శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొత్త ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ తో- నడిచే ఎక్స్రే సేతు ప్లాట్‌ఫాం ముందస్తు కొవిడ్ నిర్ధారణ వివరాలను వాట్సప్ ద్వారా తెలియజేస్తుంది.
Posted On:
02 JUN 2021 9:30AM by PIB Hyderabad
కొత్త ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్- టెక్నాలజీతో నడిచే ఎక్స్రేసేతు ప్లాట్‌ఫాం ముందస్తు కొవిడ్ పరీక్షల సమాచారాన్ని అందజేస్తుంది. ఈ విధానంలో వాట్సప్ ద్వారా ఛాతీ ఎక్స్-రేలను పరిశీలించడం ద్వారా డాక్టర్లు కొవిడ్–19 ను వేగంగా అంచనా వేయగలుగుతారు. ఎక్స్రేసేతు అని పిలిచే ఈ సొల్యూషన్ ద్వారా తక్కువ-రిజల్యూషన్ చిత్రాలను మొబైల్స్ ద్వారా పంపినా స్పష్టంగా చూడటం వీలవుతుంది. ఇది ఉపయోగించడానికి సులభమైనది. వేగవంతమైనది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధిలను త్వరగా గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. కొవిడ్ 19 భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వినాశనాన్ని కొనసాగిస్తున్నందున, వేగంగా పరీక్షల నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రత్యేకమైన కంటైన్మెంట్ జోన్‌లను సృష్టించడం చాలా క్లిష్టమైనది. కొన్ని నగరాల్లో ఇటువంటి పరీక్షలు వారానికి పైగా తీసుకుంటున్న సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు చేయడం మరింత కష్టం. ఆర్టీపీసీఆర్పరీక్షలు కొన్ని వేరియంట్‌లకు ‘ఫాల్స్ నెగటివ్’ రిపోర్టులను ఇస్తున్నందున సులభమైన ప్రత్యామ్నాయ పరీక్షలు అవసరం.
ఆర్టిపార్క్ (ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ & రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్) అనే లాభాపేక్ష లేని ఫౌండేషన్ ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సహకారంతో స్థాపించారు. బెంగళూరుకు చెందిన హెల్త్టెక్ స్టార్టప్ నిరామై, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) లతో కలిసి ఎక్స్రే సేతును డెలప్చేసింది. వాట్సాప్ ద్వారా పంపిన తక్కువ- రిజల్యూషన్ ఉన్న చెస్ట్ ఎక్స్-రే చిత్రాల నుండి కూడా కొవిడ్ పాజిటివ్ రోగులను గుర్తించడానికి ఈ ప్రత్యేక విధానాన్ని అభివృద్ధి చేసింది. సమీక్షల కోసం డాక్టర్లు తయారు చేసిన ప్రభావిత ప్రాంతాల సెమాంటిక్ అనోటేషన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఫలితంగా ఇతర పద్ధతుల్లోనూ సులభంగా ధృవీకరించడంలో సహాయపడుతుంది. ఇప్పటికే భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన 1200లకుపైగా రిపోర్టులను పరిశీలించారు.
ఆరోగ్య పరీక్ష నిర్వహించడానికి, ఏ వైద్యుడైనా www.xray.com ని సందర్శించి, ‘ఉచిత ఎక్స్‌రేసెట్ బీటాను ప్రయత్నించండి’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే ఆ వెబ్సైట్ మనల్ని మరో పేజీకి మళ్ళిస్తుంది. దీనిలో అతను లేదా ఆమె వెబ్ లేదా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా వాట్సాప్ ఆధారిత చాట్‌బాట్‌తో సంభాషించవచ్చు. లేదా ఎక్స్‌రేసెతు సేవను ప్రారంభించడానికి డాక్టర్ +91 8046163838 అనే ఫోన్ నంబర్‌కు వాట్సాప్ సందేశాన్ని పంపవచ్చు. అప్పుడు వారు రోగి ఎక్స్-రే చిత్రాన్ని క్లిక్ చేసి, కొన్ని నిమిషాల్లో ఉల్లేఖన చిత్రాలతో 2 పేజీల ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్‌లను తీసుకోవాలి. వెంటనే కొవిడ్-19 సంక్రమణ సంభావ్యత తెలుస్తుంది. వైద్యుడు త్వరగా బాధితుడిని పరిశీలించడానికి స్థానికీకరించిన హీట్‌మ్యాప్‌ను కూడా ఈ నివేదిక చూపిస్తుంది. బ్రిటన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుండి తీసుకున్న 1,25 000 కి పైగా ఎక్స్-రే చిత్రాలను ఈ విధానంలో పరీక్షించి ధృవీకరించారు. అలాగే 1000+ పైగా భారతీయ కొవిడ్ రోగుల వివరాలను నిర్ధారించడంలోనూ అద్భుతమైన పనితీరును చూపించింది: 98.86శాతం సెన్సివిటీ, 74.74శాతం స్పెసిఫిసిటీ కనిపించింది.
ఆర్ట్పార్క్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉమాకాంత్ సోని మాట్లాడుతూ, “మనదేశంలో 136 కోట్ల మంది అవసరాలను తీర్చడానికి మేము సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. ప్రత్యేకించి మనకు పది లక్షల మందికి కేవలం ఒకే రేడియాలజిస్ట్ ఉన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సహకారంతో నిర్మించిన ఎక్స్‌రేసేతు ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వంటి టెక్నాలజీలు గ్రామీణ భారతదేశానికి అత్యాధునిక ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత తక్కువ ఖర్చుతో అందించడానికి మార్గం సుగమం చేస్తాయి”అని అన్నారు. ‘‘ఎక్స్-రే యంత్రాలకు ప్రాప్యత ఉన్న గ్రామీణ వైద్యుల కోసం వేగవంతమైన కొవిడ్ స్క్రీనింగ్ పద్ధతిని అందించడానికి నీరమ్ ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ఆర్ట్పార్క్ ఐఐఎస్సీ లతో భాగస్వామ్యం చేసుకుంది. కొవిడ్-19 సంక్రమణను సూచించే రోగికి ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి ఛాతీ ఎక్స్రే స్వయంచాలక వివరణను ఎక్స్రే సేతు అందిస్తుంది ”అని నిరామై వ్యవస్థాపకురాలు, సీఈఓ డాక్టర్ గీతా మంజునాథ్ అన్నారు. "కొవిడ్ పాజిటివ్ ఎక్స్-రే చిత్రాలు లేనప్పుడు వాడేందుకు, మేము ఒక ప్రత్యేకమైన ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేశాం. అందుబాటులో ఉన్న ఎక్స్-రే చిత్రాల ద్వారా ఊపిరితిత్తులను పరిశీలిస్తుంది. దీనికి అంచనా శక్తి చాలా ఎక్కువ. ఇన్ఫెక్షన్ ఉన్న ఊపిరితిత్తుల్లో పరిస్థితుల ఆధారంగా కాన్ఫడెన్స్ స్కోరు విధానాన్ని కూడా డెవెలప్ చేశాం. సిస్టమ్ పరీక్ష ఒక అంచనాకు వచ్చి ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను స్థానికీకరిస్తుంది. కొన్ని నిమిషాల్లోనే కాన్ఫడెన్స్ స్కోరు ఇచ్చే నివేదికను రూపొందిస్తుంది ”అని ఐఐఎస్సీ ప్రొఫెసర్ చిరంజీవి భట్టాచార్య అన్నారు.
ఈ ప్లాట్ఫామ్ కొవిడ్-19 తో పాటు న్యూమోనియాతో సహా 14 అదనపు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను కూడా గుర్తించగలదు. ఎక్స్రే సేతును అనలాగ్ తోపాటు డిజిటల్ ఎక్స్‌రే రెండింటికీ ఉపయోగించవచ్చు గత 10 నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి పైగా వైద్యులు విజయవంతంగా ఈ విధానాన్ని ఉపయోగించారు. ఎక్స్రేసేతు వంటి సాంకేతికతలు సంచార ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎంతో కీలకం. ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్- ఆధారిత వ్యవస్థ ఇది గ్రామీణ భారతదేశం అంతటా ఆరోగ్య సంరక్షణను తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెస్తుంది. ఎక్స్రే ప్రారంభ సలహాదారుగా, వినియోగదారుగా పనిచేసిన కేఎంసీ ప్రొఫెసర్ & హెచ్ఓడి కార్డియాలజీ డాక్టర్ పద్మనాబ్ కామత్ మాట్లాడుతూ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాలు ఆరోగ్య సంరక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరుపేద గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్తాయని చెప్పారు. ఈ సేవను మొదట్లో ఉపయోగించిన కర్ణాటకలోని షిమోగాలోని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కొవిడ్ రోగులను ఈ సాంకేతికత త్వరగా గుర్తిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. డ్రగ్ డిజైన్, ఆరోగ్య రంగం, టెలిమెడిసన్ సవాళ్లను పరిష్కరించడానికి డీఎస్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, సెన్సార్లు ఇతర సాధనాలతో నిర్మించిన అనేక సైబర్ -ఫిజికల్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయని డిఎస్టి కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ -ఫిజికల్ సిస్టమ్స్ (ఎన్ఎమ్-ఐసిపిఎస్) కింద ప్రారంభించిన ఆర్టిపార్క్, గ్రామీణ ప్రాంతాల వైద్యులందరికీ ఈ ఉచితంగా సేవలు అందించడానికి సి-డిఎసి (ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ సూపర్ కంప్యూటర్ పరాంసిడ్డిని పెంచడానికి), ఎన్విడియా & ఎడబ్ల్యుఎస్ వంటి మౌలిక సదుపాయాల భాగస్వాములతో కలసి పనిచేస్తోంది. మరిన్ని వివరాల కోసం, ఆర్ట్పార్క్ వ్యవస్థాపకుడు సీఈఓ మిస్టర్ ఉమాకాంత్ సోనిని umakant@artpark.in ద్వారా సంప్రదించవచ్చు.
***
(Release ID: 1724003)
Visitor Counter : 284