సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా "ఒయాసిస్ ఆఫ్ హోప్‌" అనే పేరుతో, ఒక చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్న - ఫిల్మ్స్ డివిజన్

Posted On: 04 JUN 2021 12:05PM by PIB Hyderabad

ఇది ప్రతి ఖండంలో మరియు ప్రతి మహాసముద్రంలో పర్యావరణ వ్యవస్థ క్షీణతను నివారించి, ఆపి, తిప్పికొట్టాలనే ఆశయంతో, 2021 జూన్, 5వ తేదీన, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, "పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ" అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం వేడుకలకు - "తిరిగి ఊహించు, పునర్నిర్మించు,  పునరుద్ధరించు" అనే పదాల ను కీలకాంశాలు గా నిర్ణయించారు.  అదే స్ఫూర్తితో, ఫిల్మ్స్ డివిజన్, 2021 జూన్, 5, 6వ తేదీలలో పర్యావరణంపై "ఒయాసిస్ ఆఫ్ హోప్‌" అనే పేరుతో ఒక చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది.

2 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో పర్యావరణాన్ని పునరుద్ధరించడం తో పాటు,  మానవుడు మరియు ప్రకృతి యొక్క విడదీయరాని సంబంధాన్ని పునరుద్ధరించడానికి వివిధ మార్గాలను సూచించడం ద్వారా ప్రకృతితో సహజీవనాన్ని పునరుద్ధరించాలనే బలమైన సందేశాన్ని ఇచ్చే చిత్రాలను ప్రదర్శించనున్నారు.  ఫిల్మ్స్ డివిజన్ వెబ్‌-సైట్‌ మరియు యు-ట్యూబ్ ఛానెల్‌ ద్వారా ఈ చిత్రాలను ప్రదర్శిస్తారు. 

ప్రత్యేకమైన ‘గ్రీన్ ప్యాకేజీ’లో ప్రదర్శించే చిత్రాలు: 

"ది జంగిల్ మ్యాన్ లోయా" (21 నిమిషాలు / ఫర్హా ఖాన్) - మణిపూర్ లోని చిన్న కొండ ప్రాంతానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు లోయా న్గాంబ కథను ఈ చిత్రంలో ప్రముఖంగా పేర్కొన్నారు. దట్టమైన అడవిని నిర్మించాలనే లక్ష్యంతో, ఆరు సంవత్సరాలు, లోయా కొండపై ఒంటరిగా ఉండి, దాదాపు ఖాళీ ప్రదేశం నుండి ప్రారంభించి, స్థానిక సమాజానికి ఒక హరిత స్థలాన్ని సృష్టిస్తాడు.  ఇది ప్రకృతి తో మనిషికి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించి, శాంతియుత సహజీవనం అనే సంస్కృతి ని నిర్మించాలన్నదే ఈ కథ ఇతివృత్తం. 

"లివింగ్ ది నేచురల్ వే" (76 నిమిషాలు /  సంజీవ్ పరాసర్) - మారుతున్న వాతావరణం మరియు పర్యావరణం, ఒక చిన్న బ్రహ్మపుత్ర ద్వీపం లో నివసిస్తున్న మిషింగ్ తెగల సాంప్రదాయ జీవన విధానాన్ని ఎలా ఛిద్రం చేసిందీ, ఎలాంటి సవాలు విసిరిందీ ఈ  చిత్రంలో వివరించడం జరిగింది. 

సాలుమరద తిమక్క  - గ్రీన్ క్రూసేడర్ (43 నిమిషాలు /  పి.రాజేంద్రన్) - ఎటువంటి ప్రాథమిక విద్య లేని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక స్వీయ బోధన పర్యావరణవేత్త జీవితం గురించి ఈ చిత్రంలో పేర్కొన్నారు.  రహదారి పక్కన వందలాది మొక్కలు నాటడం ద్వారా, సాలుమరద తిమక్క, ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలకు ఒక ఆదర్శ మూర్తిగా పరిగణించబడుతుంది. 

క్లైమేట్ చేంజ్ (14 నిమిషాలు / పి. ఎల్లప్పన్) - గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పుల ప్రమాదాలను వివరించే చిత్రం.

మై సన్ నియో (15 నిమిషాలు / ఇంగ్లీష్ / ఎస్. షణ్ముగనాథన్) - సహజ వాతావరణం మధ్య,  అన్ని జీవులను ప్రేమిస్తూ, ఐదేళ్ళ బాలుడు, ఇతరులకు ఒక ఆదర్శంగా,  ఎలా పెరుగుతాడో స్పష్టంగా చిత్రీకరించిన చిత్రం,

ప్లాస్టిక్ వరల్డ్ (7 నిమిషాలు / సంగీతం / పౌశాలి గంగూలి) - ప్లాస్టిక్ వ్యర్థాలతో కప్పబడి, జల వనరులు లేని, అసమగ్రమైన పరిస్థితులతో కూడిన విస్తారమైన భవిష్యత్ ప్రకృతి దృశ్యాన్ని ఆవిష్కరించడంతో పాటు, మానవ జీవితం, పర్యావరణంపై ప్లాస్టిక్ యొక్క ప్రమాదకర ప్రభావాలకు వ్యతిరేకంగా కూడా హెచ్చరిస్తూ, చిత్రీకరించిన యానిమేషన్ చిత్రం. 

ఈ ఉత్సవాన్ని www.filmsdivision.org/“ డాక్యుమెంటరీ ఆఫ్ ది వీక్” మరియు https://www.youtube.com/user/FilmsDivision అనే వెబ్-సైట్ ల ద్వారా 2021 జూన్ నెల 5వ తేదీ మరియు 6వ తేదీలలో రోజంతా వీక్షించవచ్చు. 

 

*****



(Release ID: 1724478) Visitor Counter : 208