ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రెండు నెలల కనిష్ఠంగా గత 24 గంటలలో కొత్త కేసులు 1.20 లక్షలు వరుసగా 9 రోజులుగా 2 లక్షలలోపు కేసులు


చికిత్సలో ఉన్న కేసులు 15,55,248; 5 రోజులుగా 20 లక్షలలోపు
23 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాతం 93.38% కు పెరుగుదల
రోజువారీ పాజిటివిటీ శాతం 5.78% కు తగ్గుదల; 12రోజులుగా 10% లోపు
గత 24 గంటలలో 36.5 లక్షలకు పైగా టీకా డోసులు

Posted On: 05 JUN 2021 10:16AM by PIB Hyderabad

దేశంలో గత 24 గంటలలో  1,20,529 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి.  ఇది గత 58 రోజులలో అత్యల్పం. వరుసగా 9రోజులుగా రజుకు 2 లక్షలలోపే కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కేంద్రంతో కలిసి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ఉమ్మడి కృషివలన ఇది సాధ్యమైంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WWSV.jpg

దేశంలో చికిత్సలో ఉన్న కేసులు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య  15,55,248 గా ఉంది. గత 5 రోజులుగా ఈ సంఖ్య 20 లక్షలలోపే ఉంటోంది.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు 80,745 తగ్గాయి. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవి   5.42%.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002E013.jpg

వరుసగా 23వ రోజుకూడా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. గత 24 గంటలలో 1,97,894  మంది కోలుకున్నారు. అంతకుముందు రోజు కంటే 77,365 మంది అదనంగా కోలుకోవటం గమనార్హం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FEIG.jpg

మొత్తం ఇప్పటిదాకా కోవిడ్ బారిన పడినవారిలో 2,67,95,549 మంది కోలుకోగా గత 24 గంటలలో కోలుకున్నవారు 1,97,894 మంది. దీంతో మొత్తం కోలుకున్నవారి 93.38% కి పెరిగింది.  గత 24 గంటలలో 20,84,421 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా జరిపిన పరీక్షల సంఖ్య  36,11,74,142 కు చేరింది.  ఒకవైపు దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య పెరుగుతూ ఉండగా వారపు పాజిటివిటీ తగ్గుతున్న ధోరణి కనబడుతోంది. ప్రస్తుతం వారపు పాజిటివిటీ 6.89% కాగా రోజువారీ పాజిటివిటీ 5.78% గా నమోదైంది. 12 రోజులుగా ఇది 10% లోపే ఉంటూ వస్తోంది.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IJ4C.jpg

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన మొత్తం టీకా డోసుల సంఖ్య 22.78 కోట్లు దాటింది. గత 24 గంటలలో  36,50,080 టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇప్పటివరకు 32,00,677 శిబిరాల ద్వారా 22,78,60,317 డోసుల పంపిణీ జరిగినట్టు ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది.  అందులో:

 

 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,45,863

రెండో డోస్

68,41,480

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,60,57,349

రెండో డోస్

86,38,798

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,59,69,460

రెండో డోస్

1,19,137

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,97,94,194

రెండో డోస్

1,11,93,705

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,01,85,472

రెండో డోస్

1,91,14,859

మొత్తం

22,78,60,317

 

***



(Release ID: 1724657) Visitor Counter : 162