రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళం & భారతీయ కోస్ట్ గార్డ్ కోసం 11 విమానాశ్రయ నిఘా రాడార్ల కొనుగోలుకు ఒప్పందంపై సంతకం చేసిన రక్షణ శాఖ
Posted On:
03 JUN 2021 3:50PM by PIB Hyderabad
భారతీయ నావికాదళం, భారతీయ కోస్ట్‌గార్డ్ కోసం నిక్కచ్చైన ప్రత్యక్ష సమాచారాన్ని అందించగల 11 మోనోపల్స్ సెకెండరీ నిఘా రాడార్ కలిగిన విమానాశ్రయ నిఘా రాడార్ల కొనుగోలు కోసం ఎం/ఎస్ టెలి ఫోనిక్ ఇంటిగ్రేడెట్ సిస్టంస్ లిమిటెడ్, ముంబైతో రక్షణ మంత్రిత్వ శాఖ 03 జూన్ 2021న ఒప్పందంపై సంతకాలు చేసింది. రూ.323.47 కోట్ల విలువైన ఈ కొనుగోలు బై అండ్ మేక్ శ్రేణి కింద చేస్తున్నారు.
ఈ రాడార్ల సంస్థాపన విమానాశ్రయాల చుట్టూ వైమానిక పరిధి గురించిన అవగాహనను పెంచడమే కాక, భారతీయ నావికాదళం, భారతీయ కోస్ట్‌గార్డ్ వైమానిక కార్యకలాపాల సామర్ధ్యాన్ని, భద్రతను పెంచుతుంది.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ఆ కార్యక్రమంలో పొందుపరిచిన లక్ష్యాల దిశగా ప్రభుత్వ సాధించిన విజయానికి ఈ ఒప్పందం ఒక సంకేతం. ఇది సాంకేతిక పరిజ్ఞానాన్నిగ్రహించడానికి, నైపుణ్యాల అభివృద్ధి, దేశీయ ఉత్పత్తి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఇది సాధికారికతను ఇస్తుంది.
***
(Release ID: 1724147)
Visitor Counter : 196