విద్యుత్తు మంత్రిత్వ శాఖ

క‌న్వ‌ర్జెన్స్ ఎన‌ర్జీ స‌ర్వీసెస్ లిమిటెడ్‌తో ఇ-మొబిలిటీ ఒప్పందంపై సంత‌కాలు చేసిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్‌


భార‌త‌దేశంలోని కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు (సిపిఎస్ఇలు) అత్యధిక విద్యుత్ వాహ‌నాల స‌ముదాయాన్ని క‌లిగిన ఎన్‌హెచ్‌పిసి

Posted On: 05 JUN 2021 12:19PM by PIB Hyderabad

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా మ‌రొక చెప్పుకోద‌గిన అడ‌గువేస్తూ, విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద  ప‌ని చేస్తున్న భార‌త‌దేశపు ప్ర‌ముఖ జ‌ల‌విద్యుత్ కంపెనీ అయిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్, 25 ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు (ఇవిలు) లీజింగ్ కోసం, స్థాప‌న‌, ప్రారంభం స‌హా 3 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ఫాస్ట్ ఛార్జిర్ల కోసం ఎన‌ర్జీ ఎఫిషెయ‌న్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్‌) పూర్తి యాజ‌మాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ అయిన క‌న్వ‌ర్జెన్స్ ఎన‌ర్జీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (సిఇఎస్ఎల్‌)తో ఇ-మొబిలిటీ ఒప్పందాల‌పై సంత‌కాలు చేసింది. కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌లో (సిపిఎస్ఇలు)లో ఐఎన్‌హెచ్‌పిసి వ‌ద్దే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల స‌మూహం ఉంటుంది. ఎన్‌హెచ్‌పిసి ఇంత‌కు ముందు 2019లో ఇఇఎస్ఎల్ నుంచి విద్యుత్ వాహ‌నాల‌ను లీజ్‌కు తీసుకుంది. 
వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా శుక్ర‌వారం నాడు ఇ-మొబిలిటీ ఒప్పందాల‌పై సంత‌కాలు చేశారు. ఎన్‌హెచ్‌పిసి సివిఒ ఎ.కె.శ్రీవాస్త‌వ‌, ఎండి& సిఇఒ మ‌హువా ఆచార్య‌, ఎన‌ర్జీ ఎఫిషెయ‌న్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్‌) ఎగ్జిక్యూటివ్ చైర్ ప‌ర్స‌న్ సౌర‌భ్ కుమార్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప‌ర్యావ‌ర‌ణం దిశ‌గా త‌న అంకిత‌భావం దిశ‌గా ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం 2021 వేడుక‌ల సంద‌ర్భంగా ఎన్‌హెచ్‌పిసి ఇ-మొబిలిటీ ఒప్పందంపై సంత‌కాలు చేసింది. 
ఎన్‌హెచ్‌పిసిలో ఇంధ‌న సామ‌ర్ధ్యం, పొదుపు చ‌ర్య‌లలో అవ‌కాశాన్ని అన్వేషించేందుకు ఎన్‌హెచ్‌పిసి, ఇఇఎస్ఎల్ మ‌ధ్య విస్త్ర‌త‌మైన ఎంఒయు ప్ర‌క్రియ సాగుతోంది. 

 

***


 



(Release ID: 1724693) Visitor Counter : 118