మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

‘జెజె చట్టం-2015’ నిర్దేశిత విధివిధానాల మేరకు కోవిడ్‌ మహమ్మారి


దుష్ప్రభావ పీడిత బాలల పోషణ-సంరక్షణకు భరోసా ఇవ్వాలని రాష్ట్రాలు/యూటీలకు కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశం

ఆర్తులైన బాలల ప్రయోజనాల దిశగా తీసుకోవాల్సిన చర్యల జాబితా జారీ;

నాడు పోస్టు చేయడమైనది: 03 JUN 2021 6:19PM by PIB Hyderabad

   దేశంలో కోవిడ్‌ మహమ్మారి దుష్ప్రభావ పీడిత బాలల పోషణ-సంరక్షణకు భరోసా దిశగా ‘బాలల న్యాయ (జెజె) చట్టం-2015’ నిర్దేశిత విధివిధానాల మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ (డబ్ల్యూసీడీ) అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రామ్‌ మోహన్‌ మిశ్రా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల పాలనాధిపతులకు లేఖ రాశారు. ఆర్తులైన అటువంటి బాలలందర్నీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల భద్రత ఛత్రం కిందకు తేవడం కోసం నిరంతరాయంగా కృషిచేయాలని అందులో సూచించారు.

   మహమ్మారి సమయంలో పిల్లల ప్రధాన ప్రయోజనాలకు భరోసా ఇచ్చేవిధంగా వారి అవసరాలు, వనరులను గుర్తించడంతోపాటు జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల వారి వ్యక్తిగత అవసరాలకు తగిన వనరులు పొందే వీలు కల్పించవచ్చునని తెలిపింది. ఆపన్నులైన బాలలకు కీలక ప్రయోజనాల లభ్యత దిశగా  సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు, అన్ని స్థాయులలోని భాగస్వామ్య సంస్థల కృషి ఏకోన్ముఖంగా సాగేవిధంగా అప్రమత్తం కావాలని సలహా ఇచ్చింది. ఆ మేరకు భద్రత వలయం నుంచి ఈ బాలల్లో ఏ ఒక్కరూ జారిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

   ఈ మేరకు తీసుకోవాల్సిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకోవాల్సిన చర్యలు కిందివిధంగా ఉన్నాయి:

  1. బాలల గుర్తింపు – వివరాల నమోదు:

ఎ. అన్వేషణ, అధ్యయనం వగైరాల ద్వారా ఆపన్నులైన బాలల గుర్తింపు

బి. బాలల్లో ప్రతి ఒక్కరి వివరాలు, వారి ప్రత్యేక అవసరాలు, ఆవశ్యకతల సమగ్ర నమోదుతో గణాంక నిధిని సృష్టించాలి. ‘జెజె చట్టం-2015’ నిర్దేశానికి అనుగుణంగా ఆయా బాలల గుర్తింపుతోపాటు ఇతర వివరాలన్నిటినీ అధికార యంత్రాంగం భద్రంగా, గోప్యంగా ఉంచాలి.

సి. బాలల్లో ప్రతి ఒక్కరి గణాంక సమాచారాన్ని భారత ప్రభుత్వ ‘ట్రాక్‌ చైల్డ్‌ పోర్టల్‌’కు తప్పనిసరిగా అప్‌లోడ్‌ చేసేలా చూడాలి.

  1. నిఘా - రక్షణ:

ఎ. ఆస్పత్రుల రిసెప్షన్లుసహా ఇతరత్రా ప్రాధాన్యంగల ప్రదేశాలన్నిటా ‘బాలల సంరక్షణ కమిటీలు’, ‘బాలల సహాయ కేంద్రం’ సంప్రదింపు నంబరు (1098) వివరాలు  ప్రముఖంగా కనిపించేలా శ్రద్ధ వహించాలి.

బి. బాలలపై బాలకార్మిక, బాల్యవివాహ, బాలల అక్రమ రవాణా, అక్రమ దత్తత తదితర నేరాల నిరోధం దిశగా పరిస్థితులు, పరిణామాలను పసిగడుతూ, పర్యవేక్షించేలా పోలీసు శాఖను అప్రమత్తం చేయాలి.

సి. ఆపన్నులైన బాలల విషయంలో తదుపరి చర్యలు, క్రమబద్ధ పర్యవేక్షణ నిమిత్తం వారి గణాంక నిధిని సృష్టించాలి.

డి. బాలల కోసం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని వారి తల్లిదండ్రుల పేరిటగల రుణ బకాయిలు/ఇతర రుణబాధ్యతలకు సర్దుబాటు చేయకుండా తగిన చర్యలు చేపట్టాలి.

  1. అత్యవసర సంరక్షణ - పునరావాసం:

ఎ. ఆస్పత్రులలో బాలల సంబంధిత ప్రవేశ ఫారాలు నింపే సమయంలో రోగులకు విశ్వసనీయ వ్యక్తి వివరాల సేకరణకు ఆదేశాలివ్వాలి. తద్వారా ఏదైనా అవాంఛనీయ పరిస్థితి తలెత్తినపుడు బాలల సంరక్షణ దిశగా వారిని సంప్రదించే వీలుంటుంది.

బి. బాలల రక్షణ సేవల పథకం కిందగల ప్రస్తుత బాలల శరణాలయాల్లో తక్షణ, తాత్కాలిక పునరావాస కల్పనకు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలి.

సి. ప్రతి జిల్లాలోనూ పిల్లల, నవజాత శిశువుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలి.

  1. శిశు సంరక్షణ సంస్థల (సీసీఐ) ద్వారా వ్యవస్థాగత మద్దతు:

ఎ. అన్ని బాలల సంరక్షణ (ప్రభుత్వ సహాయంతో ఇతర సంస్థలు నిర్వహించే) సంస్థలలో సంరక్షణ ప్రమాణాల అంచనా నిమిత్తం, అక్కడ ఆశ్రయం పొందిన బాలల శ్రేయస్సుకు భరోసా దిశగా జిల్లా కలెక్టర్ల సహకారంతో ప్రత్యేక తనిఖీ కార్యక్రమాలు నిర్వహించాలి.

బి. బాలలందరికీ ఆరోగ్యకర, పరిశుభ్ర జీవన పరిస్థితులతోపాటు ప్రాథమిక సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, భద్రత తదితర సముచిత సౌకర్యాలన్నీ కల్పించే విధంగా అన్ని బాలల సంరక్షణ సంస్థలనూ ఆదేశించాలి.

సి. కోవిడ్‌తో బాధపడుతున్న బాలల సంరక్షణ దిశగా అన్ని బాలల సంరక్షణ సంస్థలలో తగిన ఏకాంత చికిత్స సదుపాయాలను కల్పించాలి.

డి. బాలల మానసిక నిపుణులు, సలహాదారులు వంతులవారీగా బాలల సంరక్షణ సంస్థలను సందర్శించి, వారితో మమేకమయ్యేలా కార్యక్రమం రూపొందించాలి.

ఇ. ఆపన్నులైన బాలల మానసిక-సామాజిక సంరక్షణ/మద్దతు కోసం తగిన నిపుణులతో కూడిన స్థానిక సహాయ కేంద్రం నంబరును ప్రారంభించాలి.

  1. జిల్లా కలెక్టర్‌ - అధికార యంత్రాంగం సంరక్షక పాత్ర:

ఎ. కోవిడ్‌ దుష్ప్రభావ పీడిత దుర్బల బాలలకు జిల్లా కలెక్టర్‌ ప్రధాన సంరక్షకులుగా ఉండాలి.

బి. అటువంటి బాలలకు ‘జెజె చట్టం-2015’ నిర్దేశానికి అనుగుణంగా దిగువ సూచించిన క్రమంలో పునరావాసం కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌ చర్యలు చేపట్టాలి:

  1. విస్తృత కుటుంబం, బంధుమిత్రులతో బాలల బంధం పునరుద్ధరణ... పునరావాసం
  2. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఏఆర్ఏ) నిర్వహణలోని ‘కేరింగ్స్‌’ పోర్టల్‌ ద్వారా (చట్టపరంగా దత్తతకు వీలున్న బాలలుగా బాలల సంరక్షణ కమిటీ గుర్తించిన పక్షంలో) దత్తత
  3. ప్రభుత్వం ఆమోదంగల బాలల సంరక్షణ సంస్థల ద్వారా...

సి. బాధిత బాలల అవసరాల గుర్తింపు, ప్రగతిపై పర్యవేక్షణసహా అన్ని ప్రయోజనాలు వారికి దక్కేవిధంగా చూడటం కోసం జిల్లాస్థాయిలో బహుళ విభాగ కార్యాచరణ బృందం ఏర్పాటు

డి. జిల్లాలో ఎక్కడైనా దుస్థితిలోగల బాలలను గమనిస్తే బాలల సంరక్షణ కమిటీ లేదా జిల్లా బాలల రక్షణ విభాగానికి తక్షణం తెలియపరిచాల్సిందిగా అన్ని పౌరసంఘాలు, సంస్థలకు సూచన.

ఇ. కుటుంబ/పూర్వీకుల ఆస్తులపై బాలల హక్కుకు జిల్లా కలెక్టర్లు రక్షణ కల్పించాలి. ఆ మేరకు సదరు ఆస్తుల అమ్మకం, ఆక్రమణలకు తావులేకుండా చూడాలి. రిజిస్ట్రేషన్‌/రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ద్వారా వాటి నిర్వహణ బాధ్యత స్వీకరించాలి.

  1. ‘సీసీఐ’ల ద్వారా సంస్థాగత మద్దతు:

ఎ. తల్లిదండ్రులు కోవిడ్ పీడితులైన పక్షంలో వారి పిల్లలకు విస్తృత కుటుంబం, బంధుమిత్రుల రక్షణ లేనిపక్షంలో ఆ బాలల సంరక్షణ బాధ్యతను తాత్కాలికంగా అప్పగించి బాలల సంరక్షణ సంస్థలకు (సీసీఐ) అప్పగించి, అవసరమైన సహాయం అందించాలి.

బి. జిల్లాలోని సీసీఐలలో బాలలకు సముచిత ఆశ్రయ పునరుద్ధరణ/పునరావాసానికి భరోసా ఇచ్చేలా అధికారుల బృందం ద్వారా క్రమబద్ధ పర్యవేక్షణ చేపట్టాలి.

  1. పోలీసు శాఖ:

ఎ. బాలలపై బాలకార్మిక, బాల్యవివాహ, బాలల అక్రమ రవాణా, అక్రమ దత్తత వంటి నేరాలతోపాటు వారిపై ఇతరత్రా అఘాయిత్యాల నిరోధం దిశగా జిల్లా పోలీసు బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

బి. బాలల దత్తతపై సామాజిక మాధ్యమాల్లో అన్నిరకాల ప్రకటనల మూలాలను పసిగట్టి, సదరు ప్రకటనకర్తలు దోషులని తేలితే వారిపై చర్యలు చేపట్టాలి.

సి. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు తనిఖీ/రాత్రి గస్తీ వంటి బాధ్యతల్లో ఉన్నపుడు బాలలు ఆశ్రయం పొందిన సీసీఐలు, ఇతర సంభావ్య ముప్పున్న ప్రదేశాలపై పటిష్ఠ నిఘా ఉంచాలి.

  1. పంచాయతీ రాజ్/పట్టణ స్థానిక సంస్థలు:

ఎ. దురవస్థలోగల బాలలను గుర్తించి, జిల్లా యంత్రాంగం/జిల్లా బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం ఇవ్వడం కోసం పంచాయతీల స్థాయిలో బాలల సంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలి.

బి. దుస్థితిలోగల బాలల కోసం ప్రకటించిన పథకాలు, తీసుకుంటున్న చర్యలపై పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ పాలన మండళ్లకు సమాచారం ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు అవగాహన, పునశ్చరణ కార్యక్రమాలను నిర్వహించాలి.

  1. విద్య:

ఎ. ప్రభుత్వం నడిపే పాఠశాలలు లేదా ఆశ్రమ పాఠశాలల్లో అనాథ బాలలందరి ఉచిత విద్యాభ్యాసానికి చర్యలు చేపట్టాలి.

బి. బాలల అవసరాన్ని బట్టి విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12 (1) (సి) కింద సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో కూడా చేర్పించవచ్చు.

సి. అర్హులైన అనాథ బాలలకు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉపకారవేతన పథకాలను వర్తింపజేసేందుకు చర్యలు చేపట్టవచ్చు.

డి. అవసరమైతే ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం (పీఎంకేవీవై) కింద వృత్తిపనుల్లో శిక్షణ కూడా ఇప్పించవచ్చు.

  1. వైద్య సదుపాయాలు:

ఎ. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జనారోగ్య యోజన’ కింద, ఆ పథకం మార్గదర్శకాలకు తగినట్లుగా అర్హులైన బాలలకు ఆరోగ్య బీమా రక్షణ కల్పించవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 1724273) సందర్శకుల సూచీ సంఖ్య : : 228
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam