కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19ని సమర్ధంగా ఎదుర్కొని సమస్య నుంచి భారతదేశం బయటపడుతుందన్న ధీమాను వ్యక్తం చేసిన గంగ్వర్ ఐ ఎల్ సి 109వ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన గంగ్వర్
Posted On:
05 JUN 2021 12:33PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కొని సమస్య నుంచి బయటపడి మరింత బలోపేతం కాడానికి భారతదేశం చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేసి విజయం సాధించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పనాశాఖ ( స్వతంత్ర) సహాయ మంత్రి శ్రీ సంతోష్ గంగ్వర్ అన్నారు. అలీన ఉద్యమ దేశాల కార్మికశాఖల మంత్రుల సమావేశంలో గంగ్వర్ ప్రసంగించారు. నిన్న సాయంకాలం వర్చువల్ విధానంలో ఐ ఎల్ సి 109వ సదస్సు జరిగింది. కోవిడ్ ప్రపంచదేశాల్లో అన్ని రంగాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిందని ఆయన అన్నారు. కోవిడ్ వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, జీవనోపాధి తగ్గడంతో ఆర్ధికవ్యవస్థలు మందగించాయని అన్నారు. దీని ప్రభావం బలహీనవర్గాలపై మరింత ఎక్కువగా ఉందని గంగ్వర్ పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొని సమస్య నుంచి బయటపడడానికి ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణ, ఉపాధి కల్పనలాంటి అంశాలపై దృష్టి సారించి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని మంత్రి అన్నారు. కోవిడ్ సమస్యను సమర్ధంగా ఎదుర్కొనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ వాణిజ్య కార్యకలాపాలు సజావుగా సాగడానికి, ఆదాయ భద్రత కల్పించడానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరి సంక్షేమానికి దోహదపడే విధానాల రూపకల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించవలసి ఉంటుందని అన్నారు.
కోవిడ్ ను నివారణ, కట్టడికి ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం భారీ టీకాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని గంగ్వర్ వివరించారు. దీనిలో భాగంగా ఇంతవరకు 22.3 కోట్ల మందికి టీకాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల ప్రజలు, ప్రజల స్థితిగతుల్లో గణనీయమైన మార్పులు రావడమే కాకుండా పని చేసే విధానాల్లో మార్పులకు రంగం సిద్దమయ్యిందని మంత్రి అన్నారు. డిజిటల్ విధానాల వినియోగంవల్ల సమస్యలు ఎదురైనప్పటికి ఉపాథి అవకాశాలు మెరుగు పడ్డాయని మంత్రి వివరించారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు సామజిక భద్రత కల్పించడానికి భారతదేశం చట్టాలను రూపొందించి అమలు చేస్తున్నదని గంగ్వార్ వివరించారు.
ముఖ్యమైన ఉపాధి రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న భారతదేశం వివిధ పథకాలు,కార్యక్రమాలను అమలు చేస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాడని గంగ్వార్ తెలిపారు. ఇదే సమయంలో ఆరోగ్య, ఆర్ధకరంగాల అభివృద్ధి చేయడానికి చర్యలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసి స్వావలంబన సాధించడానికి 27 వేల బిలియన్ కోట్ల రూపాయల వ్యయంతో ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని మంత్రి వివరించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం జీతాలతో 24% ను ఇపిఎఫ్ గా చెల్లిస్తున్నదని అన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో ముద్ర యోజనగా తొమ్మిది వేల బిలియన్ రూపాయలను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఇందులో 70% మంది మహిళల ఖాతాలు ఉన్నాయని వివరించారు.
గ్రామీణ భారతదేశానికి మహాత్మా గాంధీ నరేగా పథకం కింద గత ఆర్థిక సంవత్సరంలోనే 3.9 బిలియన్ పని దినాల ఉపాధి కల్పించామని తెలిపిన మంత్రి దీనివల్ల రోజువారీ వేతనాలు పెరిగాయని అన్నారు.
***
(Release ID: 1724685)
Visitor Counter : 149