైగా పెరిగింది.  ఇథెనాల్ సేకరణ లో ఎనిమిది రెట్ల వృద్ధి లో చాలా వరకు దేశ చెరకు రైతుల కు ప్రయోజనం కలిగించింది అని ఆయన అన్నారు.  

21వ శతాబ్దపు భారతదేశం ఆధునిక ఆలోచన ల నుంచి, 21వ శతాబ్ది తాలూకు నవీన విధానాల నుంచి మాత్రమే శక్తి ని అందుకోగలుగుతుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ ఆలోచన తో, ప్రభుత్వం ప్రతి రంగం లో నిరంతరం విధాన నిర్ణయాలను తీసుకొటోంది.  ప్రస్తుతం దేశం లో ఇథెనాల్ ఉత్పత్తి కి, ఇథెనాల్ కొనుగోలు కు గాను అవసరమయ్యే మౌలిక సదుపాయాల ను నిర్మించడం పట్ల అమిత శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది అని ఆయన తెలిపారు.  ఇథెనాల్ ఉత్పత్తి యూనిట్ లు చాలా వరకు చెరకు ఉత్పత్తి అధికం గా ఉన్నటువంటి 4-5 రాష్ట్రాల లో కేంద్రీకృత‌ం అయ్యాయి; కానీ, ఇప్పుడిక దీని ని యావత్తు దేశాని కి విస్తరించడం కోసం ఆహారధాన్యాల పై ఆధారపడ్డ బట్టీల ను స్థాపించడం జరుగుతోంది.  వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథెనాల్ ను తయారు చేయడం కోసం ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఆధారంగా పనిచేసే ప్లాంటుల ను కూడా నెలకొల్పడం జరుగుతున్నది.

భారతదేశం జలవాయు న్యాయం కోసం పట్టుబడుతున్నది, ‘ ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ ’ అనే దార్శనికత ను సాకారం చేయడం కోసం ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ ను, కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇనిశియేటివ్ ను స్థాపించే ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచ కల్పన తో ముందుకు సాగిపోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  జలవాయు నిర్వహణ సూచీ లో ప్రపంచం లోని అగ్రగామి 10 దేశాల లో భారతదేశాన్ని చేర్చడమైందని ఆయన పేర్కొన్నారు.  జలవాయు పరివర్తన కారణం గా ఎదురవుతున్న సవాళ్ల సంగతి భారతదేశానికి తెలుసు అని కూడా ఆయన చెప్తూ, ఈ విషయం లో భారతదేశం చురుకుగా పనిచేస్తోంది అన్నారు.

జలవాయు పరివర్తన తో పోరాడటానికి అనుసరిస్తున్న కఠినమైన విధానాల ను గురించి, మృదువైన విధానాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు.  కఠిన విధానాల విషయానికి వస్తే, నవీకరణ యోగ్య శక్తి తాలూకు మన సామర్థ్యం గడచిన 6-7 సంవత్సరాల లో 250 శాతానికి పైగా పెరిగింది అని ఆయన చెప్పారు. స్థాపిత నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యం పరంగా చూస్తే, ప్రస్తుతం ప్రపంచం లోని అగ్రగామి 5 దేశాల సరస న భారతదేశం నిలచింది; ప్రత్యేకించి సౌర శక్తి సామర్థ్యం గత 6 సంవత్సరాల లో దాదాపు గా 15 ఇంతలు వృద్ధి చెందిందన్నారు.

ఇక దేశం అనుసరిస్తున్న మృదువైన విధానాల లో భాగం గా చారిత్రక చర్యల ను సైతం తీసుకొందని ప్రధాన మంత్రి వివరిస్తూ, ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్, సముద్రపు తీరాన్ని శుద్ధి చేయడం లేదా స్వచ్ఛ్ భారత్ ల వంటి పర్యావరణ అనుకూల ఉద్యమాల లో ప్రస్తుతం దేశం లోని సామాన్యుడు కూడా భాగం పంచుకొంటూ, ఆయా ఉద్యమాల ను ముందుకు నడిపిస్తున్నాడు అన్నారు.  37 కోట్ల కు పైగా ఎల్ఇడి బల్బుల ను , 23 లక్షల కు పైగా శక్తి ని ఆదా చేసే పంకాల ను ఇవ్వడం తాలూకు ప్రభావాన్ని తరచు గా చర్చించడమే లేదు అని కూడా ఆయన అన్నారు.  అదే విధం గా, కోట్ల కొద్దీ పేదల కు ఉజ్జ్వల పథకం లో భాగం గా గ్యాస్ కనెక్శన్ లను ఉచితంగా అందించడం తోను, సౌభాగ్య పథకం లో భాగం గా ఇలెక్ట్రిసిటి కనెక్శన్ లను సమకూర్చడం తోను, వారు కట్టెల పై ఆధారపడటాన్ని ఎంతగానో తగ్గిపోయింది అని కూడా ఆయన అన్నారు.  కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఇది ఆరోగ్యాన్ని చాలా వరకు మెరుగుపరచడం లో, పర్యావరణ పరిరక్షణ ను పటిష్టపరచడం లో తోడ్పడింది అన్నారు.   పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అభివృద్ధి ని ఆపివేయవలసిన అవసరం ఏమీ లేదు అని ప్రపంచానికి ఒక ఉదాహరణ ను భారతదేశం ఇచ్చింది అని ఆయన అన్నారు.  ఇకానమి (ఆర్థిక వ్యవస్థ), ఇకాలజి (పర్యవరణ శాస్త్రం) .. ఈ రెండూ కలిసికట్టు గా ఉంటూ, ముందుకు సాగగలుగుతాయి అని ఆయన నొక్కిచెప్పారు.  మరి ఈ మార్గాన్ని భారతదేశం ఎంచుకొంది అని ఆయన అన్నారు.  ఆర్థిక వ్యవస్థ బలపడటం తో పాటు మన అడవులు కూడాను గడచిన కొన్ని సంవత్సరాల లో 15 వేల చదరపు కిలోమీటర్ ల మేరకు పెరిగాయి అని ఆయన చెప్పారు.  గడచిన కొన్నేళ్ల లో మన దేశం లో పులుల సంఖ్య రెట్టింపు అయింది, చిరుతల సంఖ్య సైతం సుమారు 60 శాతం మేరకు పెరిగిందన్నారు.

శుద్ధమైన, సమర్థమైన శక్తి వ్యవస్థ లు, ప్రతిఘాతకత్వ శక్తి కలిగిన పట్టణ ప్రాంత మౌలిక సదుపాయాలు, ప్రణాళికబద్ధ పర్యావరణ పునస్స్థాపన లు ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమం లో చాలా ప్రాముఖ్యం కలిగిన భాగం అని ప్రధాన మంత్రి అన్నారు.  పర్యావరణానికి సంబంధించిన అన్ని ప్రయాస ల కారణం గా దేశం లో కొత్త పెట్టుబడి అవకాశాలు ఏర్పడుతున్నాయి, లక్షల కొద్దీ యువజనులు ఉపాధి ని కూడా దక్కించుకొంటున్నారని ఆయన అన్నారు.  వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి నేశనల్ క్లీన్ ఎయర్ ప్లాన్ ద్వారా ఒక సంపూర్ణ విధానం తో భారతదేశం కృషి చేస్తోందని ఆయన అన్నారు.  జల మార్గాల తాలూకు, బహుళ విధ సంధానం తాలూకు పనులు గ్రీన్ ట్రాన్స్ పోర్ట్ రవాణా మిశన్ ను పటిష్టపరచడం ఒక్కటే కాకుండా, దేశం లో లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని కూడాను మెరుగుపరుస్తాయి అని ఆయన అన్నారు.  ప్రస్తుతం, దేశం లో మెట్రో రైలు సేవ 5 నగరాల నుంచి 18 నగరాల కు పెరిగింది, ఇది సొంత వాహనాల వినియోగాన్ని తగ్గించడం లో తోడ్పడింది అని చెప్పారు.  

ప్రస్తుతం, దేశ రైల్వే నెట్ వర్క్ లో చాలా భాగాన్ని విద్యుతీకరించడం పూర్తి అయింది అని ప్రధాన మంత్రి అన్నారు.  దేశం లో విమానాశ్రయాల ను కూడా విద్యుత్తు ను ఉపయోగించే దశ నుంచి సౌర శక్తి ని వినియోగించుకొనే దిశ లో శరవేగం గా మళ్లించడం జరుగుతోంది అని ఆయన చెప్పారు.  2014 వ సంవత్సరం కన్నా ముందు, కేవలం 7 విమానాశ్రయాలు సౌర విద్యుత్తు సదుపాయాన్ని కలిగి ఉండగా ఇవాళ ఈ సంఖ్య 50 కి పైబడింది అని ఆయన వివరించారు.  80 కి పైగా విమానాశ్రయాల లో ఎల్ఇడి లైట్ ల ను అమర్చడమైంది, అవి శక్తి ని ఆదా చేయగలుగుతాయి అన్నారు.  

కేవడియా ను విద్యుత్త వాహన నగరం గా దిద్ది తీర్చేందుకు ఉద్దేశించిన ఒక పథకం గురించి ప్రధాన మంత్రి వివరించారు.  భవిష్యత్తు లో కేవడియా లో బ్యాటరీ ఆధారం గా పనిచేసే బస్సులు, రెండు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మాత్రమే తిరిగేలా అందుకు అనువైన మౌలిక సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకురావడం జరుగుతోంది అన్నారు.  జల మండలం కూడా నేరు గా జలవాయు పరివర్తన తో సంబంధాన్ని కలిగివుంది, జల మండలం లో అసమానత్వం ఏర్పడిందా అంటే అది జల భద్రత ను ప్రభావితం చేస్తుంది అని ఆయన అన్నారు.  జల్ జీవన్ మిశన్ ద్వారా దేశం లో జల వనరుల ను ఏర్పాటు చేయడం, వాటిని పరిరక్షించడం అనేటటువంటి ఒక సమగ్ర దృష్టికోణం తో పని జరుగుతోంది అని ఆయన చెప్పారు.  ఒక పక్క, ప్రతి కుటుంబాన్ని గొట్టాల తో సంధానించడం జరుగుతోందని, మరొక పక్క అటల్ భూజల్ యోజన, వర్షపు నీటి ని ఒడిసిపట్టండి అనే ప్రచార ఉద్యమాల తో భూగర్భ జల మట్టాన్ని పెంచడం పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందన్నారు.

వనరుల ను ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో రీసైక్ లింగ్ కు లోను చేయడం ద్వారా వాటిని చక్కగా వినియోగించుకోగలిగే 11 రంగాల ను ప్రభుత్వం గుర్తించింది అని ప్రధాన మంత్రి ప్రకటించారు.  గత కొన్ని సంవత్సరాల లో, కచ్ రా టు కాంచన్  (చెత్త నుంచి బంగారం) ప్రచార ఉద్యమం పట్ల ఎంతో పని చేయడమైంది, ప్రస్తుతం దీనిని ఉద్యమం తరహా లో చాలా వేగం గా ముందుకు తీసుకుపోవడం జరుగుతోంది అన్నారు.  దీనికి చెందినటువంటి కార్య ప్రణాళిక లో నియంత్రణ సంబంధి అంశాలతో పాటు అభివృద్ధి సంబంధి అంశాలు కలిసి ఉంటాయి; ఈ ప్రణాళిక ను రాబోయే నెలల్లో అమలులోకి తీసుకురావడం జరుగుతుంది అని ఆయన చెప్పారు.  వాతావరణాన్ని పరిరక్షించాలి అంటే పర్యావరణాన్ని పరిరక్షించే దిశ లో మన ప్రయాసల ను సంఘటితపర్చడం చాలా ముఖ్యం అని ఆయన నొక్కిచెప్పారు.  దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి నీరు, గాలి, నేల ల సమతూకాన్ని నిర్వహించడానికి ఐక్యమయిన ప్రయత్నాన్ని చేసినప్పుడే మన తదుపరి తరాల వారికి ఒక సురక్షితమైనటువంటి పరిసరాల ను మనం ఇవ్వగలుగుతాం అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  


 

***


(Release ID: 1724702) Visitor Counter : 303