విద్యుత్తు మంత్రిత్వ శాఖ

విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చును తగ్గించేలా స్వదేశీ బొగ్గు వినియోగంలో సౌలభ్యతకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అనుమతి


విద్యుత్ వినియోగదారుల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రయోజనకర చర్య
బొగ్గు దిగుమతుల తగ్గింపు, ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా అడుగు

Posted On: 03 JUN 2021 3:59PM by PIB Hyderabad

విద్యుత్ ఉత్పత్తి వ్యయాలను తగ్గించే లక్ష్యంతో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మధ్య దేశీయ బొగ్గును ఉపయోగించుకునే  సౌలభ్యాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ సౌలభ్యం ద్వారా; విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు, 'కేస్‌-2 సినారియో-4' విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తమ లింకేజీ దేశీయ బొగ్గును రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. ఈ పొదుపు మొత్తం విద్యుత్‌ వినియోగదారులకు బదిలీ అవుతుంది.
    
    ప్రస్తుతానికి పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ప్రజలు దీని నుంచి లబ్ధి పొందుతారు. ఒక్క పంజాబ్‌లోనే ఈ ప్రయోజనం ఏడాదికి రూ.300 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

    విదేశాల నుంచి బొగ్గు దిగుమతులను ఇది తగ్గిస్తుంది, 'ఆత్మనిర్భర్ భారత్'కు అనుగుణంగా ఉంటుంది. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో తక్కువ 'స్టేషన్ హీట్ రేట్‌'తో మరింత సమర్థవంతంగా బొగ్గును ఉపయోగించుకోవడం వల్ల కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయి.

    స్వదేశీ బొగ్గు వినియోగంలో సౌలభ్యత కింద; కేస్‌-2 సినారియో-4 కింద పోటీ బిడ్డింగ్‌ ద్వారా ఏర్పాటు చేసిన ప్లాంట్లలో తమ సమగ్ర లింకేజీ బొగ్గును, అంటే "అగ్రిగేటెడ్‌ యాన్యువల్‌ కాంట్రాక్ట్ క్వాంటిటీ"ని (ఏఏసీక్యూ) రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.

    'నెట్‌ హీట్‌ రేట్‌' ఆధారంగా, వేలం పద్ధతిలో కేస్-2 సినారియో-4 విద్యుత్ ప్లాంట్లను నిర్మించారు. ఈ కేంద్రాల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును ఆ రాష్ట్రానికి మాత్రమే సరఫరా చేస్తారు. విద్యుత్‌ చట్టం-2003లోని సెక్షన్‌ 63 కింద, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి వేలం ప్రక్రియ ద్వారా ఈ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.

    లింకేజీ బొగ్గును రాష్ట్రం బదిలీ చేసేటప్పుడు, ఆ విద్యుత్‌ కేంద్రాలు ప్రభుత్వ యాజమాన్యంలోని ప్లాంట్ల కంటే తక్కువ ఖర్చుతో విద్యుత్‌ ఉత్పత్తి చేసేవి అని నిర్ధరించుకోవచ్చు. దీనివల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చు ఆదా అవుతుంది. ఈ మొత్తం పొదుపులు డిస్కమ్‌లకు, తద్వారా వినియోగదారులకు బదిలీ అవుతాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయా రాష్ట్రాలకు సరఫరా చేసే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి మాత్రమే బదిలీగా వచ్చిన బొగ్గును ఉపయోగించుకుంటాయి.
 

***



(Release ID: 1724141) Visitor Counter : 104