ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
03 JUN 2021 9:39AM by PIB Hyderabad
కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం కొనసాగుతోంది. ఇండియాలో క్రియాశీల కేసులు మరింత తగ్గి 17,13,413 కు చేరాయి.
గత 24 గంటలలో క్రియాశీల కేసులు 80,232 తగ్గాయి.
గత 24 గంటలలో దేశంలో 1.34 లక్షల రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారి కొత్త కేసుల తగ్గుదల కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.64 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 2,11,499 మంది పేషెంట్లు కోలుకున్నారు.
వరుసగా 21 వ రోజు కూడా రోజువారీ కొత్త కేసుల కన్న కోవిడ్ నుంచి కోలుకున్న వారు ఎక్కువ మంది ఉన్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం క్రమంగా 92.79 శాతానికి పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 7.66 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 6.21 శాతంగా ఉంది. వరుసగా 10 వరోజు ఇది 10 శాతం కంటే తక్కువగా ఉంది.
కోవిడ్ పరీక్షల సామర్ధ్యం గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35.3 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్త వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 22.10 కోట్ల వాక్సిన్‌డోస్ లను వేశారు . గత 24 గంటలలో 22 లక్షల కన్నా ఎక్కువమందికి వాక్సిన్ వేశారు.
***
(Release ID: 1724041)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam