ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్‌


24 కోట్ల‌కుపైగా వాక్సిన్ డోస్‌లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు పంపిణీ

వాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌వద్ద అందుబాటులో ఉన్న 1.65 కోట్ల డోస్‌లు

Posted On: 05 JUN 2021 12:13PM by PIB Hyderabad

దేశ వ్యాప్త వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ వాక్సిన్‌లు ఉచితంగా అందించ‌డం ద్వారా మ‌ద్ద‌తు నిస్తోంది. అలాగే రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు వాక్సిన్ డోస్‌ల‌ను నేరుగా స‌మ‌కూర్చుకునేందుకు వెసులుబాటు క‌ల్పిస్తోంది.కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో వాక్సినేష‌న్ అనేది కోవిడ్ అనుకూల ప్ర‌వ‌ర్త‌న‌,టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్ తోపాటు ఎంతో కీల‌కమైన స్తంభంగా ప్ర‌భుత్వం స‌మ‌గ్ర వ్యూహంలో భాగంగా అమ‌లు చేస్తున్న‌ది.
కోవిడ్ -19 కు సంబంధించి స‌ర‌ళీకృత‌, వేగ‌వంత‌మైన 3 వ ద‌శ కోవిడ్ -19 వాక్సినేష‌న్ 2021 మే 1 నుంచి ప్రారంభ‌మైంది.
ప్రస్తుత వ్యూహం కింద‌, ప్ర‌తి నెల కేంద్ర డ్ర‌గ్స్ లేబ‌రెట‌రీ (సిడిఎల్‌) ఆమోదించిన   త‌యారీ దారుకు చెందిన వాక్సిన్ డోస్ లైనా 50 శాతం వ‌ర‌కు ప్ర‌భుత్వం స‌మీక‌రిస్తుంది. ఈ డొస్‌ల‌ను కేంద్ర ప్ర‌భ‌త్వం ఇదివ‌రిక‌టి మాదిరి ఉచితంగా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అందుబాటులో ఉంచుతుంది.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 24 కోట్ల (24,30,080) వాక్సిన్ డోస్‌లను భార‌త ప్ర‌భుత్వం ఉచిత పంపిణీ విధానం ద్వారా , అలాగే నేరుగా రాష్ట్రాలు సేక‌రించుకునే కేట‌గిరిద్వారా స‌మ‌కూర్చింది.

ఇందులో, వృధా అయిన వాటితో క‌లిపి మొత్తం 22,65,08 ,508 డోస్ లు ( ఈ ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం) వాడారు.
1,65 కోట్ల (1,65,00,572) కోవిడ్ వాక్సిన్ డోస్‌లు ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ‌ద్ద వినియోగించ‌డానికి అందుబాటులో ఉన్నాయి.

***



(Release ID: 1724680) Visitor Counter : 146